Gruhalakshmi January 21st: కూతుర్ని కాపాడుకున్న తులసి- ఇక లాస్య పని అవుట్
లాస్య నిజస్వరూపం బయట పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
దివ్యని తప్పుదోవ పట్టించి తన ఫ్రెండ్స్ కారులో తీసుకెళ్తూ ఉంటారు. దివ్య పార్టీ జరిగే ఇంటి లొకేషన్ పంపించిందని లాస్య చెప్తుంది. వెంటనే ఆ లొకేషన్ కి ప్రేమ్, తులసి, నందు బయల్దేరతారు. తనని ఎక్కడికో తీసుకెళ్తున్నారని అర్థం చేసుకున్న దివ్య హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తుంది. ప్రేమ్, తులసి పార్టీ జరిగిన ఇంటికి వచ్చి అక్కడి వాచ్ మెన్ ని అడుగుతారు. దివ్య ఫోటో చూపించి ఈ అమ్మాయి వచ్చిందా చూశావా అని ప్రేమ్ అడుగుతాడు. చూశాను మత్తుగా ఉన్నట్టుగా అనిపించింది, తనని ఓ ఇద్దరు అబ్బాయిలు కారు ఎక్కించుకుని వెళ్లారని చెప్తాడు. నందు వచ్చి ఏమైందని అడుగుతాడు. తులసి కంగారుగా విషయం చెప్పి భయపడుతుంది. ప్రేమ్ ఆలస్యం చేయకుండా పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటాడు. కానీ తులసి మాత్రం వద్దు పెళ్లి కావాల్సిన పిల్ల జీవితం నాశనం అయిపోతుంది, దివ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని తులసి విలవిల్లాడిపోతుంది.
Also Read: మత్తులో దివ్య- ఇంట్లో నిజం చెప్పిన లాస్య, టెన్షన్ లో తులసి
మళ్ళీ అందరూ దివ్య కోసం వెతుకుతూ ఉంటారు. ఇంట్లో అనసూయ మనవరాలి గురించి బాధపడుతూ ఏడుస్తుంది. దివ్య కోసం వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదని కంగారు పడతారు. అందరూ ఇదంతా లాస్య వల్లే జరిగిందని తిడతారు. దివ్యకి ఏమైనా అయితే తులసి నిన్ను చావగొడుతుందని పరంధామయ్య బెదిరిస్తాడు. లాస్య నందుకి ఫోన్ చేసి దివ్య దొరికిందా అని అడుగుతుంది. లేదని అసలు విషయం చెప్తాడు. అది విని అందరూ చాలా టెన్షన్ పడతారు. దివ్యని తన ఫ్రెండ్స్ కార్తీక్, చేతన్ ఒక ఇంటికి తీసుకొస్తారు. తన మీద అఘాయిత్యం చేసేందుకు ట్రై చేస్తారు. తనని వదిలిపెట్టమని దివ్య చాలా బతిమలాడుతుంది. కానీ వాళ్ళు మాత్రం చండాలంగా మాట్లాడతాడు. దివ్యని వదిలేద్దామని మరొక అబ్బాయి చేతన్ అంటాడు. కానీ కార్తీక్ మాత్రం విడిచిపెట్టేది లేదని అంటాడు.
Also Read: యష్, వేద మధ్యలో విన్నీ- అభికి సంబంధాలు చూస్తున్న భ్రమరాంబిక, మరి మాళవిక పరిస్థితేంటి?
తులసి, ప్రేమ్ దివ్య కోసం వెతుకుతూ కనిపించలేదని భయపడుతుంది. శ్రుతి ప్రేమ్ కి ఫోన్ చేసి టెన్షన్ గా ఉందని అడుగుతుంది. మేము దివ్యని వెతకడానికి వస్తామని చెప్తుంది. కానీ ప్రేమ్ మాత్రం వద్దని అంటాడు. అప్పుడే తులసికి దివ్యని కనిపెట్టే ఐడియా వస్తుంది. జీపీఎస్ ద్వారా దివ్య ఎక్కడ ఉందో కనుక్కోవచ్చు ఏమో అని తులసి అంటుంది. వెంటనే ప్రేమ్ తన ఫోన్ లో జీపీఎస్ ద్వారా దివ్య ఉన్న లొకేషన్ తెలుసుకుని బయల్దేరతారు. దివ్య వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది.
తరువాయి భాగంలో..
చేతన్ దివ్య జోలికి వెళ్లొద్దని చెప్పేసరికి కార్తీక్ తనని బయటకి పంపించేస్తాడు. అటు నందు తన పోలీస్ ఫ్రెండ్ ని కలిసి సహాయం చేయమని అడుగుతాడు. ప్రేమ్, తులసి కరెక్ట్ టైమ్ కి దివ్య ఉన్న ఇంటి దగ్గరకి చేరుకుంటారు. వాళ్ళని చూసి చేతన్ టెన్షన్ పడిపోతూ పారిపోవడానికి ట్రై చేస్తాడు.