Ennenno Janmalabandham November 11th: వేదనే తన జీవితమన్న యశోధర్- కోడలిని ఆకాశానికెత్తేసిన మాలిని
యష్ గురించి అభిమన్యు చెప్పినా కూడా వేద నమ్మదు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
అభిమన్యు వేదని కలుస్తాడు. నీ జీవితంలోకి చొరబడిన మాళవికని గెట్ అవుట్ అను. నీ మొగుడు అక్కడ తన పాత పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. అయినా నువ్వు ఎంత అమాయకురాలివి. ఆ మాళవిక నీ వెనుక గోతులు తొవ్వుతుంటే గమనించలేకపోతున్నావ్. నీ భర్త నీకు దూరం అవుతున్నా కాపాడుకోలేకపోతున్నావ్ అని అంటాడు. నా భర్త మీద నాకే చాడీలు చెప్తావా అని వేద తిడుతుంది. అభి మాళవిక పెట్టిన డీపీ చూపిస్తాడు. అందులో తప్పేముందు వాళ్ళు పిక్నిక్ కి వెళ్లారు నేనే పంపించాను అని చెప్తుంది. ‘నీ భర్త గురించి ఏం తెలుసు నీకు నిన్ను మోసం చేస్తున్నాడు. మీ అమ్మకి యాక్సిడెంట్ చేసింది వేరే ఎవరో కాదు నీ భర్త మొదటి భార్య మాళవిక. అదంతా తెలిసి కూడా ఆ రహస్యం నీ దగ్గర దాస్తుంది నీ మొగుడు. సాక్ష్యాధారాలు తారుమారు చేసి మాళవికని కాపాడుకోవాలని చూస్తున్నాడు’ అని నిజం చెప్పేస్తాడు.
Also Read: నందు వాళ్ళని బకరాల్ని చేసిన పరంధామయ్య- సామ్రాట్ ని ఫుట్ బాల్ ఆడుకున్న పెద్దాయన
ఆదిత్య సంతోషంగా స్విమ్మింగ్ చేస్తుంటే యశ వచ్చి పిలుస్తాడు. ఆది పరిగెడుతూ కాలు స్లిప్ అయి పడిపోతుంటే యష్ చాలా కంగారుపడతాడు. ఆ మాళవిక నీ భర్తని దూరం చెయ్యడానికి, నీ భర్తని నీకు దూరం చెయ్యడానికి కుట్రలు పన్నుతుందని అభి చెప్తుంటే వేద మాత్రం నమ్మదు. యష్ కి మాళవిక భార్య పిచ్చిగా ప్రేమించాడు కాదు అనను కానీ ఇప్పుడు కాదు అని అభిమన్యు మాటలు కొట్టిపడేస్తుంది. ‘యశోధర్ గురించి నాకు తెలుసు, తెలిసిగాని తెలియకగాని నాకు అన్యాయం చెయ్యరు, నా భర్త నిజాయతీ గలవాడు. ఇప్పటికిప్పుడు నా భర్త నిజాయితీ నీకు నిరూపిస్తాను’ అని వేద అభిమన్యుతో ఛాలెంజ్ చేస్తుంది. సరే అని ఇద్దరూ యశోధర్ దగ్గరకి బయల్దేరతారు.
అటు సులోచన ఖుషిని పిక్నిక్ కి పంపించడంపై మాలిని మీద అరుస్తుంది. ‘తనని పిక్నిక్ కి ఒప్పించి మరి పంపించింది అది కూడా ఆదిత్య కోసం. ప్రపంచంలో ఎవరు ఇటువంటి పని చెయ్యరు. ఒక్క వేద మాత్రమే చేస్తుంది. కష్టం తనకే ఉంచుకుని సంతోషం కుటుంబానికి పంచుతుంది. మా వేద మేలిమి బంగారం’ అని మాలిని మెచ్చుకుంటుంది. అభిమన్యు వేదని కారులో తీసుకోస్తూ కూడా యష్ చేసిన మోసం గురించి చెప్తాడు కానీ వేద మాత్రం పిచ్చిదానిలా ఏది నమ్మదు. యష్ ఇంక బయల్దేరదామని మాళవికతో అంటే ఏ ఇంటి దగ్గర వేద ఎదురుచూస్తూ ఉంటుందా అని కోపంగా అంటుంది. అవును వేద దగ్గరకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉంది తను నా కోసం చేసే వంట తినాలని ఆత్రంగా ఉంది. వేద లేకుండా నా జీవితమే లేదు అని యష్ చెప్తాడు.
Also read: అభిమన్యుని బ్లాక్ మెయిల్ చేసిన మాళవిక- నిజం తెలుసుకున్న వేద ఏం చేయబోతుంది?
అభిమన్యు తలుపు కొట్టడంతో మాళవిక షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని మాళవిక అడుగుతుంది. తనంత తానుగా ఇక్కడికి రాలేదుని ఒక పర్సన్ తీసుకొచ్చారని అభి వేదని చూపిస్తాడు. వేదని చూసి యష్ షాక్ అవుతాడు.
తరువాయి భాగంలో..
అభిమన్యు నన్ను కలిసి మీ గురించి చెడుగా చెప్తున్నాడు. మాళవికనే మా అమ్మకి యాక్సిడెంట్ చేసిందని అంటున్నాడు. అవన్నీ అబద్ధాలు అని మీరు చెప్పండి అని యశోధర్ ని అడుగుతుంది. ఆ మాటలకి యష్ బాధగా నన్ను దేవుడిని చెయ్యకు, నేనేమీ గొప్పవాడిని కాదని అంటాడు. ఆమాట విని వేద షాక్ అవుతూ ఈ యాక్సిడెంట్ మాళవికనే చేసిందా అని అడుగుతుంది.