Ishq Special Shows : రీ రిలీజ్ కు రెడీ అయిన నితిన్ హిట్ మూవీ, విడుదల ఎప్పుడో తెలుసా?
కెరీర్ లో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, తట్టుకుని నిలబడ్డ హీరో నితిన్. ఈ నెల 30న ఆయన బర్త్ డే జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా తన హిట్ మూవీ ‘ఇష్క్’ను రీరిలీజ్ చేయనున్నారు.
నితిన్. టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో. తొలి మూవీ ‘జయం’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అంతేకాదు, ఉత్తమ నూతన హీరోగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘దిల్’ తోనూ దిల్ దార్ అనిపించుకున్నారు. ఈ సినిమా సైతం ఓ రేంజిలో హిట్ అయ్యింది. అనంతరం వరుస పరాభవాలు ఎదురయ్యాయి. ఏకంగా 14 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా, వెనుకడుగు వేయలేదు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇష్క్’ సినిమాతో అదిరిపో హిట్ అందుకుని మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశారు. ’సై’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ లాంటి సినిమాలతో యూత్ ఫుల్, లవ్ స్టోరీ మూవీస్ తో యువతలో మంచి క్రేజ్ సంపాదించారు.
వరుస ఫ్లాఫులతో ఇబ్బంది పడుతున్న నితిన్
‘ఇష్క్’ సినిమా తర్వాత కొన్ని వరుస విజయాలు అందుకున్న ఆయనకు, మళ్లీ పరాభవాలు ఎదురయ్యాయి. నితిన్ చివరగా నటించిన మూడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ‘మాచర్ల నియోజకవర్గం’ డిజాస్టర్ గా మిగిలింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ‘రంగ్ దే’ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘మ్యాస్ట్రో’ కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. ప్రస్తుతం సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే మూవీ కచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఆచితూచి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ సినిమాకు ’సైతాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అటు మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న వెంకీ కుడుముల మూవీ కూడా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమాకు ప్రారంభోత్సవం చేశారు. నితిన్ తో ‘భీష్మ’ లాంటి హిట్ సినిమా తీసిన ఈ దర్శకుడు, మళ్ళీ నితిన్, రష్మిక హీరో, హీరోయిన్లుగా ఈ ప్రాజెక్టు చేస్తున్నారు.
నితిన్ బర్త్ డే సందర్భంగా ‘ఇష్క్’ రీరిలీజ్
ఈ నెల 30న నితిన్ బర్త్ డే జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లో మంచి హిట్ అందుకున్న ‘ఇష్క్’ సినిమా స్పెషల్ షోలు వేయనున్నారు. ఈ నెల 29న ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. నిత్యా మీనన్ హీరోయిన్‌గా చేసింది. 2012 ఫిబ్రవరి, 24న విడుదలైన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ మూవీ మ్యూజికల్‌గా కూడా హిట్ అయ్యింది. ఈ చిత్రంలో నితిన్ ఒక పాట కూడా పాడారు.
View this post on Instagram
Read Also: 'ఆర్ఆర్ఆర్'కు ఏడాది - సినిమాకు ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసా?