Ennenno Janmalabandham January 20th: యష్, వేద మధ్యలో విన్నీ- అభికి సంబంధాలు చూస్తున్న భ్రమరాంబిక, మరి మాళవిక పరిస్థితేంటి?
వేద, యష్ మళ్ళీ ఇంటికి తిరిగి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Ennenno Janmalabandham January 20th: యష్, వేద మధ్యలో విన్నీ- అభికి సంబంధాలు చూస్తున్న భ్రమరాంబిక, మరి మాళవిక పరిస్థితేంటి? Ennenno Janmalabandham Serial January 20th Episode 330 Written Update Today Episode Ennenno Janmalabandham January 20th: యష్, వేద మధ్యలో విన్నీ- అభికి సంబంధాలు చూస్తున్న భ్రమరాంబిక, మరి మాళవిక పరిస్థితేంటి?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/20/640a3c41e40d0178ea0b1c14671ac8e31674182987501521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యష్ కోసం వేద ఎదురుచూస్తూ ఉంటాడు. తాతయ్య పంపించిన ఫోటోస్ చూశావా బాగున్నాయ్ కదా అని యష్ అంటే వేద మాత్రం కోపంగా చాలా బాగున్నాయ్ అవి నిజం కాదు కదా అని అంటుంది. బెస్ట్ సీఈవోగానే కాదు నటనలో కూడా బెస్ట్ గానే ఉన్నారు. తాతయ్య వాళ్ళని బాగానే నమ్మించారు, అది నిజమని నేను కూడా అని వేద చెప్పబోయి ఆగిపోతుంది. మళ్ళీ మాట దాటేసి వెళ్ళిపోతుంది. ఇద్దరూ పడుకున్న తర్వాత చిత్ర వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఖుషిని సులోచన తీసుకురమ్మందని చెప్పి తనని తీసుకుని వెళ్ళిపోతుంది. పడుకుని ఇద్దరూ మళ్ళీ మనసులోనే మాట్లాడుకుంటారు.
Also read: లాస్య వల్ల ప్రమాదంలో పడిన దివ్య జీవితం- కూతుర్ని తులసి కాపాడుకుంటుందా?
వేదని పలకరిస్తాడు. ఏంటి చాలా కోపంగా ఉన్నావ్ ఎవరి మీద ఆ కోపం అని అడుగుతాడు. ఉన్నారులే ఖుషి వాళ్ళ నాన్న అని అంటుంది. పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి కదా వాటికి మీకు తేడా లేదని తిడుతుంది. ఫోన్ చేస్తే విసుక్కుంటారా అని వేద చిర్రుబుర్రులాడుతుంది. వేదని కూల్ చేయడం కోసం మాళవికని తిడుతూ ఉంటాడు. ఇద్దరూ ఒకరి తప్పులు మరొకరు ఎత్తి చూపుకుంటూ దారుణంగా గొడవపడతారు. కాసేపటికి ఇద్దరూ తమ ఫోన్స్ లో ఊర్లో కలిసి దిగిన ఫోటోస్ చూసుకుంటూ మురిసిపోతారు. మాళవిక టిఫిన్ తింటూ ఉంటే భ్రమరాంబిక వస్తుంది. మాళవికకి పెళ్లి అయ్యిందని ఇద్దరు పిల్లల తల్లి, అభితో లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉందని ఖైలాష్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని భ్రమరాంబిక రగలిపోతుంది. ఫోన్ అడ్డం పెట్టుకుని మాళవికని ఇన్ డైరెక్ట్ గా తిడుతుంది. అభి వచ్చి ఎవరిని అంతగా తిడుతున్నావ్ అని అడుగుతాడు.
Also Read: మళ్ళీ మొదలైన వేద, యష్ కీచులాట- భ్రమరాంబికకి మాళవిక గురించి నిజం చెప్పిన ఖైలాష్
‘అభి పెళ్లి కావాల్సిన వాడు తన ఇంట్లో ఇంకొక అమ్మాయి ఉందంటే బయట జనాలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీ ఇద్దరి భవిష్యత్ బాగుండాలంటే నీ ప్రాబ్లమ్స్ తీర్చేసుకో. అభికి సంబంధాలు చూస్తున్నా, త్వరలో మంచి సంబంధం కుదరాలని కోరుకో’ అని భ్రమరాంబిక మాళవికతో అంటుంది. ఆ మాటకి మాళవిక కోపంగా అభిని నిలదీస్తుంది. నన్ను వెళ్లగొట్టాలని అనుకుంటున్నారా అని గోల చేస్తుంది. పొమ్మనకుండానే పొగబెడుతున్నారని భ్రమరాంబికని పొగుడుతాడు ఖైలాష్. వేద తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుంటుంటే యష్ నిద్రపోతు ఉంటాడు. సులోచన మాలిని ఇంట్లోకి వస్తుంది. అప్పుడే వేద ఫోన్లో తన ఫ్రెండ్ విన్నీ పంపించిన ఏదో జోక్ చూసి నవ్వుతూ ఉంటుంది. యష్ కూడా ఆ జోక్స్ చూసి ఇద్దరూ కలిసి తెగ నవ్వుకుంటారు. వాళ్ళు సరదాగా నవ్వుకోవడం చూసి సంతోషంగా ఉన్నారనుకుని సులోచన, మాలిని ఆనందపడతారు. విన్నీ ఎవరు ఎక్కడ ఉంటుందని యష్ అడుగుతాడు. విన్నీ అంటే అమ్మాయి కాదు అబ్బాయి అనేసరికి యష్ ఫేస్ మాడిపోతుంది..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)