అన్వేషించండి

Janaki Kalaganaledu May 15th: జానకికి బిడ్డలు పుట్టే యోగం లేదని శాపనార్థాలు పెట్టిన నీలావతి

మల్లిక తల్లి కాబోతుందని చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

మల్లిక వాంతులు చేసుకోవడంతో విష్ణు వెళ్ళి డాక్టర్ ని తీసుకొస్తాడు. జ్ఞానంబ తెగ సంతోషపడుతుంది. ఏమైందా అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ ఇంట్లో ఇంకొక పసిబిడ్డ ఏడుపు వినిపించబోతోందని చెప్పేసరికి అందరూ సంతోషిస్తారు. అప్పుడే మల్లిక గది నుంచి బయటకి వస్తుంది. మల్లిక సంతోషంగా మీరు తండ్రి కాబోతున్నారని సిగ్గుపడుతూ చెప్తుంది. అందరూ ఆనందపడతారు. రామ, అఖిల్ విష్ణుని ఎత్తుకుని తిప్పేస్తారు. నేను కాలు పెట్టిన విశేషం ఎంత శుభవార్త తీసుకొచ్చానని నీలావతి అంటుంది. ఇది వరకటిలాగా చెంగు చెంగునా ఎగరడానికి వీల్లేదని మల్లికకి చెప్తుంది. ఇంట్లో ఇద్దరు చంటి పిల్లలు ఉంటే ఇక మిఠాయి బండి ఏం పెడతాను వాళ్ళతోనే సరిపోతుందని అనేసరికి జానకి బాధగా బయటకి వెళ్ళిపోతుంది. జ్ఞానంబ ఇంట్లో అందరికీ స్వీట్స్ తినిపిస్తుంది. జానకి లేదని జ్ఞానంబ గ్రహిస్తుంది. ఇక్కడ ఉంటే ఆనందం భరించలేకపోతుందేమోనని నీలావతి నోటికి పని చెప్తుంది.

జానకి బాధగా నిలబడి ఉంటే జ్ఞానంబ లడ్డు తీసుకొచ్చి తినిపిస్తుంది. ఎందుకు ఒంటరిగా పక్కకి వచ్చేశావని అడుగుతుంది. ఇంట్లోకి మరొక పసిపాప వస్తుందన్న ఆనందం రామ మొహంలో కనిపించింది. కానీ ఆ సంతోషానికి కారణం నువ్వు కాలేకపోయావని బాధతో పారిపోయి వచ్చావాని జ్ఞానంబ అంటుంది. పరిష్కారం నా చేతుల్లో లేనప్పుడు ఏం చేయనని జానకి బాధపడుతుంది. ఖాకీ యూనిఫాం కావాలని కోరుకున్నావ్ దేవుడు ఇచ్చాడు, తల్లిని అవ్వాలని దేవుడిని మనసు పెట్టి అడగటం లేదా? మేము నిజంగా గర్వపడేది ఈ ఇంటి పెద్ద కోడలు తల్లి అయినప్పుడేనని చెప్పి వెళ్ళిపోతుంది. నా భర్త మొహంలో తండ్రి అయ్యాననే సంతోషం ఎప్పుడు చూస్తానోనని జానకి బాధపడుతుంది. నీలావతి, మల్లిక కూర్చుని మాట్లాడుకుంటారు.

Also Read: రాజ్యలక్ష్మిని వణికించేసిన దివ్య- నందుని ఇరికించేందుకు పక్కా స్కెచ్ సెట్ చేసిన లాస్య

ఇప్పుడు వచ్చిన కడుపు ఉత్తుత్తిది కాదు జాగ్రత్తగా ఉండు మీ అత్త నెత్తిన పెట్టి చూసుకుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదని నీలావతి అంటుంది. నీ అదృష్టం చూసి పెద్ద కోడలు లోలోపల ఏడుస్తూ ఉంటుందని సంబరపడతారు. నా డెలివరీ అయ్యేలోపు జానకి కడుపుతో ఉండకూడదు అదే జరిగితే నన్ను దింపి పెద్ద కోడలిని నెత్తిన పెట్టుకుంటుంది. అందుకే అమ్మవారికి పూజ చేయమని మల్లిక చెప్తుంది. ఆ జానకిది దురదృష్టజాతకం ఇప్పటిదాకా పిల్లలు పుట్టలేదంటే అదే అర్థం డానికి జీవితంలో పిల్లలు పుట్టరని అంటుంది. జానకి ఈ ఉమ్మడి కుటుంబంలో అందరికీ ఆయాగా బతకాల్సిందే తనకి అమ్మ అయ్యే రాత లేదని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ మాటలు విని జానకి మరింత బాధపడుతుంది.

Also Read: ఉత్కంఠ నడుమ పూర్తయిన రిషిధార నిశ్చితార్థం- అంతుచిక్కని శైలేంద్ర ప్లాన్

అన్నదానం చేసేందుకు రామ వాళ్ళు వెళ్లబోతుంటే నీలావతి మళ్ళీ పుల్ల వేస్తుంది. ఇప్పుడు ఈ అన్నదానం రామ జైలు నుంచి విడుదలైనందుకా లేదంటే మల్లిక తల్లి కాబోతున్నందుకా అని అడుగుతుంది. రామ మొక్కు ఇంకోసారి తీర్చుకోవచ్చులేనని జానకి అంటుంది. అమ్మవారికి మొక్కుకుని చివరి నిమిషంలో మనసు మార్చుకోవడం సరి కాదని గోవిందరాజులు కోపంగా చెప్తాడు. అంటే మల్లిక తల్లి అవడం కంటే రామ విడుదల కావడం ఎక్కువగా సంతోషిస్తున్నారన్న మాట అని పుల్ల వేస్తుంది. మల్లిక తల్లి అవడం మాకు చిన్న విషయం కాదు పండగ దాన్ని ఎవరూ తక్కువ చేసి చూడటం లేదు త్వరలోనే పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాట్లు చేస్తామని జ్ఞానంబ చెప్తుంది. రామ వాళ్ళని వేరే ఊరు వెళ్ళమని బట్టలు సర్దుకోమని అంటుంది.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget