News
News
X

Janaki Kalaganaledu January 6th: జానకిని నోటికొచ్చినట్టు తిట్టిన అఖిల్- జ్ఞానంబ కుటుంబం రోడ్డున పడుతుందా?

జానకి ఐపీఎస్ పుస్తకం పట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

కన్నబాబు కుట్రతో వడ్డీ వ్యాపారి భాస్కర్ జ్ఞానంబ ఇంటి కాగితాలు తన చేతిలో పెడతాడు. జానకి ఇదే విషయం మీద అనుమానం వ్యక్తం చేస్తుంది. అవి చూస్తూ ఇప్పుడు రామా పిలక తన చేతిలో ఉన్నట్టు కన్నబాబు సంతోషపడతాడు. రామాకి ఇచ్చిన డబ్బు మీ అమ్మకి ఇవ్వాలసినవి అతను అడిగేసరికి ఇచ్చాను, ఈ విషయం చెప్పేసరికి మీ అమ్మ ఈ ఐడియా ఇచ్చారు అందుకే మూడు రోజుల గడువు పెట్టి డబ్బు ఇవ్వమని చెప్పాను అని భాస్కర్ చెప్తాడు. ఈ డాక్యుమెంట్స్ అడ్డం పెట్టుకుని వాళ్ళని రోడ్డు మీద పడేస్తాను అని కన్నబాబు అంటాడు.

రామా మాత్రం వడ్డీ వ్యాపారి అలా మాట్లాడటానికి ఏదో కారణం ఉంటుందని అనిపించడం లేదని అంటాడు. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నా అనేసరికి ఆయనకి భయం ఉండి ఉంటుంది అందుకే అలా మాట్లాడి ఉంటారని చెప్తాడు. ఈ గండం నుంచి ఎలా బయటపడాలో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటారు. జ్ఞానంబ తినకుండా కూర్చుని బాధపడుతూ ఉంటే అఖిల్ భోజనం తీసుకుని వస్తాడు. వాడు తీసుకొస్తే తినను అని మీ పెద్దన్నయ్య నీ చేతికిచ్చి పంపించాడా అని అడుగుతుంది. ఆ మాటలు రామా, జానకి చాటుగా వింటారు. నువ్వు తినలేదని జెస్సి చెప్తే తీసుకొచ్చానని కవర్ చేస్తాడు కానీ జ్ఞానంబ మాత్రం నమ్మదు.

జ్ఞానంబ: నాకు తెలుసు జెస్సి పంపించిందంటే నేను ఎలా నమ్ముతాను. మీ అన్నయ్య పంపించాడని తెలుసు

Also Read: బెనర్జీ ప్లాన్ తెలుసుకున్న తులసి- లాస్యకి వంత పాడి నందు చిక్కుల్లో పడబోతున్నాడా?

అఖిల్: అవునమ్మా నీ దగ్గర దాచేది ఏముంది

జ్ఞానంబ: ఈ ఇంట్లో ఎవరి మనస్తత్వం ఏంటో నాకు తెలుసు, నా ఆకలి, సంతోషం ఎవరు కనిపెడతారో నాకు తెలుసు. ఈ ఇల్లు ఉంటుందో పోతుందో తెలియదు, ఒకవేళ పోతే నా బిడ్డలు రోడ్డున పడతారని బాధతో ఆకలి ఎలా అవుతుంది. రామా, జానకి నా దగ్గర నిజం దాచి పరాయి వాళ్ళలా చేశారు అని బాధపడుతుంది.

మల్లిక ఇల్లు వదిలి వెళ్లిపోతున్నాం కదా అని బట్టలు సర్దుతూ తెగ సంతోషపడుతుంది. విష్ణు వచ్చి ఏంటి బ్యాగ్ సర్దుతున్నావ్ అని అడుగుతాడు. బావగారు డబ్బులు కట్టకపోతే ఇల్లు ఉండదు కదా అందుకే వెళ్లిపోవడానికి రెడీ అయిపోయాను. మన కోసం ఇల్లు కూడా చూశాను అని తెగ సంకలు గుద్దుకుంటుంది. మనం వేరుగా వెళ్లిపోతే వాళ్ళకి భారం తగ్గుతుంది, మనకి సంతోషంగా ఉంటుందని నచ్చజెపుతుంది. తల్లి తన వల్ల భోజనం తినడం లేదని రామా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా జెస్సి వస్తుంది.

జెస్సి: అఖిల్ ఉద్యోగం కోసం మీరు అప్పు చేశారని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. మీ వ్యక్తిత్వం నాకు తెలుసు, తమ్ముడి మీద మీకున్న ప్రేమ అందరి ముందు దోషిని చేసింది. డబ్బుల కోసం మా నాన్నని అడగండి ఆయన దగ్గర లేకపోయినా తెలిసిన వాళ్ళని అడుగుతాడు

రామా: నన్ను నమ్మినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఇటువంటి టైమ్ లో డబ్బులు అడగటం మంచిది కాదు

Also Read: 'నా యాక్టింగ్ నమ్మేశావా' అంటూ షాకిచ్చిన యష్- గుండెలు పగిలేలా ఏడ్చిన వేద

జానకి: చాలా థాంక్స్ జెస్సి అఖిల్ కోసం ఇన్ని మాటలు పడుతున్నా తను నమ్మలేదు కానీ నువ్వు పరిస్థితి అర్థం చేసుకున్నావ్ సంతోషంగా ఉంది

జెస్సి: నువ్వు నాకు లైఫ్ ఇచ్చావ్ మీరు నాకు సపోర్ట్ చేయకపోతే ఈ ఇంటి కోడలిని అయ్యేదాన్ని కాదు కానీ మీకు ఈ టైమ్ లో సపోర్ట్ చేయలేకపోతున్నా అని బాధపడుతుంది.

జానకి గోవిందరాజులకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. రామా గురించి అడుగుతాడు. డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్తుంది. దీంతో గోవిందరాజులు తనకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి అఖిల్ ఉద్యోగం కోసం డబ్బులు పెట్టి రామా మోసపోయాడని ఫోన్లో చెప్తూ ఉండటం అఖిల్ వింటాడు. దీంతో కోపంగా తండ్రి దగ్గరకి వచ్చి గట్టిగా అరుస్తాడు. అసలు ఇదంతా పెద్దోదిన వల్లే అని జానకి గురించి నోటికొచ్చినట్టు మాటలు అంటాడు.

Published at : 06 Jan 2023 10:35 AM (IST) Tags: janaki kalaganaledu serial today episode Janaki Kalaganaledu Serial Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial January 6th Update

సంబంధిత కథనాలు

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్