అన్వేషించండి

Karthika Deepam November 26th Update: శౌర్య నమ్మకం నిజమైందని తెలుసుకున్న సౌందర్య, దీపకు నిజం చెప్పేసిన కార్తీక్!

కార్తీకదీపం నవంబరు 26 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam November 26th  Episode 1520 (కార్తీకదీపం నవంబరు 26 ఎపిసోడ్)

ఏడుస్తున్న దీపకు ధైర్యం చెప్పిన కార్తీక్...శౌర్య దొరుకుతుంది..ఇక నీ భర్త అంటావా.. నువ్వు పడుతున్న తపన, తాపత్రయం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది నన్న నీ భర్త అనుకో అంటాడు..
దీప: ఏమన్నారు మీరు చెప్పేది నిజమా
కార్తీక్: నిజమే దీపా..ఎందుకో తెలియదు నీతోనే ఉండాలనిపిస్తోంది..నీ సమస్యలన్నీ నా సమస్యలు అనిపిస్తున్నాయి.. ఏం చేసి అయినా సంతోషంగా ఉంచాలి అనిపిస్తోంది..నీ భర్తగా ఉండడం వల్ల ఆ సంతోషం వస్తుంది అనుకుంటే నేను నీ భర్తనే..నీ నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను..ఈ క్షణం నుంచి నీకు నేనున్నాను..ధైర్యంగా ఉండు...
దీప: పట్టలేనంత ఆనందంతో హగ్ చేసుకుంటుంది.. కార్తీక్ దీప కన్నీళ్లు తుడుస్తాడు...

Also Read: కేజీఎఫ్ బ్యాగ్రౌండ్ ట్రాక్ తో ఎమోషన్ పీక్స్, జగతి-రిషిని చూసి మురిసిన మహేంద్ర-వసు-గౌతమ్

శౌర్య-ఇంద్రుడు-చంద్రమ్మ...ముగ్గురూ దీప-కార్తీక్ కోసం వెతుకుతారు.. ఈ రోజైనా అమ్మానాన్న కనిపిస్తారా అని శౌర్య అంటే మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం అని చంద్రమ్మ అంటే..దేవుడి దయ లేదు అంటావా అని శౌర్య అంటుంది. అమ్మా నాన్న కనిపిస్తే తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోదాం అంటుంది. మరోవైపు దీప-కార్తీక్...శౌర్య ఫొటో చూపించి అందర్నీ అడుగుతుంటారు... ఇంకోవైపు శౌర్య...సౌందర్య వాళ్లని చూస్తుంది...
సౌందర్య: నాతో వస్తానని చెప్పి..ఊరు దాటిస్తారా
శౌర్య: ఆ రోజు నువ్వే వదివేసి వెళ్లిపోయావుకదా
సౌందర్య: నీకుఅలా చెప్పారా..అలా చెప్పి మాకు దూరం చేస్తున్నారా..
శౌర్య: బాబాయ్, పిన్నిని ఏమీ అనొద్దు..అమ్మా నాన్నను వెతికేందుకు నాకు సాయం చేస్తున్నారు
ఆనందరావు: మీ అమ్మా నాన్న నీకోసం వచ్చారని తెలిసి..నిన్ను కావాలనే ఊరు దాటించారు
శౌర్య: నిజమా బాబాయ్..చెప్పు
ఇంద్రుడు: ముందు ఇచ్చేద్దాం అనుకున్నాం..జ్వాలమ్మలో మా బిడ్డను చూసుకున్నాం క్షమించమ్మా...
చంద్రమ్మ: జ్వాలమ్మ లేకుండా బతకలేం అనిపించింది అందుకే ఇలా చేశాం
సౌందర్య: ఇప్పటికైనా అర్థమైందా..ఇంటికి వస్తావా
శౌర్య: అమ్మా నాన్నని చూడనిదే నేను రాను...
శౌర్య అరుపులు విన్న దీప..కార్తీక్కి చెబుతుంది..మొత్తం అంతా ఒకే దగ్గర ఉన్నారని గొంతు విని తెలుసుకున్న దీప-కార్తీక్ ఇద్దరూ అటువైపు పరుగుతీస్తారు...
దీప-కార్తీక్ కి చూసి వాళ్లంతా షాక్ అయితే.. అందర్నీ ఓ దగ్గర చూసి దీప-కార్తీక్ ఆనందపడతారు...
సౌందర్య: ఇన్నాళ్లూ ఎక్కడున్నారు..ఏమైపోయారు..ఎందుకు కబురు పెట్టలేదు
కార్తీక్; వద్దామనే అనుకున్నాం..కానీ..రాలేని పరిస్థితి అయిపోయింది.. దాన్నుంచి బయటపడి వద్దాం అనుకుంటేశౌర్య ఇక్కడే ఉందని తెలిసి వెతుక్కుంటూ ఉండిపోయాం..
శౌర్య:నేను చెప్పింది నిజమైంది కదా...
సౌందర్య: అమ్మా నాన్నలు వస్తేకానీ రానన్నావ్ ...అలాగే వచ్చారు..ఏ ముహుర్తాన ఆ ప్రమాదం జరిగిందో కానీ చెట్టుకొకరు,పుట్టకొకరు బతికాం..మళ్లీ మనం విడిపోయే పరిస్థితి రాకూడదు...
దీప: ఆ పరిస్థితి ఎప్పుడో దాటేశాం..ఇక మనల్ని విడదీసేవారెవరు...
ఈ లోగా మోనిత గన్ పట్టుకుని ఎంట్రీ ఇచ్చి..దీపను కాల్చేస్తుంది.... నాకు దక్కని సంతోషం నీకెలా దక్కనిస్తా...
నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తాడు ఆనందరావు.... 'ఇదంతా మొత్తం ఆనందరావు కల'
ఆనందరావు: కలలో కనిపించిన నా కొడుకు కోడలు కళ్లముందు కనిపించేలా చేయి స్వామీ...నా మనవరాలి నమ్మకాన్ని వమ్ము చేయకుస్వామీ...అని దేవుడికి దండం పెట్టుకుంటాడు...

