Gruhalakshmi November 10th: నందు వాళ్ళని బకరాల్ని చేసిన పరంధామయ్య- సామ్రాట్ ని ఫుట్ బాల్ ఆడుకున్న పెద్దాయన
తులసి ఇంట్లో నుంచి బయటకి వెళ్లడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
సామ్రాట్ తులసి సామాన్లు మోస్తూ పనోడిలా మారిపోతాడు. వాళ్ళని చూసిన దివ్య మీ ఇద్దరు ఇలా చాలా బాగున్నారు ఒక ఫోటో తీసుకుంటా అని ఫోటో తీస్తుంది. తీస్తే తీశావ్ కానీ సోషల్ మీడియాలో మాత్రం పోస్ట్ చెయ్యకు అసలే మా ఇద్దరి ఫోటోస్ కి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయ్ అని జోకులు వేస్తాడు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం అని అంకిత, దివ్య, శ్రుతి బాధపడతారు. నిన్నటి వరకి ఇంటికి వాస్తవని ఎదురు చూశాను మామ్ కానీ ఇప్పుడు ఇల్లు తీసుకున్నావ్ అని దివ్య ఎమోషనల్ అవుతుంది. తెచ్చిన సామార్లు అన్ని చకచకా సర్దుతారు. తులసి కొత్త ఇంట్లో పాలు పొంగించి పాయసం చేస్తుంది.
నందు చేసిన తప్పు గురించి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే లాస్య వచ్చి పుల్లలు వేస్తుంది. ఎన్ని చెప్పినా వినడం లేదు ఇలాగే వదిలేస్తే ముక్కలైన ఈ ఇంటిని అతికించేస్తాడు ఇలాగే అయితే నా కోడలు స్థానానికి ఎసరు పడినట్టే అని నందు దగ్గరకి వెళ్తుంది. తులసి పాయసం చేసి ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తుంది. చాటుగా అనసూయ, పరంధామయ్య పాయసం తిన్న విషయం గుర్తు చేసుకుని బాధపడుతుంది. తన మూడ్ మార్చేందుకు ప్రేమ్, సామ్రాట్ ప్రయత్నిస్తారు. రేపు తాతయ్య బర్త్ డే అని ప్రేమ్ చెప్తాడు. తాతయ్య పుట్టినరోజు నాడు మీ చేతి పాయసం తినిపించాలని అంకిత, శ్రుతి అంటారు. ఈసారి అది జరగదుగా అని తులసి బాధపడుతుంది. ఎందుకు జరగదు గట్టిగా అనుకో అని ప్రేమ్ చెప్తాడు.
Also read: అభిమన్యుని బ్లాక్ మెయిల్ చేసిన మాళవిక- నిజం తెలుసుకున్న వేద ఏం చేయబోతుంది?
మావయ్య దగ్గర మీరంతా ఉన్నారు సంతోషంగా ఉంచుతారని తులసి అంటుంది. ఇదంతా సామ్రాట్ చూస్తూ చాలా ఫీల్ అవుతాడు. తులసి బాధ చూడలేక అందరూ ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. పిల్లలు వెళ్ళిపోవడం చూసి తులసి ఎమోషనల్ అవుతుంది. లాస్య వచ్చి నందుని పలకరిస్తుంది. మావయ్య గారికి సర్ ప్రైజ్ ఇద్దాం అర్థరాత్రి విషెస్ చెప్పి కేక్ కట్ చేయిద్దామని చెప్తుంది. అందుకు నందు సరే అంటాడు. సామ్రాట్ కి బాబాయ్ ఫోన్ చేసి ఒక ఆట ఆడుకుంటాడు. తులసి గారు కేవలం నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే వేరే ఆలోచన లేదని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే తులసి వచ్చి వెనుక ఉంటుంది. విన్నదేమో అని కాస్త కంగారు పడతాడు కానీ ఏమి ఉండదు.
అనసూయ, లాస్య, అభి పరంధామయ్య బర్త్ డే చేసేందుకు రెడీ అవుతారు. అప్పుడే నందు కేక్ తీసుకుని వస్తాడు. మనం లేచాము కదా మిగతావాళ్ళు ఎక్కడ అని అడుగుతుంది. వాళ్ళు రారులే అని అభి అంటాడు. 12 కావొస్తుంది అని అభిని వెళ్ళి ప్రేమ్ ని నిద్రలేపమని చెప్తాడు. అటు లాస్య దివ్య కోసం వెళ్తుంది. కానీ ప్రేమ్, దివ్య ఎవరు తమ గదుల్లో ఉండరు. అభి, లాస్య వచ్చి దివ్య, ప్రేమ్ గదుల్లో లేరని చెప్తారు.
Also Read: 'తప్పు చేస్తున్నావ్ నాన్న' మాధవ్ ని కడిగేసిన చిన్మయి- 'దేవి నా బిడ్డే' సత్యకి చెప్పిన ఆదిత్య