అన్వేషించండి

Allu Arjun birthday: వానిటీ వ్యాన్ TO ప్రైవేట్ జెట్‌, అల్లు అర్జున్ దగ్గరున్న 5 అత్యంత ఖరీదైన వాహనాలు ఇవే!

సౌత్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ గ్యారేజీలో అత్యంత విలువైన వాహనాలున్నాయి. వానిటీ వ్యాన్ నుంచి ప్రైవేట్ జెట్ వరకు పలు లగ్జరీ వెహికల్స్ కొనుగోలు చేశారు.

సౌత్ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు అల్లు అర్జున్. అంతేకాదు, అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లోనూ ఆయన టాప్ లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ లైఫ్ స్టైల్ సైతం చాలా రిచ్ గా ఉంటుంది. వేసుకునే బట్టల నుంచి ప్రయాణించే వాహనాల వరకు చాలా ఖరీదైనవి వాడుతారు. అంతేకాదు, విలాసవంతమైన బంగళాలతో పాటు పలు ఆస్తులను కలిగి ఉన్నారు. ఆయన భార్య స్నేహారెడ్డి కూడా ఖరీదైన వస్తువులను ఇష్టపడుతుంది.   

టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున ఇవాళ(ఏప్రిల్ 8న) బర్త్ డే జరుపుకుంటున్నారు. 41 ఏండ్లు పూర్తు చేసుకుని 42వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా తన దగ్గరున్న ఐదు ఖరీదైన వస్తువుల గురించి తెలుసుకుందాం..   

1.విలాసవంతమైన వానిటీ వ్యాన్

అల్లు అర్జున్‌కు చెందిన అత్యంత ఖరీదైన వస్తువులలో వ్యానిటీ వ్యాన్ ఒకటి. నలుపు రంగును ఇష్టపడే బన్నీ, ఈ వ్యాన్ ను కూడా అదే రంగులో తయారు చేయించుకున్నారు. ఇందులో టీవీ,  ఫ్రిజ్ తో పాటు సౌకర్యవంతమైన రిక్లైనర్‌ తో తయారు చేయబడింది. అతడు తరచుగా షూట్‌ల మధ్య ఈ విలాసవంతమైన వ్యాన్‌లో సేద తీరుతుంటారు. దీని విలువ రూ. 7 కోట్లు. వాస్తవానికి, ఈ వ్యాన్‌కు ఫాల్కన్ అని పేరు పెట్టారు. వ్యాన్ బయట తన పేరులోని అక్షరాలను('AA') పొందుపర్చారు.  

2.రూ.100 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం

అల్లు అర్జున్ విలాసవంతమైన ఆస్తుల జాబితాలో అతడి కలల ఇల్లు కూడా ఉంది. హైదరాబాద్‌లో ఆయనకు రూ. 100 కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఉంది. అతడు తన తల్లిదండ్రులు, భార్య అల్లు స్నేహ,  పిల్లలు అర్హా, అయాన్‌లతో ఇందులోనే నివసిస్తున్నారు. ఇల్లు మొత్తం మినిమలిస్ట్ వైబ్‌ను కలిగి ఉంది. సహజమైన తెలుపు రంగులో పెయింట్ చేయబడింది. బ్లెస్సింగ్ అని పిలవబడే ఇంట్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, హోమ్ థియేటర్, పిల్లల కోసం ప్లే ఏరియా ఉన్నాయి.

3.హమ్మర్ H2

అల్లు అర్జున్‌కి కార్లంటే చాలా ఇష్టం. లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం చాలా ఇష్టం. రూ. 75 లక్షలకు పైగా ఖరీదు చేసే హమ్మర్ H2 కారును కొనుగోలు చేశారు. ఇది అత్యంత ప్రసిద్ధ కార్లలో ఒకటి.   

4.రేంజ్ రోవర్, ఇతర కార్లు   

అల్లు అర్జున్ గ్యారేజ్ లో అత్యంత ఖరీదైన కారు రేంజ్ రోవర్‌ కొలువుదీరింది. 2019లో అందమైన రేంజ్ రోవర్ వోగ్‌ను ఆయన కొనుగోలు చేశారు. దానికి 'బీస్ట్' అని పేరు పెట్టారు. ఈ కారు ఖరీరు రూ. 1.8 నుండి 4 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. అంతేకాదు,  జాగ్వార్ ఎక్స్‌జెఎల్‌ను కూడా కలిగి ఉన్నారు. దాని ఖరీదు రూ. 1.2 కోట్లు. అతడి గ్యారేజీలో వోల్వో XC90 T8 ఎక్సలెన్స్, BMW X6 M స్పోర్ట్ కార్లు కూడా ఉన్నాయి.

5.ప్రైవేట్ జెట్

అల్లు అర్జున్‌కు విలాసవంతమైన ప్రైవేట్ జెట్ కూడా ఉంది. జెట్ ఖరీదు తెలియదు కానీ, అతను తరచుగా తన కుటుంబంతో కలిసి ఇందులో సెలవులకు వెళ్తాడు. బన్నీ, స్నేహ పలుమార్లు వారి ప్రైవేట్ జెట్ ఫోటోలను తమ ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రైవేట్ జెట్ లు కలిగి ఉన్న కొద్ది మంది స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు.   

బన్నీ నికర ఆస్తుల విలువ

ఇది కాకుండా, అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని నైట్ క్లబ్ ను రన్ చేస్తున్నారు. హైదరాబాద్ ఆధారిత కాల్‌ హెల్త్ సర్వీసెస్ అనే హెల్త్‌ కేర్ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టాడు. తన తండ్రి అల్లు అరవింద్‌తో పాటు, అతడు OTT ప్లాట్‌ ఫారమ్ ‘ఆహా’ను స్థాపించారు.  అతడి కుమార్తె పేరుతో అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించారు. అల్లు అర్జున్ నికర  ఆస్తుల విలువ రూ. 350 కోట్లు. ఒక్కో సినిమాకు రూ. 30 కోట్లకు పైగా వసూలు చేస్తారు.  తన రాబోయే చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ కోసం రూ. 100 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.   

Read Also: సల్మాన్ ఖాన్ గ్యారేజీలోకి సరికొత్త బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Scene Review - 'సీన్' రివ్యూ: సూర్య హ్యాట్రిక్ కొడతారా? మలయాళ దర్శకుడితో క్రైమ్ కామెడీ... సినిమా ఎలా ఉందంటే?
'సీన్' రివ్యూ: సూర్య హ్యాట్రిక్ కొడతారా? మలయాళ దర్శకుడితో క్రైమ్ కామెడీ... సినిమా ఎలా ఉందంటే?
Renu Desai : నా వనవాసం ముగిసేది ఎప్పుడు? - డివోర్స్‌పై రేణూ దేశాయ్ రియాక్షన్
నా వనవాసం ముగిసేది ఎప్పుడు? - డివోర్స్‌పై రేణూ దేశాయ్ రియాక్షన్
Crime Thriller OTT : భార్య మిస్సింగ్... భర్త అరెస్ట్... క్లైమాక్స్‌లో బిగ్ ట్విస్ట్ - ఓటీటీలో దుమ్ము రేపుతోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్
భార్య మిస్సింగ్... భర్త అరెస్ట్... క్లైమాక్స్‌లో బిగ్ ట్విస్ట్ - ఓటీటీలో దుమ్ము రేపుతోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్
Scene Movie OTT : ఓటీటీలోకి సూర్య సీన్ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి సూర్య సీన్ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
Embed widget