అన్వేషించండి

Jawan Movie: ‘జవాన్’ సెన్సార్ రిపోర్ట్: ఆ డైలాగ్ తొలగింపు, ‘రాష్ట్రపతి’పై అభ్యంతరం - 7 కట్స్‌తో సర్టిఫికెట్ జారీ

షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జవాన్‘ సెన్సార్ పూర్తి అయ్యింది. పలు సీన్లను తొలగించడంతో పాటు కొన్ని డైలాగులలో మార్పులను సెన్సార్ బోర్డు సూచించింది. మొత్తంగా ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్‌ జారీ చేసింది.

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో వస్తున్న తాజా సినిమా ‘జవాన్‌’. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్‌ 7న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి.  ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీపై ఓ రేంజిలో అంచనాలను పెంచేసింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్లతో దుమ్మురేపింది. పలు రకాల గెటప్పుల్లో షారుఖ్ ను చూసి మూవీ లవర్స్ ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘దుమ్ము దులిపేలా’, ‘ఛలోనా’ అనే పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.  ‘దుమ్ము దులిపేలా’ పాట కోసం ఏకంగా 1000 మంది డ్యాన్సర్లు పని చేయగా, రూ. 15 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.   ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘పఠాన్‘ హిట్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో  ప్రతి విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. అటు మేకర్స్ సైతం బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇస్తూ మూవీపై అంచనాలు పెంచుతున్నారు.

‘జవాన్’ చిత్రానికి U/A సర్టిఫికేట్‌

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కంప్లీట్ అయ్యింది. మూవీలో మొత్తం 7 మార్పులను సూచించింది సెన్సార్ బోర్డు.  ప్రస్తుతం సెన్సార్ సర్టిఫికేట్ కాపీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దాదాపు 169.18 నిమిషాల నిడివి ఉన్న చిత్రంలో సెన్సార్ బృందం పలు మార్పులను సూచించింది. కొన్ని వివాదాస్పద డైలాగులతో పాటు హింసాత్మక సన్నివేశాలకు కత్తెర వేసింది. ముఖ్యంగా తల నరికివేయబడిన బాడీకి సంబంధించిన విజువల్స్ తొలగించింది. రాష్ట్రపతికి సంబంధించిన ఓ డైలాగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. దాన్ని దేశాధినేతగా మార్చారు. ‘ఉంగ్లీ కర్నా’ అనే డైలాగ్ ను ‘ఉస్సే యూజ్ కరో’గా మార్చారు. మొత్తంగా 7 కట్స్ తర్వాత షారుఖ్ భారీ యాక్షన్ మూవీకి  సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్‌ ఇచ్చింది.

సెప్టెంబ‌ర్ 7న ‘జవాన్‘ విడుదల

ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కు జోడీగా నయనతార నటిస్తుంది. విజయ్ సేతుపతి  విలన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.  ప్రియమణి, సాన్య మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, రిధి డోగ్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ గా  ‘జవాన్’ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న విడుదల కానుంది.  ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. SRK నటించిన ఈ చిత్రం 2023లో విడుదలైన అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా పేరు తెచ్చుకోనుందని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఈ ఏడాది జనవరిలో 'పఠాన్‌'తో ప్రపంచ వ్యాప్తంగా రూ. 1050 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. భారతదేశంలో రూ. 525 కోట్ల నెట్‌తో షారుఖ్.. భారీ బ్లాక్‌బస్టర్‌ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.

Read Also: లావణ్యనే నా ఫోన్ తీసుకుని అలా చేసింది, తనకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గుర్తులేదు: వరుణ్ తేజ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
AP Minister Vasamsetti Subhash : మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
Cricket Match Fixing: క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
Kajal Aggarwal : ఓటీటీలోకి 'చందమామ' రీ ఎంట్రీ - బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్
ఓటీటీలోకి 'చందమామ' రీ ఎంట్రీ - బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Embed widget