News
News
వీడియోలు ఆటలు
X

‘బిచ్చగాడు 2’ కలెక్షన్స్ - రివ్యూలు నెగటివ్, ప్రేక్షకుల రెస్పాన్స్ పాజిటీవ్!

ఇటీవల రిలీజైన 'బిచ్చగాడు 2' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేస్తోంది. భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వారాంతంలో తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది..

FOLLOW US: 
Share:

Bichagadu 2 Box Office : నటుడు విజయ్ ఆంటోని, నటి కావ్య థాపర్ జంటగా నటించిన 'బిచ్చగాడు 2' ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడులోనూ మిశ్రమ సమీక్షలను అందుకుంది. కొన్ని రివ్యూలు ఈ మూవీకి నెగటివ్‌గా వచ్చాయి. ‘బిచ్చగాడు-1’తో ఈ మూవీకి సంబంధమే లేదంటూ పెదవి విరిచాయి. అయితే, ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే.. ప్రేక్షకులకు నచ్చితే రివ్యూలను కూడా పట్టించుకోరనేది స్పష్టమవుతోంది.

విజయ్ ఆంటోని స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాడుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా మంచి వసూళ్లను సాధించింది. ‘బిచ్చగాడు 2’ సినిమా ప్రారంభ వారాంతంలో తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.5 కోట్ల గ్రాస్ సాధించడం విశేషం. వచ్చే వారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, కావ్య థాపర్‌తో పాటు దేవ్ గిల్, జాన్ విజయ్, యోగి బాబు తదితరులు కూడా నటించారు. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం అందించారు. కాగా బిచ్చగాడు సినిమాతోనే హీరో విజయ్ ఆంటోనీకి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. కాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.1.88 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

బిచ్చగాడు 3పై ఊహాగానాలు

'బిచ్చగాడు పార్ట్ 1' భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల దానికి సీక్వెల్ గా వచ్చిన 'బిచ్చగాడు 2' రోజుకో రికార్డు సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూళ్లు చేస్తోన్న 'బిచ్చగాడు 2'.. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందని విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్ తో పాటు పలువురు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఇప్పుడు  'బిచ్చగాడు' ఫ్రాంచైజీలో మూడో విడతపై ఊహాగానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. చెన్నైలో 'బిచ్చగాడు 2' ప్రమోట్ చేస్తున్నప్పుడు నిర్వహించిన మీడియా ఇంటరాక్షన్‌లో విజయ్ ఆంటోనీ పార్ట్ 3పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బిచ్చగాడు 2 లాగానే 'బిచ్చగాడు 3' కూడా పూర్తిగా భిన్నమైన కథ అవుతుందని ఆయన వెల్లడించారు. దాంతో పాటు 'బిచ్చగాడు 3'కి కూడా తానే దర్శకత్వం వహిస్తానని విజయ్ చెప్పాడు. దీంతో ఇప్పటికే 'బిచ్చగాడు 1' ను ఎంజాయ్ చేసిన వారు, ఇటీవలే పార్ట్ 2 తో సెలబ్రేట్ చేసుకుంటున్నవారు.. ఇప్పుడు 'బిచ్చగాడు 3'పై భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. 

భారీ ఓపెనింగ్స్

'బిచ్చగాడు 2' తెలుగులో గుణ శేఖర్ రూపొందించిన సమంత రూత్ ప్రభు  'శాకుంతలం', నాగ చైతన్య 'కస్టడీ' కంటే అత్యధిక ఓపెనింగ్స్ నమోదు చేసింది. అంతే కాదు ఈ చిత్రం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్' 2 మొదటి రోజు వసూళ్లను కూడా బద్దలు కొట్టింది. 

బిచ్చగాడు 2016లో చిన్న సినిమాగా రిలీజైనా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇపుడు బిచ్చగాడు 2 కూడా అదే హవాను కొనసాగిస్తోంది. కాగా ఇటీవలే ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. జూన్ మూడో వారం నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also : సిద్ధార్థ్ రిలేషన్ షిప్‌పై అదితి క్యూట్ రియాక్షన్ - అంటే త్వరలోనే పెళ్లి?

Published at : 22 May 2023 08:34 PM (IST) Tags: Kavya Thapar Vijay Antony Telugu States Bichagadu 2 Bichagadu 2 Collections Record Collections

సంబంధిత కథనాలు

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్

Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్

Gufi Paintal Hospitalized : ఆస్పత్రిలో గుఫీ పెయింటల్ - విషమంగా 'మహాభారత్‌'లో శకుని ఆరోగ్య పరిస్థితి

Gufi Paintal Hospitalized : ఆస్పత్రిలో  గుఫీ పెయింటల్ - విషమంగా 'మహాభారత్‌'లో శకుని ఆరోగ్య పరిస్థితి

Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు

Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు

Adivi Sesh - Major's 1st Anniversary: భుజం నొప్పి ఉన్నా అమ్మ వంట చేసి పెట్టింది, మహేష్ బాబుకు థాంక్స్: అడవి శేష్

Adivi Sesh - Major's 1st Anniversary: భుజం నొప్పి ఉన్నా అమ్మ వంట చేసి పెట్టింది, మహేష్ బాబుకు థాంక్స్: అడవి శేష్

టాప్ స్టోరీస్

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

YS Viveka Case : సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి - అరెస్ట్ భయం లేనట్లే !

YS Viveka Case :  సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి - అరెస్ట్ భయం లేనట్లే !