అన్వేషించండి

MAA Dispute : తెగేదాకా లాక్కోవద్దని హెచ్చరించిన ప్రకాష్ రాజ్..! ఎవరిని..?

"మా" కార్యవర్గ పదవీ కాలం ముగిసినా ఎన్నికలు పెట్టడం లేదని ప్రకాష్ రాజ్ ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడంటూ గతంలో ట్వీట్లు చేసిన ఆయన తాజాగా తేగెదాకా లాక్కోవద్దు అంటూ హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.


తెగేదాకా లాక్కండి..!  అంటూ ప్రకాష్ రాజ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మరో సారి అలజడి రేపుతోంది. ఆయన ఈ ట్వీట్‌ను దేని గురించి పెట్టారో చెప్పలేదు కానీ తెలుగులో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ట్రెండింగ్ టాపిక్ అయిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల గురించేనని చిత్ర పరిశ్రమలో చర్చ ప్రారంభమైంది. దీనికి కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న "మా" అసోసియేషన్ కార్యవర్గ పదవీ కాలం పూర్తయింది. ఎన్నికలు సెప్టెంబర్‌లో పెడతామని ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ గతంలో ప్రకటించారు. కానీ తక్షణం పెట్టాల్సిందేనని ప్రకాష్ రాజ్ ప్యానల్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆయన మద్దతుదారులైన ప్రస్తుత కార్యవర్గంలోని 15 మంది తక్షణం ఎన్నికలు పెట్టాలని క్రమశిక్షణా కమిటీ చైర్మన్ అయిన కృష్ణంరాజుకు లేఖ రాశారు. 

రెండు సార్లు లేఖలు రాసిన తర్వాత  వర్చువల్‌గా కృష్ణంరాజు "మా" కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో ఆగస్టు 22న "మా"  జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించాలని...సెప్టెంబర్‌ 12న అధ్యక్ష ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఎన్నికల ప్రకటన చేయలేదు. అయితే కృష్ణంరాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. "మా" ప్రస్తుత కార్యవర్గానికి చట్టబద్దత ఉన్నట్లేనని, ఎన్నికలు జరిగే వరకు గరిష్టంగా 6 సంవత్సరాల వరకు అధికారం ఉంటుందని న్యాయనిపుణులు తేల్చారని చెప్పుకొచ్చారు. దీంతో ఎన్నికలు పెట్టరేమోనన్న ఆందోళనకు ప్రకాష్ రాజ్ వచ్చారని చెబుతున్నారు. ఈ కారణంగానే ప్రకాష్ రాజ్ అసంతృప్తికి గురై.. తెగె దాకా లాగొద్దని హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 

"మా" ఎన్నికలు టాలీవుడ్‌లో  సస్పెన్స్ ధ్రిల్లర్ మూవీని తలపిస్తున్నాయి. ముందుగా ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించి రంగంలోకి దిగారు. తర్వాత వరుసగా అనేక మంది తెరపైకి వచ్చారు. మంచు విష్ణు ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఆయనకు టాలీవుడ్‌లోని ఓ వర్గం గట్టి మద్దతు ఇస్తోంది. ప్రకాష్‌రాజ్‌కు మరో బలమైన వర్గం మద్దతిస్తోంది. తాము కూడా పోటీ చేస్తామని హేమ, జీవిత, సీవీఎల్ నరసింహారావు లాంటివారు ప్రకటించారు. అయితే..  పెద్దలందరూ ఏకగ్రీవం అని నిర్ణయిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని విష్ణు ఆఫర్ ఇచ్చారు. కానీ ఎవరూ స్పందించలేదు. అందుకే ప్రస్తుత ప్రకాష్ రాజ్ ట్వీట్ హైలెట్ అవుతోంది. సాధారణంగా ప్రకాష్ రాజ్.. జాతీయ అంశాలపై ఇంగ్లిష్‌లో ట్వీట్లు చేస్తుంటారు. టాలీవుడ్‌కు సంబంధించినది కాబట్టే తెలుగులో ట్వీట్ చేశారని అంటున్నారు.

తెగేదాకా లాక్కండి....#Justasking

— Prakash Raj (@prakashraaj) August 4, 2021

">

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today November 22nd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నీతూ ఎలిమినేట్! సరదా సరదాగా సండే ఎపిసోడ్! మైసా.. రష్మిక సందడి!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నీతూ ఎలిమినేట్! సరదా సరదాగా సండే ఎపిసోడ్! మైసా.. రష్మిక సందడి!
Psychological Thriller OTT : మనుషుల బ్రెయిన్స్‌పై టెస్టింగ్... కరోనాకు లింక్ - ఓటీటీలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డోంట్ మిస్
మనుషుల బ్రెయిన్స్‌పై టెస్టింగ్... కరోనాకు లింక్ - ఓటీటీలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డోంట్ మిస్
MegaVerse Launching Date : మెగాస్టార్ చిరు టాక్ షో - మెగావర్స్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
మెగాస్టార్ చిరు టాక్ షో - మెగావర్స్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget