Ennenno Janmalabandham January 25th: పెళ్ళాం ఫోటో చూసుకుని మురిసిపోయిన యష్- భ్రమరాంబిక అవమానం, ఆగ్రహించిన మాళవిక
యష్, వేద మధ్యలోకి విన్నీ రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
విన్నీ వేద వాళ్ళని తన భర్తని పార్టీకి రమ్మని పిలుస్తాడు. దీంతో వేద యశ కి ఫోన్ చేసి పార్టీకి రమ్మని బతిమలాడుతుంది. కానీ యష్ మాత్రం ఒప్పుకోడు. ‘మీ నుంచి నేనేమీ కొంచెం ప్రేమ కూడ కోరుకోలేదు కదా. మీ గురించి విన్నీకి చాలా గొప్పగా చెప్పాను. ప్లీజ్ రండి’ అని వేద అడుగుతుంది. యష్ మాత్రం రాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. విన్నీ వచ్చి ఏంటి మీ హజ్బెండ్ రాను అన్నాడా అని అంటాడు. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని వేద తనని అడుగుతుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. వేద తన భర్త గురించి చెప్పేసరికి తనని కలవాలని ఉందని విన్నీ అంటాడు. భోగి పండుగ రోజు ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది.
Also Read: తన తిక్క చేష్టలతో నవ్వులు పూయించిన లాస్య- మొహాన నీళ్ళు కొట్టిన రాములమ్మ
యష్ వేద పార్టీకి రమ్మని విషయం గుర్తు చేసుకుని కోపంగా ఉంటాడు. పార్టీకి రాను అంటే బతిమలాడొచ్చు కదా, ఏంటి అంట ఇగో. కాసేపు బతిమలాడితే వచ్చేవాడిని కదా. మళ్ళీ ఫోన్ చేస్తే బెట్టు చేయకుండా పార్టీకి వస్తాను అని చెప్పేస్తా అనుకుని తన ఫోన్ లో వేద ఫోటో చూసుకుని మురిసిపోతాడు. ఆ ఫోన్ వేద చూసి తన ఫోటో డీపీగా పెట్టుకున్నాడని సంతోషపడుతుంది. చిటపటలాడతారు కానీ మరీ అంత చెడ్డవారు కాదు. ఫీలింగ్స్ అన్నీ లోపల దాచుకుని బయటకి యారగెంట్ లాగా ఉంటారు. బయట పెట్టొచ్చు కదా శ్రీమతి దగ్గర బెట్టు అవసరమా’ అని అనుకుంటూ ఉండగా యష్ వస్తాడు. ఏంటి నా ఫోన్ చెక్ చేస్తున్నావా అని అంటాడు.
తను చాలా బ్యూటీఫుల్. నా లైఫ్ లో స్పెషల్ పర్సన్ అని చెప్తాడు. తన గురించే అనుకుని వేద మురిసిపోతుంది. కానీ యష్ మాత్రం గాలి తీసేస్తాడు. ఖుషి ఫోటో పెట్టుకున్నా అని అంటాడు. విన్నీ వస్తున్నాడని కాస్త మంచిగా బిహేవ్ చెయ్యమని చెప్తుంది. ఆ బఫూన్ గాడు వస్తే నేను కలవాలా అనుకుంటాడు. భ్రమరాంబిక డైనింగ్ టేబుల్ దగ్గర సీన్ చేస్తుంది. మాళవిక గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది. ఎవరో ఇద్దరు పిల్లల తల్లి అంట పిచ్చెక్కి రోడ్డు మీద పడింది. ఒళ్ళు కొవ్వెకకి మొగుడు, పిల్లల్ని వదిలేసి డబ్బున్న వాడిని తగులుకుంది. దీంతో పిచ్చెక్కి రోడ్డు మీద పడింది. ఇలాంటి ఆడదాని వల్ల ఆడజాతికె అవమానం అని కోపంగా అనేసి వెళ్ళిపోతాడు.
Also Read: యష్, విన్నీ వార్ స్టార్ట్ - ఫ్రెండ్ ని చూసి తెగ సంతోషపడిపోయిన వేద
ఖైలాష్ ఆ మాటలు విని మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ తనకి తెలిసిపోయి ఇలా మాట్లాడిందేమో అని అంటాడు. ఆ మాటలకి మాళవిక సీరియస్ అవుతుంది. విషయం కుండ బద్ధలు కొట్టేయవచ్చు కదా అని అంటుంది. నేను, మీ అక్క ఎవరో ఒకరు కావాలో తేల్చుకో అనే పరిస్థితి వస్తే ఏం చేస్తావ్ అని మాళవిక అడుగుతుంది. నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటా అని అంటాడు. ఆ మాటకి మాళవిక మురిసిపోతుంది.