అన్వేషించండి

Gruhalakshmi January 24th: తన తిక్క చేష్టలతో నవ్వులు పూయించిన లాస్య- మొహాన నీళ్ళు కొట్టిన రాములమ్మ

లాస్య నిజస్వరూపం బయట పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

దివ్యని క్షేమంగా కాపాడుకుంటుంది తులసి. జరిగింది తలుచుకుని దివ్య చాలా బాధపడుతుంది. ఆడపిల్ల విలువ బంగారం కన్నా ఎక్కువ ఎంత భద్రంగా చూసుకోవాలి అని దివ్యకి కాసేపు చిన్నపాటి క్లాస్ తీసుకుంటుంది. ఆడపిల్ల గురించి తల్లిదండ్రులు పడే బాధని చక్కగా చెప్తుంది. దివ్య తన తప్పు తెలుసుకుని తల్లిని క్షమాపణ అడుగుతుంది. ఇంకెప్పుడు అబద్దం చెప్పను, అసలు టెన్షన్ పెట్టను, నువ్వు చెప్పినట్టే వింటాను అని దివ్య అంటుంది. తులసి కూతురికి భోజనం తినిపించి పడుకోబెట్టి వెళ్ళిపోతుంది. తెల్లారి లాస్య నిద్రపోతూనే ఉంటుంది కానీ తన ఫోన్లో పాటలు మాత్రం మోగుతూ ఉంటాయి. అవి నందు ఆఫ్ చేయగానే లాస్య కళ్ళు తెరవకుండానే ఫోన్లో సాంగ్ మళ్ళీ అన్ చేస్తుంది.

Also Read: యష్, విన్నీ వార్ స్టార్ట్ - ఫ్రెండ్ ని చూసి తెగ సంతోషపడిపోయిన వేద

నందు బయటకి వచ్చేసరికి రాములమ్మ హడావుడిగా ఎదురుపడుతుంది. తనని నిద్రలేపడం అంత ఈజీకాదులే అని వెళ్ళిపోతాడు. రాములమ్మ గదిలోకి వచ్చి లాస్య ఫోన్ పక్కన పెట్టేసుకుని నిద్రపోవడం చూసి లేపుతుంది కానీ లాస్య లేవకపోయేసరికి బక్కెట్ నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద కొడుతుంది. నీళ్ళు మొహాన పడటంతో లాస్య దెబ్బకి లేచి కూర్చుంటుంది. వాన వాన అని అరుస్తూ నిద్రలేస్తుంది. తర్వాత తులసిలా రెడీ అవాలి కదా అని అనుకుంటుంది. తులసిని అనసూయ కాఫీ అడుగుతుంది. అంకిత ఇస్తానన్నది కదా అని తులసి అంటుంది. ఎందుకు చేయలేదని అంటుంది. తెల్లారేసరికి వంటగదిలో అన్నింటికీ తాళాలు ప్రత్యక్షం అయ్యాయని చెప్తారు.

లాస్య బుద్ధి ఇంకా మారలేద అని తులసి అంటుంది. కాదు ఇంతక ముందు పర్మిషన్ తీసుకుని వంట చేయాలని అంది.. కానీ ఇప్పడు తను వచ్చి తన చేతులతోనే అందరికీ అన్ని చేసి పెట్టాలంట అని అంకిత వాళ్ళు చెప్పేసరికి అందరూ బిత్తరపోతారు. ఈ ఇంటికి మంచి రోజులు వచ్చాయ్ అని తులసి నవ్వుతుంది. లాస్య తులసిలా చీర కట్టి వాళ్ళ గది క్లీన్ చేస్తుంది. నందు వచ్చి తనని చూసి మెచ్చుకుంటాడని ఎక్స్పెక్ట్ చేసిన లాస్యని రాములమ్మ అనుకుని తుడవటం అయిన తర్వాత కాఫీ పట్టుకుని రమ్మని చెప్తాడు. అయితే తులసి గుర్తుకు రావాలి లేదంటే నేను గుర్తుకు రావాలి అదేంటి రాములమ్మ గుర్తుకు రావడం అని కాసేపు నందుని తిట్టుకుంటుంది.

Also Read: తులసి అవతారమెట్టిన లాస్య, వాట్ ఏ కామెడీ- జరిగింది తలుచుకుని వణికిపోతున్న దివ్య

ఇంట్లో పాత పాట పెట్టి లాస్య ఎగురుకుంటూ కాఫీ తీసుకుని వస్తుంది. లాస్య అవతారం చూసి ఇంట్లో అందరూ నోరెళ్ళబెడతారు. అందరికీ కాఫీ ఇస్తుంది. కాఫీ ఇచ్చి లాస్య తిక్క తిక్కగా బిహేవ్ చేస్తుంది. పరంధామయ్య లాస్య గాలి తీసేస్తాడు. ఆ పాట ఏంటి డాన్స్ చేసుకుంటూ వచ్చి కాఫీ ఎక్కడ మా తలల మీద పోస్తావో అని హడలి చచ్చాము తెలుసా అని పరంధామయ్య అనేసరికి లాస్య బిక్క మొహం వేస్తుంది.

తరువాయి భాగంలో..

దివ్యని స్పెషల్ కోర్స్ చదివించడం కోసం తులసి తనని ఢిల్లీకి పంపించేందుకు ఏర్పాటు చేస్తుంది. అది తెలుసుకుని నందు తులసి మీద అరుస్తాడు. దివ్య నా కూతురా, నీ కూతురా తేల్చు నన్ను అడగకుండా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావ్ అని నిలదీస్తాడు.

టాప్ హెడ్ లైన్స్

Scene Review - 'సీన్' రివ్యూ: సూర్య హ్యాట్రిక్ కొడతారా? మలయాళ దర్శకుడితో క్రైమ్ కామెడీ... సినిమా ఎలా ఉందంటే?
'సీన్' రివ్యూ: సూర్య హ్యాట్రిక్ కొడతారా? మలయాళ దర్శకుడితో క్రైమ్ కామెడీ... సినిమా ఎలా ఉందంటే?
Renu Desai : నా వనవాసం ముగిసేది ఎప్పుడు? - డివోర్స్‌పై రేణూ దేశాయ్ రియాక్షన్
నా వనవాసం ముగిసేది ఎప్పుడు? - డివోర్స్‌పై రేణూ దేశాయ్ రియాక్షన్
Crime Thriller OTT : భార్య మిస్సింగ్... భర్త అరెస్ట్... క్లైమాక్స్‌లో బిగ్ ట్విస్ట్ - ఓటీటీలో దుమ్ము రేపుతోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్
భార్య మిస్సింగ్... భర్త అరెస్ట్... క్లైమాక్స్‌లో బిగ్ ట్విస్ట్ - ఓటీటీలో దుమ్ము రేపుతోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్
Scene Movie OTT : ఓటీటీలోకి సూర్య సీన్ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి సూర్య సీన్ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
Embed widget