By: ABP Desam | Updated at : 03 Feb 2023 08:54 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
గుప్పెడంతమనసు ఫిబ్రవరి 3 ఎపిసోడ్ (Guppedanta Manasu February 3rd Update)
దేవయాని స్కెచ్ వేసి..రాజీవ్ ను కాలేజీకి పంపిస్తుంది. నేరుగా కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్లిన రాజీవ్..వసుధార నా భార్య అని అందరికీ చెప్పి హడావుడి చేస్తాడు. ఇలా వచ్చి గొడవ చేయడం మంచిది కాదు మర్యాదగా బయటికి వెళ్ళండి అంటారు మహేంద్ర , జగతి. అయినప్పటికీ వినిపించుకోని రాజీవ్.. కాలేజీ మొత్తం వినిపించేలా వసు ఎక్కడ ఉన్నావు నీ రాజీవ్ వచ్చాడు అంటూ అరుస్తుంచాడు. స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ చుట్టూ చేరుతారు.. అప్పుడువసుధార వచ్చి ఎందుకొచ్చావ్ అని అడుగుతుంది. నీకోసం అనడంతో షాక్ అవుతుంది. ఇక్కడి నుంచి వెళతావా లేదా అని వసు ఫైర్ అవుతుంటే.. ఇద్దరం కలసి వెళదాం రా అంటాడు..
Also Read: మనసులో ప్రేమ బయటకు బెట్టు - కాలేజీలో రాజీవ్ రచ్చకి రిషిధార ఇచ్చే సమాధానం ఏంటి!
వసు: ఎందుకు రావాలి
రాజీవ్: నవ్వుకుంటూ అందరూ విన్నారా నా పెళ్ళాం నాతో రమ్మంటే ఎందుకు అని ప్రశ్నిస్తోంది
వసుధార చేయిపట్టుకుని లాక్కెళుతుంటాడు..ఇంతలో రిషి ఎదురుపడతాడు..
రాజీవ్: నమస్తే రిషి సార్ బాగున్నారా
రిషి: ఏం జరుగుతోంది ఇక్కడ
రాజీవ్: భార్యాభర్తల మధ్య చిన్న తగాదా జరుగుతోంది ..రమ్మంటే రానంటుంది
వసుధార: నేను రానని చెబుతున్నాను కదా
రిషి: ఏంటి వసుధార ఇది ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు వెళ్ళిపో
అప్పుడు రాజీవ్ నుంచి తప్పించుకుని వెళ్లి రిషి వెనుక దాక్కుని..సార్ నేను రాను అని చెప్పండి తనతో వెళ్లడం నాకు ఇష్టం లేదని చెబుతుంది.
రిషి: ఎందుకు వెళ్లవు..భార్య అంటున్నాడు కదా..
రాజీవ్ : మీరు జెంటిల్మెన్ సార్ అని పొగుడుతూ ఉంటాడు.
అప్పుడు రిషి వసుధార మీద సీరియస్ అవుతూ ఏంటి కాలేజీలో పంచాయితీ వెళ్తావా లేదా అంటూ రిషి..రాజీవ్ చేయి పట్టుకుంటాడు.. ఏంటి సార్ ట్విస్ట్ అంటాడు రాజీవ్..ఈ ట్విస్ట్ ఇక్కడ కాదు అక్కడ అంటూ పోలీసుల దగ్గరికి పంపిస్తాడు రిషి.
పోలీసులను చూడడంతో రాజీవ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.
ఏరా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఏడిపిస్తావా నువ్వు వస్తావని తెలిసే మేము రిషి సార్ ని ఆపమని చెప్పాము. అమ్మాయి నీ పెళ్లామా అసలు నువ్వు ఆ తాళే కట్టలేదు కదరా అనడంతో రిషి, మహేంద్ర,జగతి షాక్ అవుతారు. కానిస్టేబుల్స్ వీడిని తీసుకెళ్లండి అని చెప్పి పోలీస్ రిషి దగ్గరికి వెళ్లి చాలా థాంక్స్ సార్ నేను మిమ్మల్ని మిస్ అండర్ స్టాండ్ చేసుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అప్పుడు అందరూ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో వసుధార కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కాలేజీ ఫ్యాకల్టీ దేవయానికి ఫోన్ చేసి జరిగింది మొత్తం వివరించడంతో దేవయాని షాక్ అవుతుంది.
Also Read: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు
వసుధార-రిషి: వసుధార ఒకచోట కూర్చుని జరిగిన విషయాలు తలుచుకుని ఏడుస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు వసుధార వెళ్ళిపోతుండగా నీ మెడలో ఆ తాళి ఎవరు కట్టారు అనడంతో నేను మీకు ఇంతకు ముందే చెప్పాను సార్ ఈ తాళి నా ఇష్ట పూర్వకంగానే మెడలో పడింది అని అంటుంది. నీ మెడలో తాళి ఆ రాజీవ్ కట్టలేదు.. అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటున్నాడు రిషి. అప్పుడు రిషి,వసుధార నాకు సమాధానం కావాలి అనగా వసుధార మాత్రం పొంతన లేకుండా ఏవేవో సమాధానం చెబుతూ ఉంటుంది. వసుధార సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుండగా సమాధానం కావాలి వసుధార అని గట్టిగా అడుగుతాడు రిషి. కాలమే సమాధానం చెబుతుంది సార్ కాస్త ఆగండి అంటుంది వసుధార. ఎవరో నాకు తెలియాలి అనడంతో తెలుసుకోండి కనీసం ప్రయత్నం అయినా చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార.
మహేంద్ర-జగతి వసుధార గురించి ఆలోచిస్తూ మనం చాలా పొరపడ్డాం జగతి...రాజీవ్ వసుధార మెడలో తాళి కట్టకపోతే మరి వసుధార మెడలో తాళి ఎవరు కట్టారు అసలు ఇదేం తలనొప్పి జగతి అంటాడు మహేంద్ర. ఇంతలో కాలేజీ స్టాప్..నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే జగతి అవమానంతో తలదించుకుంటుంది. అసలు వసుకి బుద్ధి లేదు వీళ్ళ మాటలతో రిషికి మనశ్శాంతి లేకుండా చేసేలా ఉన్నారు అంటుంది. వసుధార దగ్గరకు వెళ్లి నిజం చెప్పమని నిలదీద్దాం అంటాడు మహేంద్ర.... ఎపిసోడ్ ముగిసింది...
Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక
డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత
'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది
మాధురీ దీక్షిత్‌పై అసభ్య వ్యాఖ్యలు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగల్ నోటీసులు జారీ
Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం
Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్
APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!