Guppedantha Manasu November 26th Update: జగతికి రిషి సేవలు, మహేంద్ర మాట వినని రిషి, హాస్పిటల్లోకి ఎంట్రీ ఇచ్చిన దేవయాని
Guppedantha Manasu November 26th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్ ( Guppedantha Manasu November 26th Today Episode 618)
జరిగిన యాక్సిడెంట్ విషయం గురించి గౌతమ్ తో మాట్లాడుతూ మహేంద్ర బాధపడతాడు..ఏం కాదు అంకుల్ డాక్టర్స్ కూడా బాగవుతుంది అని చెప్పారు మీరు భయపడకండి అని ధైర్యం చెబుతాడు గౌతమ్. పెద్దమ్మ,పెదనాన్నకి కాల్ చేశానని గౌతమ్ అంటే..థాంక్స్ గౌతమ్ అన్ని దగ్గర ఉండి చూసుకుంటున్నావు అంటాడు. మీరు నాకు థాంక్స్ చెప్పడమేంటి ఇది నా బాధ్యత అంటాడు గౌతమ్. టీ ఏమైనా తీసుకురానా అని అడిగితే నాకిప్పుడు ఏమీ వద్దు గౌతమ్.. జగతికి బాగైతే చాలంటాడు..
రిషి..జగతికి బ్లడ్ ఇస్తుంటాడు... అది చూసి వసుధార ఎమోషన్ అవుతుంది..
వసు: మిమ్మల్ని నేను కలపడం ఏంటి రక్త బంధమే మిమ్మల్ని కలుపుతోంది ఇంతకన్నా గొప్ప అనుబంధం ఏముంటుంది అనుకుంటుంది...
ఇంతలో నర్స్ వచ్చి బయటకు వెళ్లండి అని చెబుతుంది.. వసుధారా డాడ్ కి చెప్పు మేడంకి ఏమీకాదని అంటాడు రిషి.. సరే అని బయటకు వెళ్లిపోతూ జగతి దగ్గరకు వెళుతుంది వసుధార... 'మేడం మీ అబ్బాయి మీకు రక్తం ఇస్తున్నాడు. మీకేం కాదు మేడం మీరు త్వరగా కోలుకుంటారు మీ అబ్బాయి మిమ్మల్ని కాపాడుకుంటున్నారు. కొడుకుగా అది తన బాధ్యత కదా' అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
Also Read: శౌర్య నమ్మకం నిజమైందని తెలుసుకున్న సౌందర్య, దీపకు నిజం చెప్పేసిన కార్తీక్!
గౌతమ్ మహేంద్రకు టీ తీసుకుని ఇచ్చినా..నాకొద్దు గౌతమ్.. జగతికి ఎలా ఉందో అని టెన్షన్ పడతాడు. ఏం కాదు అంకుల్... రిషి బ్లడ్ ఇస్తున్నాడు కదా అని ధైర్యం చెబుతాడు గౌతమ్. ఇంతలో అక్కడకు వచ్చిన వసుధార.. ఫణీంద్ర సార్ కాల్ చేసి మేడం కండిషన్ గురించి అడిగారు వస్తున్నానని చెప్పారంటుంది...
మహేంద్ర: దేవయాని వదిన ఈసమయంలో కూడా ఏదో అవకాశం వెతుక్కుంటుంది..మీరిద్దరూ ఏమీ మాట్లాడొద్దు .. రిషికి నేను క్షమాపణలు చెప్పుకుంటాను..ఇంకెప్పుడూ రిషిని వదిలి వెళ్లేది లేదంటూ కూర్చోమ్మా అని వసుని పిలుస్తాడు.. మేం లేని సమయంలో రిషిని కంటికిరెప్పలా చూసుకున్నావంట థ్యాంక్యూ
వసు: అది నా బాధ్యత సార్
మహేంద్ర: రిషి ఏమంటున్నాడు..
