News
News
వీడియోలు ఆటలు
X

Ram Charan: ‘ఏంటమ్మా‘ సాంగ్‌ మేకింగ్ వీడియో - ఆ కల నిజమైంది, మరిచిపోలేను: రామ్ చరణ్

సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే హీరో కలిసి నటించిన సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్'. హీరోయిన్ అన్నగా వెంకటేష్ నటించారు. ఇందులో 'ఏంటమ్మా' సాంగ్ తాజాగా విడుదలైంది. చెర్రీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

FOLLOW US: 
Share:

తంలో ఏ భాష చిత్రాలు ఆ భాషల్లోనే విడుదలయ్యేవి. అక్కడి నటీనటులే అందులో నటించే వారు. కానీ, ప్రస్తుతం ఏ భాషలో సినిమా విడుదలైనా డబ్ చేసి మిగతా భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి సినిమా పాన్ ఇండియన్ మూవీగానే తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆయా భాషల్లోని టాప్ హీరోలను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా భాషల హీరోలు నటించడం వల్ల అన్ని చోట్లా తమ సినిమాలు మంచి హిట్ అందుకుంటాయని భావిస్తున్నారు.

‘ఏంటమ్మా‘ సాంగ్ లో దుమ్మురేపిన చెర్రీ

తాజాగా బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకగా తెరకెక్కుతున్న సల్మాన్ ఖాన్ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్ హీరోయిన్ అన్నయ్యగా నటిస్తుండగా, రామ్ చరణ్ స్పెషల్ ఇంట్రీ ఇస్తున్నారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం హిందీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు కారణం రామ్ చరణ్. ఈ చిత్రంలోని 'ఏంటమ్మా' పాటను తాజాగా విడుదల చేశారు. ఇందులో చెర్రీ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ సాంగ్ పూర్తిగా సౌత్ స్టయిల్ లో సాగింది. సల్మాన్ ఖాన్, వెంకీ లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేశారు. అయితే, రామ్ చరణ్ ఎంట్రీ తర్వాత కంప్లీట్ వైబ్ మారింది. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. రామ్ చరణ్ సాంగ్స్ చాలా చేశారు. రామ్ చరణ్ స్టైల్ మీద ఐడియా ఉండటంతో ఇరగదీశారు. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పూజా హెగ్డే డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ పాట విడుదలైన 48 గంటల్లోనే ఏకంగా 43 మిలియన్ వ్యూస్ సాధించింది. 

ఈ పాటలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి- రామ్ చరణ్

ఇక తాజాగా ఈ పాటలో కనిపించడం పట్ల రామ్ చరణ్ స్పందించారు. ‘ఏంటమ్మా’ సాంగ్ చేసేటప్పుడు సెట్ లో తాను చాలా ఎంజాయ్ చేసినట్లు వెల్లడించారు. అందరూ కలిసి ఈ పాటకు చక్కటి డ్యాన్స్ వేసినట్లు చెప్పారు. సల్మాన్ ఖాన్, వెంకటేష్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి డ్యాన్స్ చేయడం చాలా గొప్పగా ఉందన్నారు.  ఈ పాటలో తాను భాగం కావడం మర్చిపోలేని అనుభూతి అన్నారు. ఈ పాట వెండితెరపై మరింత అద్భుతంగా ఉంటుందని చెర్రీ చెప్పుకొచ్చారు. ‘ఏంటమ్మా’ పాటను విశాల్ దద్లానీ, పాయల్ దేవ్ పాడారు. షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ అందించారు. 

Read Also: గలీజ్ కంటెంట్ ఆగాల్సిందే, ఓటీటీకి సెన్సార్‌షిప్‌పై సల్మాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు

View this post on Instagram
 
A post shared by Salman Khan Films (@skfilmsofficial)

ఇక రామ్ చరణ్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ చివరగా ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘RRR’లో కనిపించారు. 

Published at : 07 Apr 2023 01:06 PM (IST) Tags: Ram Charan Kisi Ka Bhai Kisi Ki Jaan Movie Yentamma Song

సంబంధిత కథనాలు

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Adipurush: రూ.1000 కోట్ల క్లబ్ లో 5 ఇండియన్ సినిమాలు - 'ఆదిపురుష్'కి ఆ జాబితాలో చేరే ఛాన్స్ ఉందా?

Adipurush: రూ.1000 కోట్ల క్లబ్ లో 5 ఇండియన్ సినిమాలు - 'ఆదిపురుష్'కి ఆ జాబితాలో చేరే ఛాన్స్ ఉందా?

Korean Thrillers: ఈ కొరియన్ థ్రిల్లర్ సినిమాలను ఒక్కసారి చూస్తే చాలు, జీవితంలో మరిచిపోలేరు - ఓ లుక్ వేసేయండి

Korean Thrillers: ఈ కొరియన్ థ్రిల్లర్ సినిమాలను ఒక్కసారి చూస్తే చాలు, జీవితంలో మరిచిపోలేరు - ఓ లుక్ వేసేయండి

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

KTR IT Report: హైదరాబాద్‌లో 1.83 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు - వార్షిక ఐటీ నివేదిక విడుదల

KTR IT Report: హైదరాబాద్‌లో 1.83 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు - వార్షిక ఐటీ నివేదిక విడుదల

Minister Peddireddy: ఏపీలో ముందస్తు ఎన్నికలపై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు - స్పష్టత ఇచ్చిన మంత్రి

Minister Peddireddy: ఏపీలో ముందస్తు ఎన్నికలపై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు - స్పష్టత ఇచ్చిన మంత్రి