Also Read: దీపను షూట్ చేసిన మోనిత, జైలుకెళ్లిన దుర్గ , ఇది ముగింపా -మరో మలుపా!

శౌర్య కోసం ఆ ఇంటికి వెళుతుంది సౌందర్య.. తాళం వేసి ఉండడం చూసి షాక్ అవుతుంది.. శౌర్యకి నాతో రావడం ఇష్టం లేక ఇల్లు ఖాళీ చేసి వెళ్లారా అనుకుంటుంది.. ఇంతలో వేరవాళ్లు ఆ ఇంటి తాళం తీయడం చూసి మళ్లీ వెనక్కు వెళ్లి అడుగుతుంది.. అప్పుడు నేను వచ్చేటప్పుడు మీరిక్కడే ఉన్నారు కదా అని పెద్దావిడను ప్రశ్నిస్తుంది..
అప్పుడు వాళ్లు..లోపలకు రండమ్మా అసలు విషయం చెబుతాం అని తీసుకెళతారు..

మరోవైపు దీప..ఇంట్లో..కార్తీక్ కోసం ఎదురుచూస్తుంటుంది.. శౌర్య అంటించినప్పుడు కిందపడిన పోస్టర్ దీపకు దొరుకుతుంది కదా..ఆ పోస్టర్ చూపిస్తుంది. ఇంద్రుడు మళ్లీ తప్పుదారి పట్టించాడని చెబుతుంది. వాళ్లకి శౌర్య అంటే ప్రేమ ఉండొచ్చు కానీ వాళ్లు చేస్తున్నది తప్పు అన్న కార్తీక్..ముందు హాస్పిటల్ కి వెళ్లి నీకు బ్లడ్ టెస్ట్ చేయిద్దాం అంటాడు. ఈ ఒక్కసారికీ వస్తాను..ఆ తర్వాత శౌర్య దొరికే వరకూ హాస్పిటల్ అని విసిగించకూడదు అంటుంది దీప.. ఇంతలో అక్కడకు ఆ ఇంటి ఓనర్ వస్తుంది... డాక్టర్ బాబుని చూసి కన్నీళ్లతో కాళ్లపై పడిపోతుంది.. నన్ను క్షమించాలి మీ మంచితనం తెలియక చాలా మాటలన్నాను..మీ ఆస్తి మొత్తం లాక్కున్నాను నన్ను క్షమించండి డాక్టర్ బాబు అంటుంది. ఈవిడ తెలిసినట్టు మాట్లాడితే నాకు గతం గుర్తొచ్చినట్టు దీపకు తెలిసిపోతుంది అనుకుంటూ... మీగురించి దీప చెప్పింది..పాపను వెతకడంలో సహాయం చేయండి అంటాడు కార్తీక్..ఆమె సరే అంటుంది.

