అన్వేషించండి

Gruhalakshmi November 12th: 'బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుని ఎంజాయ్ చేస్తున్నావ్' అన్న అభి- చెంపలు పగలగొట్టిన తులసి, క్షమించలేనన్న పరంధామయ్య

ఇంట్లో నుంచి బయటకి వచ్చేయడంతో తులసికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయ్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

తులసి ఇంట్లో పరంధామయ్య పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుతారు. అదంతా చాటుగా అభి చూస్తూ కోపంతో రగిలిపోతాడు. కాసేపటికి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అభి కోపంగా ఇంట్లోకి వస్తాడు. తులసి మీద సీరియస్ అవుతాడు. నేను వచ్చి చాలాసేపు అయింది, బయట నిలబడి లోపల జరుగుతున్న తమాషా చూస్తూనే ఉన్నా అని అంటాడు.

తులసి: నీకు ఏమైనా అనుమానం ఉంటే లోపలికే వచ్చి చూడవచ్చు కదా బయట ఎందుకు నిలబడటం

అభి: తాతయ్య ముందు సీన్ క్రియేట్ చేయడం ఎందుకని రాలేదు

అంకిత: ఎప్పటి నుంచి పెద్ద వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకున్నావ్

అభి: మా మామ్ సిగ్గు, మర్యాద వదిలేసిన రోజు నుంచి. మా మామ్ చేసిన సిగ్గులేని పని బురదని కడిగేసి తాడో పేడో తేల్చుకోవడానికి వచ్చాను. నువ్వు చేసిన చేస్తున్న నీతిమాలిన పనికి మేము సఫర్ అవడానికి సిద్ధంగా లేం

తులసి: వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపో

Also read: మాధవ్ ని చంపేసిన సత్య, నేరం తన మీద వేసుకున్న రుక్మిణి- ముగిసిన 'దేవత' కథ

అభి: అసలు ఏంటి నీ పెద్దరికం, నీ వివాహ జీవితం నిలబెట్టుకోవడం చేతకాలేదు కానీ నీ పిల్లలకి నీతులు చెప్తూ వాళ్ళ జీవితాలతో కూడా ఆటలాడుతున్నావా. అసలు నువ్వు తల్లివేనా, నీ జీవితంలాగే మా జీవితం కూడా అయ్యేలాగా నాశనం చేస్తున్నావ్. నా భార్యకి నన్ను దూరం చేశావ్

అంకిత: నీ చేతకానితనానికి తనని ఎందుకు బ్లెమ్ చేస్తున్నావ్

అభి: తను బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుని ఎంజాయ్ చేస్తుంది. నీదశలు ఫ్రెండ్షిప్ చేసే వయస్సు కాదు అలాంటిది బాయ్ ఫ్రెండ్ ని సెట్ చేసుకున్నావ్. సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయ్. అందరి మామ్ లు రూల్స్ పాటిస్తుంటే మా మామ్ రూల్స్ పట్టించుకోదు, నీకు నిలువెల్లా స్వార్థం, ఇంత సిగ్గు లేకుండా ఎలా ఉండగలుగుతున్నావ్.

సామ్రాట్: అభి.. ఇక చాలు, ఇంతవరకి ఓపికగా నీ మాటలు విన్నా, ఇక మీ అమ్మని ఏ మాత్రం అవమానించినా ఊరుకొను, అలాగే నా ఫ్రెండ్ ని అవమానించినా ఊరుకోను

అభి: ఈ ఏజ్ లో కూడా మా అమ్మ చెప్తే కంట్రోల్ అవుతారని అనుకోలేదు

సామ్రాట్: ఇక్కడ నుంచి వెళ్లిపో

అభి: మీరు ఎవరు నన్ను ఇక్కడ నుంచి వెళ్లమనడానికి, మన కుటుంబం ముక్కలు అవడానికి కారణం మీరే, మీ కారణంగా మా తాతయ్య పుట్టినరోజు మా ఇంట్లో జరుపుకోలేకపోయాం. మా మామ్ పడరాని మాటలు పడటానికి కారణం మీరే, ఇప్పుడు ఇల్లు వదిలి రావడానికి కారణం కూడా మీరే,  మీతో కలిసి ఉండటానికి ఇల్లు వదిలేసి వచ్చి కొత్త ఇల్లు తీసుకుంది. ఇలా చీప్ గా మారుతుందని అనుకోలేదని అనేసరికి తులసి చెంప పగలగొడుతుంది.

Also read: వేదనే తన జీవితమన్న యశోధర్- కోడలిని ఆకాశానికెత్తేసిన మాలిని

తులసి: ఎంత ధైర్యంగా అన్నావ్, లోకం అంతా దిగజారవచ్చు కానీ ఏ తల్లి దిగజారదు.  మీ అమ్మ ఎలాంటిదో నువ్వు తెలుసుకోలేవు, నేను ఏంటో నాకు తెలుసు, ఎవరికి జవాబు చెప్పుకోవాల్సిన పని లేదు. నీలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుగా ఉంది, నీలాంటి విషపురుగుని కన్నందుకు సిగ్గుపడుతున్నా, ఇప్పటి నుంచి నువ్వు నాకు ఏమి కావు, నువ్వు కాకుండా ఎవరైనా ఈ మాటలు మాట్లాడి ఉంటే చంపేసి ఉండేదాన్ని.. వెళ్ళు ఇక్కడ నుంచి

అభి: కేవలం నీ వల్లే ఒక తల్లి కొడుక్కు శత్రువుగా మారాడు

పరంధామయ్య వాళ్ళు ఇంటికి వెళతారు. మీరు అనుకున్న చోటుకి వెళ్లారు కదా ఇకనైనా నవ్వండి నాన్న అని నందు ప్రేమగా అడుగుతాడు. మీ మనసు బాధపడేలా చేసి ఉంటే క్షమించమని నందు తండ్రిని కోరతాడు. జరిగిన దాన్ని మర్చిపోలేను, క్షమించలేను కూడా అని పరంధామయ్య చెప్తాడు. అన్ని తన కారణంగానే జరుగుతున్నాయని, అభి చెప్పింది నిజమేనని సామ్రాట్ ఫీల్ అవుతాడు.

టాప్ హెడ్ లైన్స్

Ramayana Mistakes: మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి డీఎన్‌ఏ టెస్ట్ చేయించాడని తెలుసుకున్న పద్మాక్షి! రిపోర్ట్స్‌ కోసం పరుగులు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి డీఎన్‌ఏ టెస్ట్ చేయించాడని తెలుసుకున్న పద్మాక్షి! రిపోర్ట్స్‌ కోసం పరుగులు!
418 Movie OTT : రూమ్ నెంబర్ 418 మిస్టరీ ఏంటి? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
రూమ్ నెంబర్ 418 మిస్టరీ ఏంటి? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Ramayana: రావణుడి 10 తలలు నిజమా? పురాణాలు చెప్పే అసలు రహస్యం!
రామాయణ: రావణుడి 10 తలలు నిజమా? పురాణాలు చెప్పే అసలు రహస్యం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raptadu Student Gopika Health Update: మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
Dolis For Vote: రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
Tirumala Laddu Case: తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
Regena Cassandra : ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
PVN Madhav Letter to Amit Shah : వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
Embed widget