News
News
X

Gruhalakshmi January 23rd: తులసి అవతారమెట్టిన లాస్య, వాట్ ఏ కామెడీ- జరిగింది తలుచుకుని వణికిపోతున్న దివ్య

లాస్య నిజస్వరూపం బయటపడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

తనని వదిలేయమని దివ్య తన ఫ్రెండ్ కార్తీక్ ని బతిమలాడుతుంది. అటు నందు తన పోలీస్ ఫ్రెండ్ రామారావుని కలిసి విషయం చెప్తాడు. దివ్య ఫోన్ నెంబర్ ద్వారా తన లొకేషన్ ఎక్కడో ట్రేస్ చేస్తాను ఫాలో అవు అని పోలీస్ చెప్తాడు. తులసి, ప్రేమ్ దివ్య ఉన్న ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి చేతన్ అక్కడి నుంచి పారిపోబోతుంటే ప్రేమ్ వాడిని పట్టుకుని కొడతాడు. తులసి లోపలికి వెళ్ళి కార్తీక్ ని కొట్టి దివ్యని కాపాడుకుంటుంది. అబద్ధం చెప్పి పార్టీకి వచ్చాను తప్ప ఏ తప్పు చేయలేదని దివ్య ఏడుస్తూ చెప్తుంది. నా కూతురి మీద నమ్మకం ఉంది నువ్వు ఏ తప్పు చేయలేదని తులసి తనకి ధైర్యం చెప్తుంది. ప్రేమ్ వచ్చి వాళ్ళని కొడతాడు. మత్తు మంది ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చారని ఎంత బతిమలాడిన పంపించలేదని దివ్య ఏడుస్తూ చెప్తుంది.

Also Read: విన్నీ గోల, యష్ చిరాకు- చిత్ర, వసంత్ పెళ్లి అవుతుందా?

నందు పోలీసాఫీసర్ తో కలిసి అక్కడికి వచ్చి వాళ్ళని కొడతాడు. కేసు పెడితే తమ భవిష్యత్ నాశనం అవుతుందని కార్తీక్ అడుగుతాడు కానీ తులసి మాత్రం అందుకు ఒప్పుకోదు. ఆడపిల్లల గురించి కాసేపు క్లాస్ తీసుకుంటుంది. బాయ్స్ ఎంత అడిగినా కూడా తులసి వాళ్ళని అరెస్ట్ చేయిస్తుంది. దివ్య పేరు మాత్రం బయటకి రాకూడదని పోలీస్ ని అడుగుతుంది. ఇంట్లో అందరూ దివ్య కోసం కంగారుగా ఎదురు చూస్తూ ఉండగా తులసి వాళ్ళు వస్తారు. దివ్యని చూసి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అనసూయ దివ్య అని పిలిచి వెళ్లబోతుండగా భయపడి వణికిపోతుంది. తులసిని పట్టుకుని ఎవరి దగ్గరకి వెళ్ళకుండా గదిలోకి వెళ్ళిపోతుంది.

దివ్య ఏడుస్తూ ఉంటే తులసి ధైర్యం చెప్తుంది. తప్పు చేశాను అబద్ధం చెప్పి అందరినీ బాధపెట్టాను నన్ను చంపేయ్ అని దివ్య ఏడుస్తుంది. జరిగింది అంతా ఒక పీడకల అని మర్చిపో, మేము ఏం అడగం, నువ్వు ఏం చెప్పొద్దు అని అంటుంది. సమయానికి నువ్వు రాకపోయి ఉంటే ఏమై పోయి ఉండేదని దివ్య ఏడుస్తుంది. జరిగిన విషయం గురించి ఎవరూ దివ్యతో డిస్కస్ చేయవద్దని తులసి ఇంట్లో అందరికి చెప్తుంది. తర్వాత తులసి లాస్యకి వార్నింగ్ ఇస్తుంది. నా పిల్లల జోలికి వస్తే వదిలిపెట్టను తాచుపాములా పడగవిప్పుతా, ప్రమాదం నుంచి దివ్య బయటపడింది కాబట్టి నువ్వు బతికిపోయావ్, తనకి ఏదైనా అయితే ఇంకొక తులసిని చూసేదానివి అని వార్నింగ్ ఇస్తుంది.

Also Read: కూతుర్ని కాపాడుకున్న తులసి- ఇక లాస్య పని అవుట్

తులసి దివ్యకి భోజనం తీసుకొచ్చి తినిపిస్తుంది. దివ్య తన గురించి ఏమనుకుంటుందో అడుగుతుంది. బయటకి వెళ్ళినప్పుడు ప్రతిక్షణం ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావ్ అని అడగటానికి కారణం ఏంటో ఈరోజైన అర్థం అయ్యిందా. అది తల్లిగా తన జాగ్రత్త అని తులసి అంటుంది. కాసేపు దివ్యకి క్లాస్ పీకుటుంది.

తరువాయి భాగంలో..

రాములమ్మ దివ్య మొహాన నీళ్ళు కొట్టి మరీ నిద్ర లేపుతుంది. తర్వాత లాస్య తులసిలా మారి ఇల్లు తుడుస్తూ ఉంటుంది. తనని వెనుక నుంచి చూసి పనిమనిషి రాములమ్మ అనుకుని కాఫీ తీసుకురమ్మని నందు అడిగేసరికి లాస్య బిత్తరపోతుంది.

Published at : 23 Jan 2023 09:25 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial January 23rd Update

సంబంధిత కథనాలు

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

సిద్దార్థ్- కియారా జంటకు క్షమాణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..

సిద్దార్థ్- కియారా జంటకు క్షమాణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..

Ennenno Janmalabandham February 8th: బయటపడిన అభిమన్యు అసలు రంగు, మాళవిక బతుకు బస్టాండ్- మనసులతో ఊసులాడుకున్న వేద, యష్

Ennenno Janmalabandham February 8th: బయటపడిన అభిమన్యు అసలు రంగు, మాళవిక బతుకు బస్టాండ్- మనసులతో ఊసులాడుకున్న వేద, యష్

Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్

Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్

Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది

Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది

టాప్ స్టోరీస్

ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్‌

ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్‌

Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు

Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్