Pawan Kalyan : భీమ్లా నాయక్ పై ఇండియన్ క్రికెటర్ కామెంట్!

పవన్ మీద తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటి చెబుతుంటారు ఈ యంగ్ క్రికెటర్.

FOLLOW US: 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని ఇండస్ట్రీలలో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. ఇండియన్ క్రికెట్ టీమ్ లో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అందులో హనుమ విహారి(Hanuma vihari)ఒకరు. పవన్ మీద తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటి చెబుతుంటారు ఈ యంగ్ క్రికెటర్. తన కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా.. సినీ రంగంపై ఓ కన్నేసే ఉంచుతారు. 
 
మొన్నామధ్య బిగ్ బాస్ షో గురించి కూడా మాట్లాడారు. అభిజిత్ ఆటతీరుపై కామెంట్ చేశారు. కరోనా సమయంలో ఎంతోమందికి సాయం అందించిన ఈ కుర్ర క్రికెటర్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటారు. కాకినాడకు చెందిన హనుమ విహారి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. గతంలో పవన్ తో దిగిన ఫోటోలను షేర్ చేయగా అది తెగ వైరల్ అయింది. ఇప్పుడు ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లను ఆడబోతున్న హనుమ విహారి ప్రస్తుతం తన టీమ్ తో కలిసి అక్కడే ఉన్నారు. 
 
మ్యాచ్ ప్రాక్టీస్ తో ఎంత బిజీగా ఉన్నా.. పవన్ పై అభిమానాన్ని మాత్రం చాటుకుంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్-రానా సినిమాకి సంబందించిన మేకింగ్ వీడియోను వదిలారు. ఇందులో భీమ్లా నాయక్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతున్నారో చూపించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ అప్డేట్ చూసిన హనుమ విహారి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. 'భీమ్లా నాయక్ ఆన్ ఫైర్' అన్నట్లుగా పోస్ట్ పెట్టారు. 
 
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. మలయాళ వెర్షన్ లో బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రల్లో తెలుగులో పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్నారు. పవన్ కు జోడీగా నిత్యామీనన్ కనిపించనుంది. రానా భార్య పాత్రలో కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాజేష్ ను ఎంపిక చేసుకున్నారు. సినిమాలో మరో ముఖ్య పాత్రలో బ్రహ్మాజీ, క్యామియో రోల్ లో దర్శకుడు వి.వి.వినాయక్ కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తుండగా.. త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. 
 
Published at : 28 Jul 2021 06:03 PM (IST) Tags: Rana Daggubati pawan kalyan Bheemla Nayak Hanuma Vihari

సంబంధిత కథనాలు

Vishal accident: 'లాఠీ' షూటింగ్, మళ్లీ గాయపడ్డ విశాల్

Vishal accident: 'లాఠీ' షూటింగ్, మళ్లీ గాయపడ్డ విశాల్

Alluri Movie Teaser: శ్రీవిష్ణును ఇంత పవర్‌ఫుల్‌గా ఏ సినిమాలో చూసుండరు, అల్లూరి టీజర్ అదిరిపోయిందిగా

Alluri Movie Teaser: శ్రీవిష్ణును ఇంత పవర్‌ఫుల్‌గా ఏ సినిమాలో చూసుండరు, అల్లూరి టీజర్ అదిరిపోయిందిగా

Janaki Kalaganaledu July 4 Episode: ‘జానకి కలగనలేదు’ - చెత్త కాగితాల్లోకి జానకి ఎస్సైనమెంట్ పేపర్స్, జ్ఞానంబ ప్రశ్నకు జానకి మౌనంగా

Janaki Kalaganaledu July 4 Episode: ‘జానకి కలగనలేదు’ - చెత్త కాగితాల్లోకి జానకి ఎస్సైనమెంట్ పేపర్స్, జ్ఞానంబ ప్రశ్నకు జానకి మౌనంగా

Gruhalakshmi July 4 Episode: ‘గృహలక్ష్మి’ జులై 4 ఎపిసోడ్ - లాస్యకి చెక్ పెట్టిన తులసి, నందు ఆగ్రహం

Gruhalakshmi July 4 Episode: ‘గృహలక్ష్మి’ జులై 4 ఎపిసోడ్ - లాస్యకి చెక్ పెట్టిన తులసి, నందు ఆగ్రహం

Devatha july 4 episode: పచ్చబొట్టు వేయించుకోబోయిన దేవి, ఫోన్ విషయంలో జానకి దంపతులకి దొరికిపోయిన రాధ

Devatha july 4 episode: పచ్చబొట్టు వేయించుకోబోయిన దేవి, ఫోన్ విషయంలో జానకి దంపతులకి దొరికిపోయిన రాధ

టాప్ స్టోరీస్

Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?

Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?

Khammam Bike Fire Accident: పెట్రోల్ కొట్టించగానే బైక్ నుంచి మంటలు - అలర్ట్ అయిన యువకులు ఏం చేశారంటే !

Khammam Bike Fire Accident: పెట్రోల్ కొట్టించగానే బైక్ నుంచి మంటలు - అలర్ట్ అయిన యువకులు ఏం చేశారంటే !

Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు

Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు

Chocolate: మూడ్ బాగోలేదా? వెంటనే ఓ చాక్లెట్‌ ముక్కను నోట్లో వేసుకోండి

Chocolate: మూడ్ బాగోలేదా? వెంటనే ఓ చాక్లెట్‌ ముక్కను నోట్లో వేసుకోండి