News
News
X

Gruhalakshmi March 3rd: పెళ్లివాళ్ళని వెళ్లిపొమ్మని చెప్పిన దివ్య - తులసి వల్లే ఇదంతా జరిగిందంటూ లాస్య గొడవ

దివ్య, విక్రమ్ ఎంట్రీతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

దివ్య తన బ్యాగ్ లో డబ్బులు చూసి విక్రమ్ ని గుర్తు చేసుకుని తనలో తనే నవ్వుకుంటూ ఉండటం చూసి శ్రుతి వచ్చి పలకరిస్తుంది. అది మామూలు నవ్వు కాదు ఎవరో మనసులో నుంచి తల బయటకి పెట్టి కనిపిస్తున్నారు ఎవరు అని అడుగుతుంది. అలాంటిది ఏమి లేదు ఏదేదో ఊహించుకోకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్తుంది. దివ్య విక్రమ్ గురించి చెప్తుంది. ప్రేమకథలన్నీ ఇలాగే మొదలవుతాయి, అతనెవరో నీకు దగ్గర కావడం కోసం రెండు లక్షలు పెట్టుబడి పెట్టాడని శ్రుతి అంటుంది. నీవైపు నుంచి ఏమి లేకపోయినా అతనివైపు నుంచి ఉంటుంది కావాలంటే రాసి పెట్టుకోరా సాంబా అని శ్రుతి అంటుంది. కాసేపు దివ్యని ఆటపట్టించి వెళ్ళిపోతుంది.

Also Read: మళ్ళీ మొదటికొచ్చిన రిషిధార ప్రేమ- జరిగింది తలుచుకుని రగిలిపోతున్న దేవయాని

మంచి సంబంధం తీసుకొచ్చామని లాస్య ఇంట్లో తెగ హడావుడి చేస్తుంది. దీంతో అందరూ లాస్యని తలావక మాట అనేస్తారు. లాస్య రెడీ అవడం చూసి దివ్య పెళ్లి చూపులు నాకా మీకా అని దివ్య కౌంటర్ వేస్తుంది. పెళ్లి కొడుకు వాళ్ళు ఫుల్ క్యాష్ పార్టీ అని ఏదేదో మాట్లాడి కాసేపు అందరి బుర్ర తినేస్తుంది. ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు అంతా సవ్యంగా జరుగుతుందని తులసి అభయమిస్తుంది. దేవుడు చీర ముందు పెట్టుకుని తల పట్టుకుని కూర్చుంటాడు. తనకి చీర గండం ఉందని ఏదో ఒక మూల చీరని కాల్చేస్తానని భయపడుతూ చెప్తాడు. దీంతో విక్రమ్ తన తల్లి చీరని ఇస్త్రీ చేస్తానని మొదలుపెట్టేస్తాడు. తల్లి చీర ఐరన్ చేయడం చూసి ఏంటది అని వాళ్ళ తాతయ్య కోప్పడతాడు. సంజయ్ షర్ట్ తీసుకొచ్చి దేవుడుకి ఇవ్వబోతుంటే విక్రమ్ తనే తీసుకుంటాడు. మీరంటే హాస్పిటల్ కి వెళతారు నాకు ఏం ఉంది ఇంటి పని, వంట పని చేసుకోవడం తప్ప అనేసరికి పెద్దాయన బాధగా వెళ్ళిపోతాడు.

Also Read: యష్, వేద రొమాంటిక్ మూమెంట్- వసంత్, చిత్ర పెళ్లికి జరగకుండా అడ్డుపడిన వ్యక్తి ఎవరు?

లాస్య ఆంటీ పెళ్లి పెద్ద అనేసరికి పెళ్లిచూపులు మీద ఉత్సాహం, మూడ్ అన్ని దొబ్బేశాయ్ అని డల్ గా ఫేస్ పెట్టేస్తుంది. విక్రమ్ కి ఫోన్ చేశావా అని శ్రుతి అడిగేసరికి తన ముందే కాల్ చేస్తానని అంటుంది. విక్రమ్ సంజయ్ షర్ట్ ఐరన్ చేస్తూ దివ్య ఊహల్లో ఉంటాడు. అప్పుడే దివ్య విక్రమ్ కి ఫోన్ చేస్తుంది. దేవుడు ఫోన్ లిఫ్ట్ చేసి విక్రమ్ గురించి గొప్పగా చెప్పడానికి ట్రై చేస్తాడు. విక్రమ్ కి ఫోన్ ఇవ్వమంటే కుదరదు చాలా బిజీగా ఉన్నారని కుదిరితే మాట్లాడిస్తానని చెప్పి కట్ చేస్తాడు. దానం చేసి వెనక్కి తిరిగి చూడని వాడిని ఇతన్నే చూస్తున్నా అని శ్రుతి అంటుంది. నందు స్నేహితుడు శరత్ అబ్బాయిని తీసుకుని వస్తాడు. కుటుంబాన్ని వాళ్ళకి పరిచయం చేస్తాడు. వాళ్ళ ముందు లాస్య తెగ బిల్డప్ కొడుతుంది. వచ్చిన పెళ్లి కొడుకు ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు.

Published at : 03 Mar 2023 09:43 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial March 3rd Update

సంబంధిత కథనాలు

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?

Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?

Shah Rukh Khan Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

Shah Rukh Khan  Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!

UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!