News
News
X

Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు

weekly Rasi Phalalu 30 Jan to 5 Feb 2023: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Weekly Horoscope 30 January to 5 February 2023: :  జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వరకూ  వారఫలాలు

మేష రాశి
ఈ వారం మేషరాశివారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వారం కెరీర్ పరంగా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు, కానీ సామాజికంగా మీ ప్రజాదరణ పెరుగుతుంది. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే మీ ఫాలోవర్స్ సంఖ్య పెంచుకోవచ్చు. ఈ వారం మీ వైవాహిక జీవితం మిశ్రమంగా ఉంటుంది. వారం ప్రారంభంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది. అవివాహితులు కొంతకాలం ఓపికపట్టాలి. విద్యార్థులు సమయాన్ని వృధా చేయడం వల్ల వారి లక్ష్యానికి దూరమవుతారు.

వృషభ రాశి
ఈ వారం ప్రారంభంలో కోపాన్ని అదుపులో ఉంచుకోగలుగుతారు. మీరు ఎక్కడి నుంచైనా హఠాత్తుగా డబ్బు పొందవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ప్రేమ భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి సహకారం ఉంటుంది. వ్యాపారులు మంచి ఒప్పందాలు పొందుతారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మాటని కఠినంగా మారనివ్వవద్దు.

మిథున రాశి
వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలుంటాయి. అప్పులు తీసుకోవాల్సి రావొచ్చు. ఒంటరిగా ఉండేవారి జీవితంలోకి కొత్త అతిథి వస్తారు.  ఉద్యోగులకు కార్యాలయంలో మీ శత్రువులు మీ పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారు..మీ సహోద్యోగులు మిమ్మల్ని రెచ్చగొడతారు..మీరు మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ వారం వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉంటుంది. అత్తమామలతో సంబంధాలు బావుంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ఆకస్మిక లాభం పొందుతారు. ఈ వారం విద్యార్థులకు మంచిది.

Also Read: ధనస్సు నుంచి మకరంలోకి బుధుడు, ఈ మూడు రాశులకు మినహా అందరికీ బావుంది

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈ వారం ఆరోగ్యం పట్ల మరింత సీరియస్‌గా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఫోన్లతో గడిపే సమయం తగ్గించుకుంటే కుటుంబంలో సమస్యలు కాస్త సర్దుమణుగుతాయి. వారాంతంలో మీ ఇంటికి అతిథులు రావొచ్చు. కార్యాలయంలో ఉన్నత ఉద్యోగుల నుంచి సహకారం అందుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనడానికి ప్లాన్ చేసుకుంటారు. విద్యార్థులు సోమరితనాన్ని విడాల్సి ఉంటుంది. ప్రేమ భాగస్వామితో కొన్ని విభేదాలు రావొచ్చు. మీ  బంధంలో మూడో వ్యక్తి జోక్యం వల్ల అపార్థాలొస్తాయి

సింహ రాశి
సింహ రాశివారు ఈ వారం కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది..మీరు ముందుగా గుర్తించి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదు. కార్యాలయంలో సహోద్యోగులతో సరిగా ప్రవర్తించండి..లేదంటే..వివరణ ఇచ్చుకునే పరిస్థితి రావొచ్చు. ఆర్థిక పరంగా  ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వనరులలో పెరుగుదల ఉండవచ్చు. మీరు కొన్ని కొత్త పనిని ప్రారంభించడానికి ప్రణాళికను అమలు చేయవచ్చు. ఇంటి బాధ్యతలకు సంబంధించి మీ జీవిత భాగస్వామి మీ విషయంలో అసంతృప్తిగా ఉంటారు. విద్యార్థులు సమయపాలనపై శ్రద్ధ వహించాలి. వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి.

కన్యా రాశి
ఈ వారం మీరు బిజీ బిజీగా ఉంటారు. ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఏదైనా వివాహ వేడుకలో పాల్గొంటారు.కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది. కొన్ని కొత్త ప్రాజెక్టులు వస్తాయి..మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. పిల్లల్ని చూసుకుని గర్వపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. మీ పరిమితులు, గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోండి. 

తులా రాశి
ఈ వారం మీ కెరీర్ పరంగా కొన్ని హెచ్చు తగ్గులుంటాయి. ఉద్యోగం మారే ఆలోచన చేస్తారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. అత్తమామల వైపు నుంచి మీకు నచ్చని కొన్ని విషయాలు జరుగుతాయి కానీ కాస్త ఓపిక పట్టండి. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులు తమ లక్ష్యంపై దృష్టి పెట్టాలి...లేకపోతే తర్వాత మేల్కొన్నా ఎలాంటి లాభం ఉండదు

వృశ్చిక రాశి
జనవరి 30 నుంచి ప్రారంభమయ్యే ఈ వారం వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. వైవాహిక జీవితం బావుంటంది. కొత్తగా పెళ్లయిన వారు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. వ్యాపారంలో పెద్ద పెట్టుబడి పెట్టవచ్చు. విద్యార్థులు సకాలంలో పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

ధనుస్సు రాశి
ఈ వారం వ్యాపారులకు అనుకూలమైన సమయం. కొత్త ప్రదేశాల నుంచి ఆర్డర్లు పొందడంలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. బ్యాంకు రుణాల కారణంగా ఎదురైన  సమస్యలు తొలగుతాయి. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళతారు. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది.

మకర రాశి
కొన్ని విషయాలను మినహాయిస్తే ఈ వారం వ్యాపారులకు, ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. మీ మాటతీరులో మృదుత్వం ఉండేలా చూసుకోండి. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆకస్మికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. అందుకే డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. అవివాహితులకు  మంచి సంబంధాలు రావచ్చు.

కుంభ రాశి
ఈ వారం కుంభరాశివారు ఆశించిన ఫలితాలను సాధించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అప్పులు తీసుకోవద్దు. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలి. తప్పుడు వ్యక్తులతో స్నేహం చేయవద్దు. ఈ వారం వైవాహిక జీవితానికి మిశ్రమంగా ఉంటుంది.

మీన రాశి
జీవితంలో ముందుకు సాగడానికి కష్టపడి పనిచేయడం, మిమ్మల్ని మీరు అప్‌డేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. విద్యార్థులు కొత్త కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపుతారు. పరిపాలనా స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ పని ద్వారా తమ స్థానాన్ని బలోపేతం చేసుకోగలుగుతారు. వివాహం కానివారి అన్వేషణ పూర్తవుతుంది.  ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. 

Published at : 29 Jan 2023 07:58 AM (IST) Tags: scorpio weekly horoscope libra weekly horoscope gemini weekly horoscope weekly horoscope prediction in telugu weekly horoscope in telugu weekly Rasi Phalalu 30 January to 5 February

సంబంధిత కథనాలు

Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు

Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు

మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది

మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది

మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం

మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం

టాప్ స్టోరీస్

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!