News
News
X

Jai Bhim: దొంగలకు ఒక జాతి ఉంటుందా? ప్రశ్నిస్తున్న లాయర్ సూర్య... జై భీమ్ టీజర్ విడుదల

ఆకాశం నీ హద్దురా సినిమాతో మంచి హిట్ ను అందుకున్న సూర్య త్వరలో లాయర్ చంద్రుగా మనముందుకు రాబోతున్నాడు.

FOLLOW US: 

సూర్య తమిళ హీరో అయినా తెలుగు అభిమానులు కూడా ఎక్కువే. ఆయన సినిమాలు వదలకుండా చూసేస్తారు మనవాళ్లు. త్వరలో ‘జై భీమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సూర్య. అతని 40వ సినిమా ఇది. ఇందులో లాయర్ గా కనిపించబోతున్నాడు. ఆ సినిమా తాలూకు టీజర్ ను దసరా సందర్భంగా విడుదల చేశారు. టీజర్ ను చూస్తుంటే సూర్య పవర్ ఫుల్ లాయర్ గా కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది. డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఓ నిజజీవిత ఘటన ఆధారంగా నిర్మిస్తున్నట్టు సమాచారం. 

1993లో తమిళనాడులో ఓ గిరిజన యువతికి జరిగిన అన్యాయంపై ఓ లాయర్ పోరాటం చేశారు. అదే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని టాక్. టీజర్ ను చూస్తే అదే నిజమని అనిపిస్తోంది. ఈ టీజర్ లో మహిళపై పోలీసులు దాడి చేయడం, అమాయకులని వేధించడం కనిపిస్తుంది. ఆ గిరిజన మహిళకు సూర్య అండగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ సందర్భంగా ఆయన వేసిన డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది ‘దొంగలకు ఒక జాతి ఉంటుందా? మీ జాతిలోనూ, నా జాతిలోనూ,  అన్ని జాతుల్లోనూ పెద్ద పెద్ద దొంగలున్నారు’ అంటూ గిరిజన జాతికి అండగా ఉండే లాయర్ గా సూర్య కనిపించారు. అలాగే ‘ఏ ఆధారాలు లేకుండా మనం కేసు వేసింది... ముగ్గురు పోలీసులకు వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వాన్ని ఎదిరించి..’ అని బాధిత మహిళతో చెబుతున్న డైలాగ్ కూడా పవర్ ఫుల్ గా ఉంది. 

ఈ సినిమాకు  టీఎస్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ప్రకాష్ రాజ్ ఓ కీలకపాత్రలో పోషిస్తున్నారు. ఆ పాత్ర పాజిటివ్ లేదా నెగిటివ్ షేడ్స్ ఉన్నదా తెలియరాలేదు. అయితే ఆయన పోలీస్ కనిపించబోతున్నారు. ఇక రావు రమేష్ లాయర్ పాత్రను పోషిస్తున్నారు. 2 డీ ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ నటి రజిషా విజయన్ హీరోయిన్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీని దీపావళి సందర్భంగా నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ నిర్మాతలు ఎవరో కాదు జ్యోతిక, సూర్యా దంపతులే. 

View this post on Instagram
 
A post shared by Suriya Sivakumar (@actorsuriya)

Also read: దసరా వేడుకలో పెద్దమ్మతల్లిని దర్శించుకున్న శ్రీముఖి

Also read: ఇలాంటి వ్యక్తులతో వివాహమా... కాస్త ఆలోచించుకోండి

Also read: కెలోరీల గురించి భయపడకుండా రోజులో ఎప్పుడైనా వీటిని తినొచ్చు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 17 Oct 2021 10:11 AM (IST) Tags: Jai Bhim Teaser Suriya Advocate Chandru సూర్య

సంబంధిత కథనాలు

బిగ్ బాస్‌లో ‘జంబ లకిడి పంబ’ రెండో స్టేజ్, పిల్లలుగా మారిన కంటెస్టెంట్స్, శ్రీహన్‌కు చుక్కలు!

బిగ్ బాస్‌లో ‘జంబ లకిడి పంబ’ రెండో స్టేజ్, పిల్లలుగా మారిన కంటెస్టెంట్స్, శ్రీహన్‌కు చుక్కలు!

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sree Leela: రామ్, బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, షూటింగ్ తేదీ ఫిక్స్!

Sree Leela: రామ్, బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, షూటింగ్ తేదీ ఫిక్స్!

Ram - Boyapati Movie Update : రామ్ జోడీగా శ్రీలీల - 'అఖండ' తర్వాత బోయపాటి, తమన్ కాంబినేషన్ రిపీట్

Ram - Boyapati Movie Update : రామ్ జోడీగా శ్రీలీల - 'అఖండ' తర్వాత బోయపాటి, తమన్ కాంబినేషన్ రిపీట్

Puneeth Rajkumar : తెలుగులోకి మరో పవర్ స్టార్ సినిమా - దసరాకు 'సివిల్ ఇంజనీర్' టీజర్ రిలీజ్

Puneeth Rajkumar : తెలుగులోకి మరో పవర్ స్టార్ సినిమా - దసరాకు 'సివిల్ ఇంజనీర్' టీజర్ రిలీజ్

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

కేంద్ర అధికార దుర్వినియోగంపై గట్టిగా పోరాడాలి- కేసీఆర్‌కు కుమార స్వామి శుభాకాంక్షలు

కేంద్ర అధికార దుర్వినియోగంపై గట్టిగా పోరాడాలి- కేసీఆర్‌కు కుమార స్వామి శుభాకాంక్షలు