Guppedantha Manasu: కొడుకు రిషి కోసం ప్రియమైన స్టూడెంట్ వసుని బాధపెడుతున్న జగతి.. గుప్పెడంత మనసు డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్
గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తిగా సాగుతోంది. వసుధార డల్ గా ఉందంటే జగతి మేడం ప్రాసెస్ ప్రారంభించినట్టే అనుకుంటాడు రిషి. డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్ లో ఏం జరగబోతోందంటే..
డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్ లో ఏం జరగబోతోందంటే..
గుప్పెడంత మనసు సీరియల్ శనివారం ఎపిసోడ్ లో రిషి మాటల్ని అమలు చేసే పనిలో పడింది జగతి. తనకెంతో ప్రియమైన విద్యార్థి అయిన వసుధారని ఇంట్లోంచి వెళ్లిపొమ్మని ఎలా చెప్పాలా అని బాధపడుతుంది. మేడం ఎందుకో బాధపడుతున్నారని వసు అర్థం చేసుకుని అడిగినప్పటికీ జగతి ఎలాంటి రిప్లై ఇవ్వదు. పైగా కాఫీ తెచ్చి ఇస్తే షింక్ లో పోసేస్తుంది, కలసి కాలేజీకి వస్తానంటే..కార్లు-విలాసాలు అలవాటయ్యాడా అంటుంది... లంచ్ బాక్స్ కూడా నాది నేను ప్రిపేర్ చేసుకున్నా నీకు నచ్చింది చేసుకో అనేసి బయటకు వెళ్లి బాధపడుతుంది. ఇంతకన్నా నేను బాధపెట్టలేను వసుధారా..నీకు నువ్వుగా తెలుసుకుని ఇంటినుంచి వెళ్లిపో అని మనసులో అనుకుంటుంది జగతి. ఇక సోమవారం ఎపిసోడ్ లో విషయం వసుధారకి కన్వే అయినట్టే అనిపిస్తోంది..
Also Read: మనసుకి కళ్లెం వేయొద్దన్న మహేంద్ర.. వసుని ఇంట్లోంచి పంపించే ప్రాసెస్ మొదలెట్టిన జగతి.. గుప్పెడంత మనసు డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్ లో జగతి మేడం తన మాటల్ని ఫాలో అవుతోందని రిషికి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే వసుధారని ఇంట్లోనే వదిలేసి జగతి కాలేజీకి వెళ్లిపోతుంది. అదే సమయంలో అక్కడకు వెళ్లిన రిషి-గౌతమ్ ఆమెతో మాట్లాడతారు. వసు డల్ గా ఉందంటే జగతి మేడం తాను చెప్పిన పని మదలెట్టారా అనుకుంటాడు రిషి. ఇక వసుధారని హాస్టల్ కి పంపించే పని ఎంతవరకూ వచ్చిందో జగతిని అడుగుదామా అనే ఆలోచనలో పడతాడు. మరోవైపు వసుని కూడా ఎందుకు డల్ గా ఉన్నావ్ అని అడిగితే..ఏంలేదని సమాధానం చెబుతుంది. మా కార్లో వెళదాం రండి అని గౌతమ్ అడిగితే.. పర్లేదు అన్న వసుతో..ఏంకాదు రా అని పిలుస్తాడు రిషి. ముగ్గురూ కార్లో వెళుతుండగా గౌతమ్... వసు మీది ఏ ఊరు, మీ నాన్న గారు ఏం చేస్తారని అడుగుతాడు. స్పందించిన రిషి నోర్మూసుకుంటావా అంటాడు. అయితే అస్సలు తగ్గని గౌతమ్.. వసుని అడిగితే నువ్వెందుకు ఫీలవుతావ్ అనడంతో..కారు ఆపేసి గౌతమ్ ని దిగమంటాడు. రిషి నుంచి అలాంటి రియాక్షన్ వస్తుందని ఊహించని గౌతమ్ అవాక్కవుతాడు.
Also Read: రిషి మనసులో ఏముంది.. వసుని ఎందుకు హాస్టల్ కి పంపించేయమన్నాడు, గుప్పెడంత మనసు డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్...
మొత్తానికి చూస్తే కొడుకు రిషి కోసం..ప్రియమైన విద్యార్థి వసుధారని జగతి బాధపెట్టేందుకు సిద్ధమైతే... అటు వసుపై ప్రేమతో గౌతమ్ పై ఫైర్ అవుతాడు రిషి. మొత్తం వ్యవహారం వసు చుట్టూ తిరుగుతోంది..అయితే ఈ విషయం మాత్రం ఆమెకి తెలియకపోవడం అసలు ట్విస్ట్. మరి ఆరంభం నుంచి తనకు అండగా ఉన్న జగతి మేడం ప్రవర్తనని వసు ఎలా అర్థం చేసుకుంటుందో లేదో సోమవారం ఎపిసోడ్ లో తెలుస్తుంది...
Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
Also Read: సారీ చెప్పమంటున్న రిషి.. చెప్పేదే లే అంటున్న వసుధార... మిషన్ ఎడ్యుకేషన్ ఫొటోస్ లో రిషి-నువ్వే ఉన్నారు జగతి మేడం కనిపించలేదన్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 18 శనివారం ఎపిసోడ్
Also Read: వసు దగ్గర తగ్గలేక, నెగ్గలేక రిషి పాట్లు.. వసుధారకి క్లోజ్ అవుతున్న గౌతమ్.. గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్
Also Read: వసుధారని ఇంట్లోంచి పంపించేయాలని జగతికి షాకిచ్చిన రిషి.. గుప్పెడంత మనసు డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి