Janhvi Kapoor: ‘మిలి’ కోసం 20 రోజులు కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్నా, మానసిక సమస్యలు వెంటాడాయ్: జాన్వీ
జాన్వీ కపూర్ రీసెంట్ గా నటించిన సినిమా 'మిలి'. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వీ. సినిమా షూటింగ్ లో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నారామే.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించిన 'మిలి' సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వీ. సినిమా షూటింగ్ లో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నారామే. ఆ సినిమా షూటింగ్ తన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో జాన్వీ కోల్డ్ స్టోరేజ్ రూమ్ లో ఇరుక్కున్న అమ్మాయి పాత్రలో కనిపిస్తోంది. గంటల తరబడి కోల్డ్ స్టోరేజ్ లో ఇరుక్కుని ఆ అమ్మాయి ప్రాణాలను రక్షించుకోడానికి ఎలా పోరాడగలిగింది, ఎలా బయటపడింది అనే అంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాతో జాన్వీ థ్రిల్లర్ జోనర్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా కు మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'హెలెన్' సినిమా కు 'మిలి' సినిమా రీమేక్. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో ఫ్రీజర్ లో ఇరుక్కున్న అమ్మాయి సజీవంగా ఉంటాడానికి పోరాడే మిలి పాత్రలో జాన్వీ కపూర్ కనిపించనుంది. ఈ సినిమా కోసం మూవీ టీమ్ ఒక ప్రత్యేకమైన ఫ్రీజర్ ను ఏర్పాటు చేసి అందులో షూటింగ్ చేసినట్లు తెలిపింది జాన్వీ. అక్కడ మైనస్ 15 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత వద్ద దాదాపు 20 రోజులు పాటు సన్నివేశాలు చిత్రీకరించినట్లు పేర్కొంది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో తన మానసిక ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపిందని పేర్కొంది. షూటింగ్ తర్వాత ఇంటికి వచ్చాక కూడా ఇంకా ఫ్రీజర్ లోనే ఉన్నట్టు కలలు వచ్చేవని చెప్పింది. ఫ్రీజర్ లో ఎక్కువ రోజులు షూటింగ్ చేయడం వలన తాను శారీరకంగా కూడా ఇబ్బందులు పడ్డానని, ఒంటి నొప్పులతో బాధపడ్డానని, వాటి కోసం మెడిసిన్ కూడా వాడినట్లు పేర్కొంది. తనతో పాటు దర్శకుడు కూడా అనారోగ్యానికి గురి అయ్యారని చెప్పింది. 15 గంటలు ఫ్రీజర్ లో ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంటుందన్నారు. ఈ సినిమా కోసం బరువు కూడా 7.5 కేజీలు పెరిగానని చెప్పింది.
జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ సినిమాతో పాటు పలు సినిమాల్లో కూడా జాన్వీ నటిస్తోంది. బాలీవుడ్ నటి శ్రీ దేవి కూతురు గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ అనతి కాలంలోనే నటిగా నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది జాన్వీ. ఈ సినిమా తర్వాత జాన్వీ బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహిలో కూడా కనిపించనున్నారు. జాన్వీ నటించిన ఈ మిలి చిత్రంలో ఆమెతో పాటు సన్నీ కౌశల్, మనోజ్ పహ్వా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాకి మద్దతుగా నిలుస్తున్న తన తండ్రి బోనీ కపూర్‌తో జాన్వీకి ఇది మొదటి కమర్షియల్ సినిమా. ఈ సినిమా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ఒక్క శుక్రవారం - ఐదుగురు అందగత్తెలకు అగ్ని పరీక్ష - హిట్ కొట్టేది ఎవరు? ఛాన్సలు పట్టుకునేది ఎవరు?