By: ABP Desam | Updated at : 22 May 2023 05:37 PM (IST)
అదితి రావు(Image Credits: Aditi Rao Hydari/Instagram)
Aditi Rao Hydari-Siddharth: నటుడు సిద్దార్థ్ తో రిలేషన్ పై హీరోయిన్ అదితి రావు హైదరి స్పందించింది. ఇటీవలి కాలంలో వారిద్దరిపై పుట్టుకొచ్చిన రూమర్స్, వార్తల గురించి ఆమెను అడగగా.. అదితి క్యూట్ రియాక్షన్ ఇచ్చింది. ఆమె సిగ్గుపడుతూ విషయాన్ని దాటవేసింది. తామిద్దరి రిలేషన్ పై ఎలాంటి చెడు దృష్టి పడకుండా ఉండేందుకు ఆమె కేవలం సంజ్ఞలతోనే సమాధానమిచ్చింది. దీన్ని బట్టి చూస్తే వారిద్దరూ ప్రేమలో ఉన్నారని. ఆ ప్రేమపక్షుల మధ్య ఖచ్చితంగా ఏదో జరుగుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. అంటే వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమోనని తమకు తోచిన విధంగా అర్థాలు తీసుకుంటున్నారు.
గతేడాది నుంచి అదితి రావు, సిద్దార్థ్ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. వీరిద్దరూ కలిసి అప్పట్లో మహా సముద్ర అనే సినిమాలో కలిసి నటించారు. అప్పట్నుంచే వీరి మధ్య ప్రేమ చిగురించినట్టు టాక్ కూడా ఉంది. ఆ తర్వాతే ఈ ఇద్దరి గురించి అనేక రకాల వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లు సిద్దార్థ్, అదితి పలుమార్లు మీడియాకు కనిపించారు. పార్టీల్లో, పబ్బుల్లో కలిసి తిరిగారు. పలు ఈవెంట్స్, ఫంక్షన్స్ లోనూ కలసి కనిపించారు. దీంతో అప్పటికే వీరిద్దరి రిలేషన్ షిప్ పై క్రియేట్ అయిన రూమర్స్ కు మరింత ఆజ్యం పోసినట్టయింది. అంతే కాదు వీరిని చూసిన వారంతా వీరు త్వరతోనే పెళ్లి చేసుకోబోతున్నారనే కామెంట్స్ కూడా చేశారు. అంతేకాదు కొన్ని రోజుల క్రితం సిద్దార్థ్, అదితి రీల్స్ చేస్తూ అలరించారు.
ఇక తమ రిలేషన్ షిప్ పై ఇటీవలే అదితి రావు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు.. ఎదురైన ప్రశ్నలు ఆగ్రహానికి గురయ్యేలా చేశాయి. తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడవద్దని ఖరాకండిగా చెప్పేసింది అదితి. వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుందని ఆమె వెల్లడించింది. తాను ఎవరితో రిలేషన్ పిప్ లో ఉన్నానో అవసరం లేదని, ప్రస్తుతం తాను, చాలా సినిమాల్లో బిజీగా ఉన్నట్లు చెప్పింది. సినిమాల మీదే బాగా ఫోకస్ పెట్టినట్లు తెలిపింది. మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందే వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటానన్న ఆమె.. దయచేసి తన పర్సనల్ విషయాలను పట్టించుకోకపోవడం మంచిదని తేల్చి చెప్పింది.
ఇక అదితి సినిమా విషయాలకొస్తే ఆమె ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సంజయ్ లీలా భన్సాలీ తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి’లో నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం ఆయన రూపొందిస్తున్న ఈ సిరీస్ లో, పలువురు బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు కనిపించి కనువిందు చేశారు. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాల, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, శర్మిన్ సెహగల్, సంజీదా షేక్ మహారాణుల మాదిరిగా దర్శనం ఇచ్చారు.
Read Also : Pavitra Lokesh: నాకు ఒక శక్తి అండగా ఉంది, కష్టపడి నా కలలు నెరవేర్చుకున్నా: పవిత్ర లోకేష్
కీర్తి సురేష్‌కు టాలీవుడ్ షాక్ - శ్రీలీలా ఎఫెక్ట్‌తో కోలీవుడ్‌కు జంప్!
NTR - Balakrishna : బాలకృష్ణకు ముందే చెప్పిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్
Bholaa Shankar Pre Release : 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు 'ఇంద్ర' సెంటిమెంట్!?
Varshini - Washington Sundar : వర్షిణి ప్రేమలో సుందర్! - తన కంటే ఆరేళ్లు చిన్నోడితో డేటింగ్?
Balakrishna Multi Starrer : కన్నడ దర్శకుడితో బాలకృష్ణ, రజనీకాంత్ పాన్ ఇండియా మల్టీస్టారర్!?
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు