Guppedantha Manasu November 4th : రొమాన్స్ లో మునిగితేలుతున్న రిషిధార- విడగొట్టేందుకు దేవయాని కుట్ర
Guppedantha Manasu November 4th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
ధరణి వంటగదిలో చపాతీలు చేస్తుంటే వసు వచ్చి హెల్ప్ చేస్తాను అని అడుగుతుంది. రిషికి చపాతీలు అంటే చాలా ఇష్టం అని ధరణి అనేసరికి వసు అయితే నేను చేస్తాను అని చెప్తుంది. వసు చపాతీలు చేస్తూ ఉంటే వెనుక రిషి వస్తాడు. ధరణి వచ్చిందనే అనుకుని వసు మాట్లాడుతూనే ఉంటుంది. మీకు థాంక్స్ చెప్పుకోవాలి, ఆడగ్గానే చపాతీ చేసే అవకాశం ఇచ్చారు. రిషి సర్ కి చపాతీ అంటే ఇష్టమని మీరు చెప్పేదాక నాకు తెలియదు. నేను చేసే చపాతీలకి రిషి సర్ పేరే పెడతాను. ప్రిన్స్ చపాతీ, జెంటిల్మెంట్ చపాతీ అని పేరు పెడతాను అని వెనక్కి తిరిగేసరికి రిషి ఉంటాడు. చపాతీలు చేస్తావా అప్పడాలు చేస్తావా అని కౌంటర్ వేస్తాడు. ఇద్దరి మధ్య కాసేపు చపాతీ గోల నడుస్తుంది.
తర్వాత చపాతీ గురించి తెగ క్లాస్ పీకుతుంది వసు. ఎలా చెయ్యాలో చెప్తుంది. ధరణి దేవయానికి తల నొప్పిగా ఉందంటే మర్దన చేస్తూ ఉంటుంది. వసు ఎక్కడ ఉందని దేవయాని ధరణిని అడుగుతుంది. కిచెన్లో చపాతీలు చేస్తుందని చెప్తుంది. రిషి ఎక్కడ ఉన్నాడు అంటే కిచెన్లో అని అంటుంది. ఈ రిషికి ఏం పని లేదు ఆ వసుధార ఎక్కడ ఉంటో అక్కడ రిషి ఉంటున్నాడు వెళ్ళి తనని పిలువు అని ధరణికి చెప్తుంది. రిషి రోజు రోజుకి ఆ వసుధార మాయలో కూరుకుపోతున్నాడు నన్ను లెక్కచేయడం లేదు ఇది ఇలాగే కొనసాగితే నా ఉనికికె ప్రమాదం ఎలాగైనా రిషిని మళ్ళీ నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలి అని దేవయాని మనసులో అనుకుంటుంది.
Also Read: కార్తీక్ కి గతం గుర్తొచ్చిందని అనుమానించిన మోనిత- శౌర్య దగ్గరకి వచ్చిన ఆనందరావు, హిమ
రిషి చపాతీలు రుద్దాడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ రాదు. నేను చూపిస్తాను అని వసు రిషికి చపాతీలు చేయడం నేర్పిస్తూ ఉంటుంది. ఇద్దరి చూపులు కలిసి కాసేపు రొమాన్స్ నడుస్తుంది. ధరణి రావడం చూసి ఇద్దరు బిక్కమొహం వేస్తారు. రిషి దేవయాని దగ్గరకి వస్తాడు. పక్క నే తలనొప్పి బామ్ చూసి ఏమైందని అడుగుతాడు. వసుధార వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మానాన్నలని కలిసి పెళ్లి నిశ్చయించుకుందామని చెప్తుంది.
రిషి: డాడ్ లేకుండా ఈ విషయం వద్దు
దేవయాని: పెళ్లి పనులు మొదలైతే అయిన వాళ్ళు వస్తారేమో
రిషి: లేదు పెద్దమ్మా డాడ్ లేకుండా ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు
Also read: ఆదిత్యతోనే ఉంటానన్న దేవి- రుక్మిణి మీకు కనిపించిందా అని సత్యని ప్రశ్నించిన దేవుడమ్మ
వసు, రిషి కలిసి ఆనందంగా దీపాలు వెలిగిస్తారు. ఈ చిన్న దీపాలు, ఆకాశం, మెరిసే నీ కళ్ళు, నీ ఆనందం ఇంతకన్నా ఆనందం ఏముంటుందని రిషి అంటాడు. ఏంటి సర్ కవిత్వం చెప్తున్నారా అంటే రిషి సావాసదోషం అని అంటాడు. నా జీవితంలో చిన్న కొరత ఉన్నప్పుడు నువ్వు వచ్చావ్. నువ్వు లేకపోయి ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏమైపోయేవాడినో అని బాధపడతాడు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది.