అన్వేషించండి

Gruhalakshmi January 19th: లాస్య వల్ల ప్రమాదంలో పడిన దివ్య జీవితం- కూతుర్ని తులసి కాపాడుకుంటుందా?

లాస్య నిజస్వరూపం బయట పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

నందు డల్ గా ఇంటికి రావడం చూసి అందరూ కంగారుగా ఏమైందని అడుగుతారు. మీరు వచ్చినట్టు కారు సౌండ్ కూడా వినిపించలేదని అభి అంటాడు. కారు లేదు బ్యాంక్ వాళ్ళు ఈఎంఐ కట్టలేదని రోడ్డు మీద ఆపి లాక్కుని వెళ్లిపోయారు. ఇంట్లో వాళ్ళే నన్ను నమ్మలేదు ఇంక బయట వాళ్ళు ఏం నమ్ముతారు. బాగుపడటం నాకు చేతకాదని నందు బాధగా మాట్లాడతాడు. కాలం కలిసి రానప్పుడు ఏది కలిసిరాదు అలా అని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు అని తులసి వేదాంతం మొదలుపెడుతుంది. నడిచి వచ్చేసరికి నందు కాళ్ళ నొప్పితో అల్లాడిపోతూ ఉంటాడు. లాస్య వచ్చి నందు కాళ్ళు నొక్కుతూ బిస్కెట్ వేసేందుకు ట్రై చేస్తుంది. ఎవడైనా మనకి లక్షన్నర అప్పు ఇచ్చే వాడు ఉన్నాడా అని అడుగుతుంది. ఆ మాటకి బిత్తరపోతాడు.

Also Read: మళ్ళీ మొదలైన వేద, యష్ కీచులాట- భ్రమరాంబికకి మాళవిక గురించి నిజం చెప్పిన ఖైలాష్

ఇప్పుడు నీకు డబ్బులు ఎందుకని అడుగుతాడు. దివ్య ల్యాప్ టాప్ పాతది అయిపోయిందని అన్నది, తనకి కొనిద్దాం అని అంటుంది. దారిన పోయే కంప తగలించుకోవడం ఎందుకు, అప్పు తీసుకురావాలంటే నిన్ను తాకట్టు పెట్టాలి. హారతి ఇచ్చావ్ ఎదురొచ్చావ్ కారు పాయే, ఉద్యోగం ఇంటర్వ్యూ పోయే అని నందు వెళ్ళిపోతాడు. శ్రుతికి ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నట్టు తులసి కోడళ్ళతో అంటుంది. కలిసి రావాలంటే కూతుర్ని కనాలి, తెలిసి రావాలంటే కొడుకుని కనాలి అని వీర లెవల్ లో డైలాగ్ వేసేస్తుంది తులసి. అత్త క్లాస్ విని కోడళ్ళు తెగ మెచ్చుకుంటారు. లాస్య దివ్యకి తన ల్యాప్ టాప్ ఇస్తుంది. ఏదోలా కొత్త ల్యాప్ టాప్ కొనిస్తాను అప్పటి వరకు తనది వాడుకోమని చెప్తుంది. అది తీసుకుని దివ్య సంతోషిస్తుంది. పనిలో పనిగా తులసి గురించి చెడుగా చెప్తుంది. ఆ మాటలు నమ్మిన దివ్య లాస్య వలలో పడిపోతుంది.

Also Read: తులసి క్లాస్, సామ్రాట్ క్లాప్స్- దివ్యని బుట్టలో వేసుకోవడానికి వచ్చి ఇరక్కపోయిన లాస్య

దివ్య తన ఫ్రెండ్ బర్త్ డే వెళ్ళాలి కానీ మామ్ ని అడిగితే పంపించదు అని లాస్యతో చెప్తుంది. స్పెషల్ క్లాస్ అని అబద్ధం చెప్పి వెళ్లిపో అని సలహా ఇస్తుంది. దివ్య పూర్తిగా తనవైపు తిరిగిపోయినట్టే ఛాలెంజ్ లో సగం గెలిచానని లాస్య సంబరపడిపోతుంది. కడుపుతో ఉన్న కోడలు శ్రుతితో వాకింగ్ చేయిస్తూ తన దుంప తెంచుతుంది తులసి. తొమ్మిది నెలలు ఎంత ఫాస్ట్ గా గడిచిపోతుందో అని ఎదురుచూస్తున్న అనిఅంటుంది. దివ్య రెడీ అయ్యి తులసి దగ్గరకి వెళ్తుంది. దివ్య అలా రెడీ అవడం చూసి ఎక్కడికి బయల్దేరావ్ అని గట్టిగా అడుగుతుంది. తర్వాత ఈ డ్రెస్ చాలా బాగుంది నీకు ముద్దుగా ఉన్నావ్ అని మెల్లగా అడిగి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అంటుంది. లాస్య వచ్చి కలుగజేసుకుని మాట్లాడుతుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Toxic Songs : టాక్సిక్ రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది - యశ్, కియారాల రొమాన్స్ చూశారా?... బ్యూటిఫుల్ లిరిక్స్
టాక్సిక్ రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది - యశ్, కియారాల రొమాన్స్ చూశారా?... బ్యూటిఫుల్ లిరిక్స్
Dada First Look: హ్యాపీ బర్త్ డే గంగూలీ... 'దాదా' ఫస్ట్ లుక్ రిలీజ్
హ్యాపీ బర్త్ డే గంగూలీ... 'దాదా' ఫస్ట్ లుక్ రిలీజ్
Nindu Manasulu Serial Today July 8th: నిండు మనసులు: అత్తని కిడ్నాప్ చేయించిన సిద్ధూ! తండ్రికి గణ వార్నింగ్!
నిండు మనసులు: అత్తని కిడ్నాప్ చేయించిన సిద్ధూ! తండ్రికి గణ వార్నింగ్!
Ekasekalu Series OTT : ఓటీటీలోకి క్రేజీ మినీ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి క్రేజీ మినీ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Embed widget