అన్వేషించండి

Pawan Kalyan Varahi Vehicle: వారాహి అంటే ఏవరు , ఎందుకంత పవర్ ఫుల్ - పవన్ తన వాహనానికి ఆ పేరెందుకు పెట్టారు!

పవన్ కళ్యాణ్ తన వాహనానికి 'వారాహి' అనే పేరెందుకు పెట్టారు. అసలు వారాహి అంటే ఎవరు.. ఆ పేరు ఎందుకంత పవర్ ఫుల్..

Pawan Varahi Vehicle:  జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. రాజకీయాల్లో క్రీయాశీకలంగా వ్యవహరిస్తున్నారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేనాని...అందుకు తగ్గట్టుగానే యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుంటున్నారు. ఇకపై నిత్యం ప్రజా క్షేత్రంలో ఉండేలా జనసేనాని ప్లాన్‌ చేసుకుంటున్నారు..దానికి తగ్గట్టే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం కోసం ప్రత్యేక వాహానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఆ వాహనం పేరు 'వారాహి'. అసలు వారాహి అనే పేరుకు అర్థం ఏంటి? ఎందుకు పవన్‌ కళ్యాణ్‌ తన వాహనానికి ఈ పేరు పెట్టారు?  ఈ పేరు ఎందుకంత పవర్ ఫుల్...

వారాహి అంటే ఎవరు
పురాణాల గురించి తెలిసిన వారికి శ్రీ మహావిష్ణువు వరాహా అవతారం గురించి తెలిసే ఉంటుంది. విష్ణువు దశవాతారాల్లో వరహ అవతారం ఒకటి. హిరణాక్షుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి..భూమిని సముద్రంలో దాచేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి వేదాలను కాపాడి భూమిని ఉద్ధరిస్తాడు. ఈ వరాహస్వామి అర్థాంగి 'వారాహి'

Also Read: జనవరి 26 వసంత పంచమి, సరస్వతీ కటాక్షం కోసం ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి

శక్తి రూపాల్లో ఒకరు వారాహి
అమ్మవారి శక్తిరూపాల్లో వారాహి దేవి ఒకరు. ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా, దశమహావిద్యల్లో ఒకరిగా పూజిస్తారు. ఈమె వరాహ(పంది) ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా పూజలందిస్తారు. వరాహస్వామి అర్థాంగి అయిన వారాహిని నేపాల్ బారాహి అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ అమ్మవారిని తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. దేవీ మాహాత్మ్యంలో ఉన్న శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రహ్మణి..ఇలా వరాహ స్వామి నుంచి వారాహి ఉద్భవించింది. రక్తబీజుడిని చంపడం కోసం దుర్గా దేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది. ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతులలో ఖడ్గం, డాలు, అంకుశం ధరించి ఉంటుంది వారాహి.

  • దేవీ మాహాత్మ్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షశుడిని, అతడి సేనను సంహరిస్తుంది.
  • వామన పురాణాం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుంచి వారాహి ఉద్భవించింది.
  • మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి, వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. 
  • మత్స్యపురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు సహాయం కోసం శివుడు సృష్టించిన శక్తిగా చెబుతారు.
  • లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్ర నామంలో కూడా ఉంటుంది.
  • వారాహిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, అపార జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ చెబుతారు.
  • వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో వారాహిని పూజిస్తారు. ప్రతి మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో ఉంటూ మణిపూర, స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది . 

Also Read: కోణార్క్, అరసవెల్లి మాత్రమేకాదు - గుజరాత్ లో ఉన్న ప్రముఖ సూర్య దేవాలయం గురించి తెలుసా!

వారణాసికి గ్రామ దేవత వారాహి 
వారాహి వారణాసికి గ్రామదేవత. కాశీలో ఉన్న వారాహి ఆలయానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లే వీలుండదు.  భూ గర్భ గృహంలో ఉండే ఈ ఆలయం నిత్యం తెల్లవారుజాము 4.30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెలుతుందంట. ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేల పై రెండు రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి.. ఒక రంధ్రంలోనుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం..మరో రంధ్రం నుంచి  అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి. వారాహి అమ్మవారు ఉగ్రరూపిని కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు పండితులు.  దుష్ట శక్తులను అణిచేసే వారాహి అమ్మవారి ఆలయం  వారణాసిలోని దశాశ్వమేథ ఘాట్ కు ఎడమ వైపు ఉంటుంది .

దుష్ట సంహారం చేసే అమ్మవారి పేరు పవన్ కళ్యాణ్ తన వాహనానికి పెట్టడంతో ఈ పేరు, ఆ వాహనం గురించి సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది... 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Cyber Fraud :హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
Amaravati News: అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
Cyclone Ditwah Impact: దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
Advertisement

వీడియోలు

Ro - Ko at India vs South Africa ODI | రాంచీలో రో - కో జోడి
Rajasthan Royals to be Sold IPL 2026 | అమ్మకాన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ?
Ab De Villiers comment on Coach Gambhir | గంభీర్ పై డివిలియర్స్ కామెంట్స్
Lionel Messi India Tour 2025 | భారత్‌కు లియోనెల్ మెస్సీ
Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Cyber Fraud :హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
Amaravati News: అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
Cyclone Ditwah Impact: దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
Hema Chandra : శ్రావణ భార్గవితో డివోర్స్ రూమర్స్! - సింగర్ హేమచంద్ర స్ట్రాంగ్ రియాక్షన్
శ్రావణ భార్గవితో డివోర్స్ రూమర్స్! - సింగర్ హేమచంద్ర స్ట్రాంగ్ రియాక్షన్
Balakrishna: 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ - గాడ్ ఆఫ్ మాసెస్ ఫోటోలు
'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ - గాడ్ ఆఫ్ మాసెస్ ఫోటోలు
Rajinikanth : వంద జన్మలకూ మళ్లీ మళ్లీ రజనీలానే పుట్టాలని ఉంది - తలైవా ఎమోషనల్ స్పీచ్‌కు ఫ్యాన్స్ ఫిదా
వంద జన్మలకూ మళ్లీ మళ్లీ రజనీలానే పుట్టాలని ఉంది - తలైవా ఎమోషనల్ స్పీచ్‌కు ఫ్యాన్స్ ఫిదా
CTET February 2026 : ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
Embed widget