ఇంద్రుడు-చంద్రమ్మ చేసిన కుట్ర మొత్తం బయటపెడతారు ఆ ఇంట్లో ఉన్న వారు. వాళ్లెక్కడున్నారని సౌందర్య అడిగితే.. వాళ్లు ఊరొదిలి వెళ్లిపోయారు...ఆ రోజు రాత్రి వాళ్ల అమ్మా నాన్నలు వస్తున్నారని తెలిసి రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని చెబుతారు... ఆ మాట విని సౌందర్య షాక్ అవుతుంది... ఇంద్రుడు తనకు తెలిసిన వాళ్లకు ఈ విషయం చెప్పాడని వాళ్లు చెబుతారు... సౌందర్యకు ఒక్కసారిగా తలపట్టేసినట్టు అవుతుంది.. అంట శౌర్య చెప్పింది నిజమా..నా కొడుకు కోడలు బతికే ఉన్నారా..ఈ ఊళ్లోనే ఉన్నారా..మరెందుకునా దగ్గరకు రాలేదు.. ఇప్పుడెక్కన్నారు...ఆ మోనిత ఉచ్చులో ఏమైనా చిక్కుకున్నారా అని తలపగలిపోయేలా ఆలోచిస్తుంది సౌందర్య... వాళ్ల ఆచూకీ తెలిస్తే నా నంబర్ కి కాల్ చేయమని చెప్పేసి  బతిమలాడుతుంది...  మరోవైపు దీప రిపోర్ట్స్ చూసిన కార్తీక్..దీపను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలి.. ఈ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తాడు ఎపిసోడ్ ముగిసింది

సోమవారం ఎపిసోడ్ లో
చెప్తే నీకు అర్థం కాదా..పొగ పడదు అంటున్నా కదా అయినా ఎందుకు వంటచేస్తున్నావ్..నువ్వు ఎవరు నీకేం హక్కుంది అనకు...నేను నీ డాక్టర్ బాబుని, నాకు గతంగుర్తొచ్చింది కానీ నీతోచెప్పలేకపోయాను ... కానీ ఇప్పుడు నేను ఎవరో చెబితే కానీ నువ్వు మాటవినవని చెబుతున్నా అంటాడు.. దీప షాక్ అయి చూస్తుంటుంది...

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hellallallo Song Telugu Lyrics : ట్రెండింగ్‌లో హల్లల్లల్లో ఐటెం సాంగ్ - ఎనర్జిటిక్ స్టెప్స్ విత్ రొమాంటిక్ టచ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో హల్లల్లల్లో ఐటెం సాంగ్ - ఎనర్జిటిక్ స్టెప్స్ విత్ రొమాంటిక్ టచ్ లిరిక్స్
Save The Tigers Series season 3 : సేవ్ ది టైగర్స్ సిరీస్ సీజన్ 3 రెడీ - ఈసారి స్పెషల్ సర్ప్రైజ్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సేవ్ ది టైగర్స్ సిరీస్ సీజన్ 3 రెడీ - ఈసారి స్పెషల్ సర్ప్రైజ్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ram Charan: పేర్లతో రామ్ చరణ్ కన్‌ఫ్యూజన్... ఫుల్ ట్రోల్స్‌, చివరకు బుమ్రాకు సారీ చెప్పిన మెగా పవర్ స్టార్
పేర్లతో రామ్ చరణ్ కన్‌ఫ్యూజన్... ఫుల్ ట్రోల్స్‌, చివరకు బుమ్రాకు సారీ చెప్పిన మెగా పవర్ స్టార్

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
IPL 2026 Playoff Race: రేసు రసవత్తరం...Playoff మహత్తరం
రేసు రసవత్తరం... Playoff మహత్తరం
Ram Charan : పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
Embed widget