Janaki Kalaganaledu December 2nd: రామా, జానకి రొమాంటిక్ మూమెంట్- కోడలిని చూసి మురిసిన భానుమతి
రామా, జానకి కలిసి సంతోషంగా ఉండేందుకు టైమ్ దొరకడంతో హ్యపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జానకి చిన్నపిల్లలా తెగ అల్లరి చేస్తుంది. ఎంజాయ్ చేసింది చాలు ఇక వెళ్దాం పదండి అని రామా భార్యని తీసుకుని కడియసావరం బయల్దేరతాడు. దారిలో చింతచెట్టు కనిపించేసరికి జానకి మళ్ళీ చింతకాయలు కావాలని అడుగుతుంటే రాళ్ళు చెట్టుకెసి రాళ్ళు విసురుతూ ఉంటాడు. అది పోయి పక్కన పొలంలో పని చేసే ఒక వ్యక్తికి తగలడంతో ఇద్దరు పరుగులు పెడతారు. చిన్ననాటి ఆటలన్నీ ఆడుతూ జానకి హ్యపీగా ఉంటుంది. పట్టీలు కావాలని అలిగి బుంగమూతి పెడుతుంది. దీంతో రామా స్వయంగా జానకికి పట్టీలు పెడతాడు. అది చూసి జానకి తెగ మురిసిపోతుంది. ఆకాశంలో ఇంద్రధనస్సు ఎంత అందంగా ఉంటుందో మీ కాలికి పట్టీలు అంత అందంగా ఉన్నాయని రామా మురిసిపోతాడు. భర్తతో కలిసి సమయం గడుపుతున్నందుకు జానకి చాలా సంతోషంగా ఉంటుంది.
Also Read: నిజం తెలిసి ఆదిత్యని జైలుకి పంపించేందుకు ప్లాన్ వేసిన అభిమన్యు- ఖుషి మీద అరిచిన యష్
ఇక ఇద్దరూ కలిసి కడియసావరంలో భానుమతి ఇంటికి వస్తారు. రామా తను వచ్చిన విషయం దాచిపెట్టమని చెప్పి వెళ్ళి గోడ చాటు వెళ్ళి నిలబడతాడు. జానకి తలుపు ఎదురుగా నిలబడితే భానుమతి బయటకి వచ్చి ఎవరు నువ్వు పూల కోసం వచ్చావా అని మాట్లాడుతుంది. రామా భానుమతి వెనకగా వెళ్ళి నిలబడు చిలిపి చేష్టలు చేస్తాడు. జానకి నవ్వుతూ ఉంటుంది. నన్ను ఎవరో మగ గొంతుతో పిలిచారు, అసలు ఎవరు నువ్వు అని మాట్లాడుతూ ఉంటుంది. నీ కోడలు భానమ్మా అని రామా ఎంట్రీ ఇస్తాడు. రామాని చూసి భానుమతి చాలా సంతోషిస్తుంది. జానకిని చూసి మెచ్చుకుంటుంది. వాళ్ళిద్దరూ ఇంటికి రావడంతో ఇంటికి పండగ వచ్చినట్టుగా మురిసిపోతుంది.
రామా గురించి భానుమతి గొప్పగా చెప్తుంది. తన దగ్గరే పెరిగాడని అంటుంది. చిన్నతనం నుంచి రామా పడిన కష్టాలు చెప్తూ భానుమతి ఎమోషనల్ అవుతుంది. అక్కడ ఉన్నంత ఇల్లు ఇక్కడ ఉండదు కాస్త సర్దుకోమని భాను అంటుంటే జానకి కొండంత ప్రేమ ముందు అది చాలా తక్కువే అంటుంది. ప్రేమ ఉన్న చోటు ఆస్తులు, అంతస్థులకి విలువ ఉండదు అని చక్కగా చెప్తుంది. కోడలు పిల్ల ఎంత కలుపుకోలుగా ఉందో అని తెగ సంతోషపడుతుంది. స్నానాలకి నీళ్ళు పెడతాను అని భాను హడావుడి చేస్తుంటే రామా మాత్రం చూసి వెళ్లిపోదామని బట్టలు ఏమి తెచ్చుకోలేదని అంటాడు. ఆ మాటకి భాను ఫీల్ అవుతుంది. కోడలు పిల్లని తీసుకొచ్చారని సంతోషించేలోపే వెళ్లిపోతాం అంటున్నారని అలుగుతుంది.
Also Read: హ్యాపీగా ఎంజాయ్ చేసిన రామా, జానకి- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, మల్లిక టెన్షన్ టెన్షన్
ఇంటి దగ్గర చాలా పనులున్నాయ్ అని రామా అంటుంటే భాను మాత్రం తన కంటే పనులే ఎక్కువ అయ్యాయని అంటున్నాడని బాధపడుతుంది. బట్టలు లేవు ఎలా ఉంటామని రామా అనేసరికి ఇద్దరికీ భాను కొత్త బట్టలు తెచ్చి ఇస్తుంది.