By: ABP Desam | Updated at : 03 Mar 2023 08:07 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
వసు మెడలో తాళికి కారణం తనే అంటాడు కానీ భార్యవి కాదని అనేసరికి షాక్ అవుతుంది. రిషి మాటలకు వసు చాలా బాధపడుతుంది. తను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని రిషి అంటాడు. అందరి ముందు మీరు నా భర్తగా చెప్పినప్పుడు సంతోషపడ్డాను కానీ ఇంత లోతుగా ఉంటుందని అర్థం చేసుకోలేకపోయానని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చేసింది అంతా నువ్వే చేసి అర్థం చేసుకోవా పొగరు అని అంటాడు. జగతి, మహేంద్ర ఇద్దరూ వసుధార, రిషి మధ్య దూరం చెరిగిపోయిందని సంబరపడతారు. ఇద్దరూ ఒకటై పోయారు ఇంక బాధలేమీ లేవని మహేంద్ర ఆనందంగా ఉంటాడు. వసు ఏడుస్తూ వెళ్ళడం చూసి తనని ఆపి జగతి ఏమైందని అడుగుతుంది. ఇప్పుడే పార్టీ చేసుకుందామని సంతోషపడుతుంటే ఈ ఏడుపు ఎందుకు అని అడుగుతారు. తనని ఎవరూ ఏమి అనలేదని కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వమని చెప్పి వెళ్ళిపోతుంది.
వసుధారతో నేను అన్న మాటలు తప్పేముంది. తన మీద ప్రేమ ఉంది తనకి నేను భర్తనే కానీ తను నా భార్య ఎలా అవుతుందని అనుకుంటూ ఉండగా మహేంద్ర వచ్చి కంగ్రాట్స్ చెప్తాడు. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అని అంటాడు. అందరి ముందు దోషిలా ఉండకూడదని ఒప్పుకున్నానని చెప్తాడు. వసుధార ఏడుస్తూ వెళ్ళింది ఏమైందని అడుగుతాడు.
Also Read: యష్, వేద రొమాంటిక్ మూమెంట్- వసంత్, చిత్ర పెళ్లికి జరగకుండా అడ్డుపడిన వ్యక్తి ఎవరు?
రిషి: వసుధారకి నేను భర్తనని అందరి ముందు గౌరవం కాపాడటం కోసం చెప్పాను. కానీ తను నా భార్య కాదన్న వాస్తవం కూడా చెప్పాను
మహేంద్ర: నాకేమీ అర్థం కాలేదు తనకి నువ్వు భర్తవి అయినప్పుడు నీకు భార్య కాకుండా ఎలా ఉంటుంది
రిషి: తనకి తాను మెడలో వేసుకున్న తాళికి నేను ఎలా బాధ్యుడిని అవుతాను
మహేంద్ర: వసుకి కూడా ఇలాగే చెప్పావా
రిషి: ఇంతకన్నా క్లారిటీగా చెప్పాను
మహేంద్ర: అందరి ముందు చెప్పి తన గౌరవం కాపాడి ఇలా చేయడం అవసరమా
రిషి: తను అప్పటి పరిస్థితిని అర్థం చేసుకుని అలా చేసింది తనని నేను కాకపోతే ఎవరు కాపాడతారు. ఆ విషయంలో నేను గర్వపడుతున్నా కానీ వసు చేసింది తప్పు తన మెడలో తనే తాళి వేసుకుని పెద్ద తప్పు చేసింది
మహేంద్ర: బంధాల్లో కొన్ని తప్పులు క్షమించాలి, అనవసరంగా కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నావ్ ఏమో అని ఇలా అయితే మీ ప్రేమకథకి శుభం కార్డు ఎలా పడుతుందని మనసులోనే బాధపడతాడు.
Also Read: రాజ్ పక్కన పెళ్ళికూతురిగా కావ్య- రుద్రాణి ప్లాన్ మామూలుగా లేదు
వసు ఆలోచిస్తూ ఉంటే జగతి ఏమైందని అంటుంది. అప్పుడే రిషి నేను మీ కారు వెనుకే వస్తున్నాను అని మెసేజ్ చేస్తాడు. జగతి కారు అపి రిషి వెనుకే ఉన్నాడని చెప్తుంది. వచ్చి జగతి కారులో ఉన్న వసుని మాట్లాడాలి రమ్మని పిలుస్తాడు. చెప్పకుండా కాలేజ్ నుంచి రావడం ఏంటి పర్మిషన్ తీసుకోవాలి కదా అనేసరికి వసు అక్కడికక్కడే మెసేజ్ పెట్టి మా ఎండీ గారిని మేనేజింగ్ డైరెక్టర్ నని కోపంగా చెప్తుంది. ఇద్దరూ కాసేపు వాదులాడుకుంటారు. ఆరోజు మెడలో తాళి వేసుకోవడం కరెక్ట్ కాదు కానీ ఆ టైమ్ లో ఇదే కరెక్ట్ అనిపించిందని చెప్తుంది. అందరిలో చెప్పినదానికి థాంక్స్ చెప్పి బై చెప్పేసరికి రిషి కోపంగా వెళ్ళిపోతాడు. వసు రిషి మళ్ళీ మొదటికి వచ్చారని జగతి మనసులో అనుకుంటుంది. రిషి ఇంటికి రావడం చూసి దేవయాని కావాలనే పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళి భర్త మీద అరుస్తూ ఉంటుంది. అందరి ముందు వసుధార తన భార్య అని ఎలా అంటాడు మన పెద్దరికం ఏమైనట్టని అరుస్తూ ఉండగా రిషి వస్తాడు.
Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
Dasara' movie: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!
Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా
Shaakuntalam in 3D: 3Dలో ‘శాకుంతలం’ - ఐమ్యాక్స్‌లో ట్రైలర్ చూసి, ప్రేక్షకులు ఫిదా
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!
Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి