By: ABP Desam | Updated at : 02 Feb 2023 09:12 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
గుప్పెడంతమనసు ఫిబ్రవరి 2 ఎపిసోడ్ (Guppedanta Manasu February 2nd Update)
వసుధార, రిషి ఇద్దరు పడవలు నీటిలో వదిలి మనసులో కోరికలు కోరుకుని కళ్ళు తెరిచి చూసేసరికి..రెండు పడవలు ఒక చోట చేరుతాయి. అది చూసిన తర్వాత ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుని ఆశ్చర్యపోతారు. వాళ్లని చూసిచక్రపాణి, మహేంద్ర,జగతి షాక్ అవుతారు. అప్పుడు రిషి ఈ పొగరు ఏంటి ఇక్కడికి వచ్చింది అయినా ఆ పేపర్లో ఏం రాసి ఉంటుంది అనుకుంటాడు. ఎవరు ఏం కోరుకున్నారో అని ఇద్దరూ మనసులో అనుకుంటారు.
వసుధార: ఏంటి సర్ ఇక్కడికి వచ్చారు
రిషి: ఏం రాకూడదా ఈ చెరువు ఏమైనా నీదా
వసు: ఏం లేదు సార్
రిషి: కొంతమంది కొన్ని మాటలు చెప్పారు కానీ అవన్నీ మాటలు గానీ మిగిలిపోయాయి
వసు: ఈ పడవలు ఎంత దూరం ప్రయాణం చేస్తాయో కదా
రిషి: మనుషులే ప్రయాణం చేయడం లేదు ఇంకా పడవలు ఎంత చెప్పు
ఆ తర్వాత సర్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడాలి అనడంతో కాలేజీలో మాట్లాడదాం అంటాడు రిషి. తర్వాత రిషి నడుచుకుంటూ వెళ్తూ తూలిపడబోతుండగా వసుధార పట్టుకుంటుంది.
అందరూ ఇక్కడేఉన్నారు నిజం చెప్పేద్దామని చక్రపాణి అంటే..వద్దునాన్నా వాళ్లకు వాళ్లే తెలుసుకోవాలి అంటుంది వసుధార. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు..
Also Read: మనసు భారమైన వేళ జ్ఞాపకాలు బరువయ్యాయి- రిషిధారని కలిపిన కాగితపు పడవలు
వీళ్లెక్కడకు వెళ్లారో అనకుంటూ ధరణిని పిలిచి క్లాస్ వేస్తుంది దేవయాని... ఇంతలో మహేంద్ర-జగతి ఎంటరవడం చూసి ఏంటో ఆదిదంపతులు పొద్దున్నే అని మొదలెట్టిన దేవయాని...రిషి రావడం చూసి ఆగిపోతుంది. పొద్దున్నే ఎక్కడకు వెళ్లారని నిలదీస్తుంది...ఇంతలో ఫణీంద్ర కల్పించుకుని ఇప్పుడే కదా వచ్చారు అప్పుడే అడగాలా అంటాడు. జగతిని-మహేంద్రని గుచ్చిగుచ్చి అడుగుతూఉంటుంది...
మహేంద్ర: ఏం లేదు వదినగారు కాస్త మనశ్సాంతి దొరుకుతుందేమో అని వెళ్లాం
దేవయాని: దొరికిందా మరి...ఆ వసుధరాని కాలేజీనుంచి పంపిస్తే కానీ ఎవ్వరికీ మనశ్సాంతి ఉండదు
రిషి: తను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్..తీయడం కుదరదు
ఇంతలో వసుధార నుంచి మెసేజ్ వస్తుంది..కాలేజీలో మీటింగ్ అరెంజ్ చేయమని ప్రాజెక్ట్ హెడ్ గారు చెప్పారు అంటాడు రిషి
దేవయాని: తను మనకు ఆర్డర్ వేసే వరకు వచ్చిందా ...
దేవయాని అదే పనిగా వసుని టార్గెట్ చేసుకుని తిడుతూ ఉంటుంది..రిషి మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోతాడు....
అందరం కాలేజీకి వెళ్లొస్తాం అనిచెప్పి దేవయాని నుంచి వెళ్లిపోతారు...
Also Read: ఈ రాశివారు జీవిత భాగస్వామితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు
మరోవైపు చక్రపాణి...ఏం చేయాలా అని ఆలోచించి రిషికి కాల్ చేస్తాడు.రిషి ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో చక్రపాణి మాట్లాడేది అర్థంకాదు..ఇంతలో వసుధార అక్కడకు వచ్చి కాల్ కట్ చేస్తుంది. నాన్న నిజం చెప్పొద్దు రిషి సార్ అంతటి రిషి సార్ తెలుసుకుంటే మంచిది అని అంటుంది. ఇంతలోనే మళ్లీ చక్రపాణి ఫోన్ కి రిషి ఫోన్ చేయడంతో అప్పుడు వసుధర ఫోన్ కట్ చేస్తుంది. రాంగ్ నెంబర్ అని చెప్పి మెసేజ్ చేస్తుంది. నాన్న ప్లీజ్ నేను చెప్పేది వినండి నన్ను అర్థం చేసుకోండి ఇంకెప్పుడు ఇలా చేయకండి రిషి అంతట రిషి సార్ నిజం తెలుసుకుంటే బాగుంటుందంటుంది.
రాజీవ్ కి కాల్ చేసిన దేవయాని...ఎక్కడ ఉన్నావు అనడంతో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నానని సమాధానం చెబుతాడు. నిన్ను నమ్ముకున్నందుకు ఒక్క పని కూడా చేయలేదు అన్ని ప్లాన్లు ఫెయిల్ అవుతున్నాయి అంటుంది దేవయాని. కాలేజీలో మీటింగ్ జరుగుతోంది...అక్కడకు వెళ్లి వసుధార పరువు తీయాలంటుంది. నేరుగా కాలేజీలో మీటింగ్ హాల్ కి వెళతాడు రాజీవ్. అందరి ముందూ నటిస్తూ..నా భార్య వసుధార ఎక్కడ ఉంది అని అడగడంతో జగతి మహేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటారు. మీ అందరికీ నేను ఎవరో తెలియదు కదా వసుధార నా భార్య అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
Casting Couch: రాత్రికి కాఫీకి వెళ్దాం రమ్మంది, అనుమానం వచ్చి.. - క్యాస్టింగ్ కౌచ్‌పై ‘రేసు గుర్రం’ రవి కిషన్
Desamuduru Re-release: అదిరిపోనున్న ఐకాన్ స్టార్ బర్త్ డే, రీరిలీజ్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!
BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్ తర్వాత మూడో కెప్టెన్!