వసు: తల్లి రుణం తీర్చుకుంటున్నారు సార్..
రిషి బ్లడ్ ఇవ్వడం పూర్తి అవ్వడంతో జగతి వైపు ఎమోషనల్ గా చూస్తూ ఉంటాడు. అప్పుడు రిషి...జగతి దగ్గరికి వెళ్లి గతంలో జగతి మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు. అప్పుడు జగతి రిషి రిషి అని కలవరిస్తూ ఉంటుంది.
నర్స్: ఈ మేడం ఈ ఒక్క పేరే కలవరిస్తున్నారు..మీరేనా సార్ రిషి అంటే..ఏమవుతారు సార్ మీరు తనకి..చెప్పండి అనేసి... ఒక్క నిముషం చూసుకోండి సార్ ఇప్పుడే వస్తానని వెళ్లిపోతుంది నర్స్..
రిషి: మేడం మీకేం కాదు మీకేం కానివ్వను ..డాడ్ కి మీకు ఇలా జరగడం చాలా బాధకలిగించింది.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టైంది.. డాడ్ కిమీరంటే ప్రాణం..మీరే ఆయనకు గొప్ప ఊరట..మీరు బావుండాలి డాడ్ మీరు కలసి ఉండాలి ఆనందంగాఉండాలి..ఇదే నేను కోరుకుంటున్నా అంటాడు...
రిషి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు వెనక్కు తిరుగుతాడు...ఇంతలో జగతి రిషి చేయి పట్టుకుంటుంది.. జగతి కన్నీళ్ల చూసి తుడుస్తాడు రిషి..
రిషి: మీరు స్పృహలో లేకపోయినా నా మాటలు మీ మనసుకిచేరాయి అనుకుంటున్నా.. మీకు నాకుజరిగిన వన్నీ నేను ప్రస్తావించదలుచుకోలేదు.. మీరు-డాడ్ ఆనందంగా ఉండడమే నాకు కావాలి అంటాడు..
అప్పుడు జగతి... మళ్లీ నీ దగ్గరికి వస్తున్నాం రిషి బయలుదేరాం అని కలవరిస్తూ ఉంటుంది. రిషి జగతి తల నిమురుతాడు. జగతి చెవి దగ్గరికి వెళ్లి మీకేం కాదు అని చెప్పి బయటకు వెళ్తుండగా దాహం దాహం అనగానే నీళ్లు పడతాడు. బయటి నుంచి ఇదంతా చూసి సంతోషిస్తారు గౌతమ్, మహేంద్ర, వసు..లోపలికి వెళ్దాం పదండి అంకుల్ అనడంతో మహేంద్ర వద్దు ఆ తల్లి కొడుకుని అలాగే వదిలేద్దాం అంటాడు గౌతమ్...
Also Read: కేజీఎఫ్ బ్యాగ్రౌండ్ ట్రాక్ తో ఎమోషన్ పీక్స్, జగతి-రిషిని చూసి మురిసిన మహేంద్ర-వసు-గౌతమ్
ఇంతలోనే అక్కడికి దేవయాని ఫణింద్ర వస్తారు. మహేంద్ర తాను బయటికి వెళ్లడానికి కారణాలు చెబుతుండగా మీరేం చెప్పకండి డాడ్ నేనేమీ అడగను మీరు బాగుంటే చాలు మేడంకి బాగవుతుంది అని ధైర్యం చెబుతాడు. నీకు చాలా చెప్పాలి కానీ మాటలు రావడం లేదంటాడు మహేంద్ర..మీరు ఎక్కడికి వెళ్లారో,ఎందుకు వెళ్లారో నాకు అనవసరం ఇంకెప్పుడూ వదిలేసి వెళ్ళకండి మీరు లేకుండా నేను ఎలా ధైర్యంగా ఉండగలను అంటాడు.
ఎపిసోడ్ ముగిసింది..
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి