By: RAMA | Updated at : 02 Feb 2023 06:12 AM (IST)
Edited By: RamaLakshmibai
(Image Credit: freepik)
Love Rasi Phalalu Today 02 February 2023 : ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
ఈ రోజు మీరు మీ భాగస్వామికి సమయం కేటాయించలేరు. మీ మనసైనవారితో గడిపిన క్షణాలు మీకు గుర్తుంటాయి. భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపార పరంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
వృషభ రాశి
భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగే అవకాశం ఉంది. వివాహేతర సంబంధంపై ఆసక్తి చూపించే అవకాశం ఉంది. మూడోవ్యక్తి కారణంగా మీ బంధంలో చీలిక రావొచ్చు జాగ్రత్త పడండి.
మిథున రాశి
ఈ రాశివారు స్నేహితుల్లో ఒకరితో ప్రేమలో పడతారు. ప్రేమ జీవితానికి సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. ఈ రోజు మొదలైన బంధం దీర్ఘకాలం కొనసాగుతుంది.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు
కర్కాటక రాశి
ఈ రాశి ప్రేమికులకు మంచిరోజు. వివాహితులకు జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే చెప్పేయడమే మంచిది. మీరు మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
సింహ రాశి
ఈ రాశివారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. భాగస్వామి గురించి మనసులో ప్రతికూల విషయాలు ఉంటాయి. ఈ రోజు ప్రేమ జీవితానికి సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజు మొదలైన బంధాలు ఎక్కువ కాలం కొనసాగుతాయి. వైవాహిక జీవితంలో సామరస్యం నెలకొంటుంది.
కన్యా రాశి
మీ భాగస్వామి నుంచి ఆనందాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ రోజు భార్యాభర్తల మధ్య సమన్వయం బాగుంటుంది. ఓ శుభవార్త వింటారు. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
తులా రాశి
ఈ రోజు ప్రేమ సంబంధాలలో మాధుర్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామిని ఒప్పించడంలో మీరు విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈ రోజు ఆలోచనాత్మకంగా మాట్లాడండి.
వృశ్చిక రాశి
ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. ఈ రోజు మీ ప్రేమికుడితో సంబంధాలు మధురంగా ఉంటాయి. ఈ రోజు మొదలైన బంధం ఎక్కువ కాలం నిలవదు. భాగస్వామికి సంబంధించిన కొన్ని విషయాలను విస్మరించాల్సి వస్తుంది. భార్యతో కలిసి శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది.
Also Read: ధనస్సు నుంచి మకరంలోకి బుధుడు, ఈ మూడు రాశులకు మినహా అందరికీ బావుంది
ధనుస్సు రాశి
భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఒంటరి వ్యక్తులు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. భార్యాభర్తల మధ్య పరస్పర సహకారం ఉంటుంది. మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
మకర రాశి
ఈ రోజు మొదలైన బంధం దీర్ఘకాలం కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. భాగస్వామిని సంతోషపెట్టడానికి బహుమతులు ఇస్తారు. మీ ప్రేమ జీవితంలో మంచి సమన్వయం ఉంటుంది.
కుంభ రాశి
మీరు ప్రారంభించిన పనులకు జీవిత భాగస్వామి నుంచి సహకారం ఉంటుంది. ఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి, కోపం కంట్రోల్ చేసుకోండి. ప్రేమ సంబంధాల్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకండి.
మీన రాశి
మీరు భాగస్వామి నుంచి సంతోషం పొందుతారు. భార్యాభర్తల మధ్య కొంత తగాదాలు ఏర్పడవచ్చు. ఈ రోజు మీరు మీ భావాలను మీ భాగస్వామితో పంచుకుంటారు. ఇద్దరూ ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. జీవిత భాగస్వామి మాటలను విస్మరించకండి.
మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం
మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం
వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు
Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు
Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!
కన్నా విందు భేటీలో రాయపాటి ఫ్యామిలీ- మారుతున్న గుంటూరు రాజకీయం!
ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?
నెల్లూరు నుంచి ఇంకెవరు వస్తారు? లోకేష్‌తో గిరిధర్ రెడ్డి భేటీ