By: ABP Desam | Updated at : 17 Dec 2021 07:59 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
హిట్ 2 గ్లింప్స్ పోస్టర్ (Source: @NameisNani Twitter)
అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్ 2’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల అయింది. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘హిట్’ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. చిన్న సినిమాలు తీయడానికి నాని స్థాపించిన వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
విష్వక్సేన్ హీరోగా 2020లో వచ్చిన ‘హిట్’ చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హిట్ 2’ని కూడా ప్రకటించారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా అడివి శేష్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే విష్వక్సేన్ స్థానంలో కూడా కేడీ అనే మరో పాత్రను శేష్ ఇందులో పోషిస్తున్నారు.
మొదటి భాగంలో విక్రమ్ రుద్రరాజు పాత్రలో విష్వక్ నటించగా.. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. రెండో భాగం మాత్రం ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో రానుంది. ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశాక సెట్స్‌కు ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియరాలేదు. కేవలం గ్లింప్స్‌ను మాత్రమే షూట్ చేశారా.. రెగ్యులర్ షూటింగ్ కూడా అయిపోయిందా.. అనే సంగతి తెలియరాలేదు.
అయితే గ్లింప్స్‌లో ఉన్న షాట్లను చూస్తే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైందని అనుకోవచ్చు. కానీ గత కొంతకాలం నుంచి శేష్ పూర్తిగా మేజర్ షూట్ మీదే దృష్టి పెట్టినట్లు కనిపించింది. ఈ సినిమా షూటింగ్ గురించి ఇంతవరకు ఒక్క అప్‌డేట్ కూడా రాలేదంటే.. ఎంత సీక్రెట్‌గా షూట్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా మేజర్‌కు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను కూడా అందించారు. అయితే లాంగ్ అవైటెడ్ మూవీ గూఢచారి 2 గురించి మాత్రం ఎటువంటి అప్‌డేట్‌ను అందించలేదు. బహుశా వచ్చే సంవత్సరం సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
Bigger,Better and edge of the blade #HIT2
— Nani (@NameisNani) December 17, 2021
Happy birthday to our KD @AdiviSesh
With #Major and #HIT2 you are going to have the best year yet 🤗
Here’s the surprise for you #GlimpseOfKD https://t.co/e9EGWTFFDb@adivisesh
@saileshkolanu@prashantitipirn#meenakshichaudhary pic.twitter.com/TQbCBdnM68
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
Also Read: ‘బిగ్ బాస్’ విజేత ఎవరు? ఇలా ఓటేసి విన్నర్‌ను మీరే నిర్ణయించండి
Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు సపోర్ట్‌గా మహిళా మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Pathaan BO Collections, Day 5: ఐదు రోజుల్లో రూ.500 కోట్లు అవుట్ - కొత్త రికార్డులు రాస్తున్న పఠాన్!
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం
Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!