Vidya Balan: విద్యాబాలన్ ను హాట్ ఫొటోషూట్ గురించి ప్రశ్నించిన నెటిజన్, కౌంటర్ ఇచ్చిన నటి
విద్యాబాలన్ ని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమెకి కౌంటర్ ఇచ్చింది.
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. వారికి సంబంధించిన విషయాలను, ఫొటోలను, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో చాట్ సెషన్స్ కూడా నిర్వహిస్తుంటారు. హీరోయిన్లైతే ఎప్పటికప్పుడు హాట్ ఫొటోషూట్స్ ను అభిమానులతో పంచుకుంటారు. ఇలాంటి ఫొటోషూట్స్ గురించి నటి విద్యాబాలన్ కి ఓ ప్రశ్న ఎదురైంది.
బాలీవుడ్ లో 'డర్టీ పిక్చర్'సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న విద్యాబాలన్ ఈ మధ్యకాలంలో 'శకుంతలా దేవి', 'షెర్నీ' వంటి సినిమాల్లో నటించింది. తాజాగా ఈ బ్యూటీ నటించిన 'జల్సా' అనే సినిమా మార్చి 18న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేష్ త్రివేణి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విద్యాబాలన్ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చట్లు పెట్టింది.
ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ యూజర్ 'మీరు హాట్ ఫొటోషూట్‌లు ఎందుకు చేయకూడదు?' అని ప్రశ్నించాడు. దానికి విద్యా 'It is hot, and I have been shooting. Tho hot photoshoot hee hua naa!' (ఇక్కడ వేడిగా ఉంది. నేనేమో షూటింగ్ లో ఉన్నాను. అంటే హాట్ ఫోటోషూట్ అయినట్లే కదా) అని కొంటెగా సమాధానం ఇచ్చింది. ఇదే చాటింగ్ సెషన్ లో తన బరువు, ఇతర అంశాలపై కూడా స్పందించింది విద్యాబాలన్.
View this post on Instagram
View this post on Instagram