Salman Khan Car: సల్మాన్ ఖాన్ గ్యారేజీలోకి సరికొత్త బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
సల్మాన్ ఖాన్ గ్యారేజీలోకి సరికొత్త బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్ వచ్చి చేరింది. అత్యంత ఖరీదైన లగ్జరీ కారును సల్మాన్ ఇంపోర్టు చేసుకున్నారు. ఈ కారు ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో పాటు ఆయన ఫ్యామిలీకి కొంత కాలంగా బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పోలీసు భద్రత పెంచారు. తాజాగా ఆయన సరికొత్త బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశారు. నిస్సాన్ పెట్రోల్ లగ్జరీ SUVని డెలివరీ తీసుకున్నారు. ఈ నెల ప్రారంభంలో ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్‌లో భాగంగా ఆయన ఇదే కారులో ఆ వేడుకలకు హాజరయయ్యారు. తన వ్యక్తిగత భద్రత సిబ్బంది, పోలీసు ఎస్కార్ట్ తో పాటు బుల్లెట్ ప్రూఫ్ పెట్రోల్ SUVలో వచ్చారు. హత్య బెదిరింపులు రావడంతో ఖాన్ గతేడాది బుల్లెట్ ప్రూఫ్ కార్లకు అప్‌గ్రేడ్ అయ్యారు.
Amid Death Threats, Salman Khan Imports Nissan’s Most Expensive SUV Bulletproof car, the Nissan Patrol is the flagship SUV that the Japanese manufacturer produces but does not sell in India. #SalmanKhan #salmankhanbulletproofcar #सलमानखान pic.twitter.com/7OB9vfAlUG
— Namrata Dubey (@namrata_INDIATV) April 7, 2023
ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగించారు. ప్రస్తుతం దాని స్థానంలో సరికొత్త నిస్సాన్ పెట్రోల్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను తీసుకొచ్చారు. నిస్సాన్ భారతదేశంలో పెట్రోల్ కారును అధికారికంగా అందుబాటులోకి తీసుకురాలేదు. ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. నిస్సాన్ పెట్రోల్ మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఆసియాలో బాగా ప్రాచుర్యం పొందింది. బుల్లెట్‌ఫ్రూఫింగ్ విషయానికి వస్తే ఇది అత్యుత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు.
B6, B7 స్థాయిల రక్షణతో రూపొందిన నిస్సాన్ పెట్రోల్
ఈ లేటెస్ట్ కారుకు సంబంధించిన వివరాలు పెద్దగా తెలియనప్పటికీ, ఆర్మర్డ్ నిస్సాన్ పెట్రోల్ B6, B7 స్థాయిల రక్షణతో వస్తున్నట్లు తెలుస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను అమర్చేటప్పుడు చాలా ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలు వీటికి అదపు రక్షణ ఫీచర్లను అందిస్తున్నాయి. B6-స్థాయితో, బాలిస్టిక్ రక్షణ కోసం 41 mm మందపాటి గ్లాస్‌తో అధిక శక్తితో కూడిన రైఫిల్ దాడిని కూడా తట్టుకుంటుంది. B7-స్థాయి 78 mm గ్లాస్‌తో ఆర్మర్-పియర్సింగ్ రౌండ్‌ల నుంచి రక్షణను అందిస్తుంది. నిస్సాన్ పెట్రోల్‌లో ఇంటీరియర్‌లు సింపుల్‌గా విలాసవంతంగా ఉంటుంది. 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో జతచేయబడిన 400 bhp, 560 Nm పీక్ టార్క్ కోసం ట్యూన్ చేయబడిన మముత్ సైజ్ 5.6-లీటర్ V8 పెట్రోల్ ఇంజన్ నుంచి పవర్ పొందుతుంది. రియర్ లాకింగ్ డిఫరెన్షియల్ తో ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా పవర్ మొత్తం నాలుగు వీల్స్ ను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కారు అత్యంత సామర్థ్యం గల ఆఫ్ రోడర్ సెగ్మెంట్‌లోని టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC300, ల్యాండ్ రోవర్ డిఫెండర్‌తో పోటీపడుతుంది. ప్రస్తుతం దాని ఆరవ తరంలో, నిస్సాన్ పెట్రోల్ చివరిసారిగా 2019లో రిఫ్రెష్ చేయబడింది. బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ కోసం ఖాన్ చాలా ప్రీమియం చెల్లించారట.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు
సల్మాన్ ఖాన్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబిని తన రోజువారీ అవసరలా కోసం ఉపయోగిస్తున్నారు. అయితే, గత సంవత్సరం బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూయిజర్ LC200కి మారారు. సల్మాన్ తన 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రీకరణ సమయంలో కృష్ణజింకలను వేటాడిన కేసుకు సంబంధించి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతడి అనుచరుల నుంచి థ్రెట్ కాల్స్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు.
Read Also: ‘ఏంటమ్మా‘ సాంగ్ మేకింగ్ వీడియో - ఆ కల నిజమైంది, మరిచిపోలేను: రామ్ చరణ్