HariHara Veeramallu: అక్టోబర్ లో 'హరిహర వీరమల్లు' షూటింగ్ - వీడియో రిలీజ్ చేసిన టీమ్!
'హరిహర వీరమల్లు' సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్(Krish) 'హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu) అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల కమిట్మెంట్స్ తో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. మొన్నామధ్య క్రిష్ తో కలిసి స్టోరీ డిస్కషన్స్ లో కూర్చున్నారు పవన్. దానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకొచ్చాయి. ఆ తరువాత మళ్లీ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈరోజు ఉదయం నుంచి పవన్ కొత్త లుక్ కి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా.. కాసేపటి క్రితమే దర్శకనిర్మాతలు ఒక వీడియోను రిలీజ్ చేశారు. అందులో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి ముందు వర్క్ షాప్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో చాలా మంది నటులు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ గురించి డిస్కస్ చేస్తుంటే.. క్రిష్ ఒక సన్నివేశం వివరిస్తూ కనిపించారు. ఇక వీడియో చివర్లో అక్టోబర్ మిడ్ నుంచి షూటింగ్ మొదలుకానుందని వెల్లడించారు.
ఇక 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా రిలీజ్ అప్డేట్:
మొదట ఈ దసరాకి సినిమా వస్తుందన్నారు. ఆ తరువాత 2023 సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను 2023 మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం(AM Ratnam) రిలీజ్ డేట్ విషయాన్ని బయటపెట్టారు.
ఈ సినిమాతో పాటు తమిళ సినిమా 'వినోదయ సీతమ్'(Vinodhaya Sitham) రీమేక్ లో నటించడానికి పవన్ అంగీకరించారు. సముద్రఖని(Samuthirakani) ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కూడా నటించనున్నారు. మూడు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారు.
Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?
Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?
On this auspicious Saraswati Panchami day, with d divine blessings of Sarawasthi Devi, we’ve started an extensive pre-schedule Workshop of #HariHaraVeeraMallu where the cast n crew participated in it, before a grand epic schedule from mid-October
— Krish Jagarlamudi (@DirKrish) September 30, 2022
▶️ https://t.co/iEGfEu9vkT