Janaki Kalaganaledu January 25th: సరదాగా అత్తాకోడళ్ల ముగ్గుల పోటీ- అందరి సంతోషాన్ని చెడగొట్టిన మల్లిక
రామా చేసిన అప్పు వల్ల జ్ఞానంబ కుటుంబం కష్టాలు పడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
అందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ పూజ జరుపుకుంటూ ఉంటారు. కష్టాలు ఉన్న దేవుడి మీద భక్తి పోకూడదు కష్టాలు అన్నీ తొలగిపోవాలని వేడుకోమని జ్ఞానంబ చెప్తుంది. రాత మారింది, ఉన్న చోటు మారింది ఎప్పుడు మాతో ఉండే ఆనందం మా నుంచి వెళ్ళిపోయింది, మా సమస్యలన్నీ తీరిపోయి మళ్ళీ ఆనందంగా ఉండేలా చూడమని జ్ఞానంబ దేవుడిని వేడుకుంటుంది. తన వల్ల జరిగిన కష్టం తీర్చి మళ్ళీ తన తల్లి ఎప్పటిలాగా ఉండాలని రామా కోరుకుంటాడు. ముగ్గురు కోడళ్ళు ఇంటి ముందు కూర్చుని ముగ్గులు పెడుతూ సరదాగా ఉంటారు.
ముగ్గుల పోటీలో జ్ఞానంబ అందరినీ ఓడిస్తుందని గోవిందరాజులు అంటాడు. ఆ మాటకి మల్లిక అప్పుడు గెలిచారు కానీ ఇప్పుడు కాదు ఒడిపోతారని అంటుంది. నేను ముగ్గు గిన్నె పట్టుకుంటేనే ఆడవాళ్ళు అందరూ భయపడతారని అంటుంది. అయితే మీరు ముగ్గు వేయండి చూడాలని ఉందని అంటారు. దీంతో అత్త కోడళ్ళు అందరూ కలిసి ఇంటి ముందు ముగ్గులు వేస్తూ సరదాగా వేస్తూ ఉంటారు. ఈ పోటీలో తను గెలిస్తే అడిగింది చేయాలని అటుంది. విష్ణు మల్లిక ముగ్గు వేస్తుంటే డిస్ట్రబ్ చేస్తూ ఉంటాడు. అందరి కంటే ముందు తన ముగ్గు అయిపోయిందని అద్భుతాన్ని చూడామని తెగ గోల చేస్తుంది. అందరూ అది చూసి అసలు ముగ్గేనా అంటారు. ఇంట్లో బీరువా తీసుకొచ్చి రోడ్డు మీద వేసినట్టు ఉందని విష్ణు ఎగతాళి చేస్తాడు.
Also Read: నందుని అడుగడుగునా అవమానించిన కుటుంబం- లాస్యని పనిమనిషి చేసేసిన భాగ్య
కష్టపడి ఫోన్లో చూసి మరీ నేర్చుకున్నానని అంటుంది. అందరి ముగ్గుల కంటే అత్తయ్య ముగ్గు బాగుందని జానకి అంటుంది. ఇంటిముందు ముగ్గు ఆ ఇంటి ఆడవాళ్ళ ఓర్పు నేర్పు చెప్తుంది అని జ్ఞానంబ అంటుంది. ముగ్గు అంటే నాలుగు చుక్కలు పది గీతలు కాదు ఇంటి ఆడపిల్ల మనస్తత్వం అని చక్కగా చెప్తుంది. పోలేరమ్మ ఒడిపోతే బయటకి వెళ్లవచ్చని అనుకుంటే ఇలా జరిగింది ఏంటని మల్లిక అనుకుంటుంది. అప్పుడే ఒకాయన వచ్చి ప్రతి సంవత్సరం అనాథ ఆశ్రమానికి మీరు స్వీట్స్ పంపిస్తారు కదా ఈసారి కూడా పంపిస్తారా అని అడుగుతాడు. షాపు పోతే ఇంక స్వీట్స్ పంపించడం ఏంటి? ఇప్పుడు మేము ఇచ్చే స్థితిలో లేము, ఇస్తే పుచ్చుకునే స్థితిలో ఉన్నాం అని మల్లిక అనేసరికి అక్కడి వాళ్ళు అందరూ గుసగుసలాడుకుంటారు.
Also Read: పెళ్ళాం ఫోటో చూసుకుని మురిసిపోయిన యష్- భ్రమరాంబిక అవమానం, ఆగ్రహించిన మాళవిక
మనం ఇంట్లో కాదు వీధిలో ఉన్నామని గోవిందరాజులు అంటాడు. కానీ మల్లిక మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. తన మాటలకి జ్ఞానంబ బాధగా వెళ్ళిపోతుంది. సంతోషాన్ని కాసేపటిలో ఆవిరి చేసేస్తుంది. మల్లిక మాట తీరు తెలిసిందే కదా అని గోవిందరాజులు సర్ది చెప్తాడు. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం చేస్తున్న కార్యక్రమం ఈసారి చేయలేకపోతున్నామని బాధగా ఉందని అంటుంది. ప్రతి ఏడాది అమ్మ తమ్ముడి జ్ఞాపకార్థంగా పుస్తకాలు, స్వీట్లు పంచిపెడుతుందని రామా జానకికి చెప్తాడు. కనీసం తమ్ముడి కోసం ఈ చిన్న పని కూడా చేయలేకపోయే స్థితికి దిగజారిపోయామని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. విష్ణు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన అడిగిన పని చేయాలని అనుకుంటున్నారా ఏంటి అలా చేస్తే ఒప్పుకోను అని మల్లిక నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ మాటలు విని జానకి తనని తిడుతుంది. నీ మేనమామ గురించి మాట్లాడుతుంటే ఏమి అనలేవా నువ్వు అని విష్ణుకి కూడా గడ్డి పెడుతుంది.