Ennenno Janmalabandham January 24th: యష్, విన్నీ వార్ స్టార్ట్ - ఫ్రెండ్ ని చూసి తెగ సంతోషపడిపోయిన వేద
యష్ వేద మధ్యలోకి విన్నీ రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

యష్ రాను అనేసరికి వేద ఒక్కతే విన్నీని కలవడానికి వెళ్తుంది. కాసేపటికి యష్ కూడా అక్కడికి వస్తాడు. విన్నీ విన్నీ అని వేద తెగ కలవరిస్తుంది, అతను ఎవరో తెలుసుకోవాలి, జోక్స్ పంపిస్తున్నాడంటే బాగా డేరింగ్ అండ్ డాషింగ్ లాగా ఉన్నాడు. నాకంటే అందంగా ఉంటాడా, హైట్ గా ఉంటాడా అని అనుకుంటూ యష్ హోటల్ లోపలికి వస్తాడు. విన్నీ ఇంకా రాలేదని కుహసిన యష్ తీయం కి రావాలని తెలియదా బ్యాడ్ మానర్స్ అని యష్ తిట్టుకుంటాడు. కానీ వేద మాత్రం విన్నీ గురించి నాకు తెలుసు ఏదైనా అర్జెంట్ పని ఉండి లేట్ అయ్యింది ఏమో అని అనుకుంటూ ఉండగా ఒకతను పూల బొకే తీసుకుని వస్తాడు. అతన్ని చూసి విన్నీ అనుకుని పొరపాటు పడతాడు. బఫూన్ లా ఉన్నాడనుకుని అక్కడి నుంచి వెళ్లిపోబోతుంటే ఒకమ్మాయి సైట్ కొడుతుంది.
Also Read: తులసి అవతారమెట్టిన లాస్య, వాట్ ఏ కామెడీ- జరిగింది తలుచుకుని వణికిపోతున్న దివ్య
ఇప్పుడు వెళ్ళి ఆ బఫూన్ గాడిని కలవడం ఎందుకు సైలెంట్ గా జారుకోవడం బెటర్ అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనవసరంగా టెన్షన్ పడ్డాను తీరా చూస్తే పిడత మొహం వేసుకుని సర్కస్ లో బఫూన్ లా ఉన్నాడని తెగ సంతోషపడిపోతాడు. వాడేవాడో ఎన్ఆర్ఐ ని చూసి జలస్ ఫీల్ అవడం ఏంటని కాసేపు తన గురించి తను పొగుడుకుంటాడు. కరెక్ట్ గా యష్ వెళ్లబోతుంటే ఒక వ్యక్తి డాష్ ఇస్తాడు. యష్ కిందపడబోతుంటే అతను పట్టుకుంటాడు. దానికి యష్ అతనితో గొడవపడతాడు. లైఫ్ లో మనం కలవకూడదు అనుకుంటారు ఇద్దరూ. మీ వైఫ్ ఎవరో కానీ మిమ్మల్ని భరిస్తుంది ఆవిడకి నా సానుభూతి అనేసి అతను వెళ్ళిపోతాడు. రత్నం, శర్మ ఫ్లాట్స్ లో సంక్రాంతి పండుగ ఏర్పాట్లు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
Also Read: విన్నీ గోల, యష్ చిరాకు- చిత్ర, వసంత్ పెళ్లి అవుతుందా?
యష్ తో గోడవపడిన వ్యక్తి లోపలికి వచ్చి వేదని పలకరిస్తాడు. అతను ఎవరో కాదు వేద ఫ్రెండ్ విన్నీ. బయట ఒక అపరిచితుడు తగిలాడు పొరపాటున డాష్ ఇచ్చాను గొడవపెట్టేసుకున్నాడు, అతన్ని చూసి ఇలాంటి మనషులు కూడా ఉంటారా అని అనిపిస్తుందని విన్నీ అంటాడు. ఆ అపరిచితుడు భార్య ఎవరో కానీ చూడాలని ఉందని అంటాడు. వేద కూడా విన్నీతో కలిసి డాష్ ఇచ్చిన వ్యక్తి యష్ అని తెలియక తిడుతుంది. ఇంత అందంగా ఉన్నావ్ ఏంటి ఆ రహస్యం అని విన్నీ అడుగుతాడు. నేను సంతోషంగా ఉన్నా, అందుకు కారణం ఖుషి, నేను ఒక అమ్మని నాకొక కూతురు ఉంది అని హ్యపీగా చెప్తుంది. ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఇంట్లో పార్టీ ఇస్తున్నా అని విన్నీ వేదని ఇన్వైట్ చేస్తాడు, తన భర్తని కూడా తీసుకురమ్మని చెప్తాడు. వేద యష్ కి ఫోన్ చేసి విన్నీ పార్టీకి పిలిచాడని చెప్తుంది.
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















