Gruhalakshmi March 14th: దివ్య నిర్ణయం విని ఎగిరిగంతులేస్తున్న విక్రమ్- లాస్య దుమ్ముదులుపుతున్న వాసుదేవ్
వాసుదేవ్ ఎంట్రీతో సీరియల్ సరికొత్త మలుపు తీసుకుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తులసి ఉద్యోగం చేస్తుందని అనసూయ సంతోషంగా వాసుదేవ్ కి చెప్తుంది. తులసిని పిల్లల గురించి అడుగుతారు. దివ్య గురించి అడుగుతుంటే లాస్య సమాధానం చెప్తుంది. నీకు ఎంతమంది పిల్లలు అని వాసుదేవ్ అంటాడు. ఒక కొడుకు హాస్టల్ లో ఉన్నాడని అంటుంది. మొగుడిని వదిలేశావ్ పిల్లోడిని కూడా వదిలించుకున్నావా అని లాస్యకి సెటైర్ వేస్తాడు. విక్రమ్ దివ్య చెప్పిన కాఫీ షాప్ కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. దేవుడి చెయ్యి పట్టుకుని విక్రమ్ వదలకుండా తిరుగుతుంటే తనని వదలమని బతిమలాడతాడు. అప్పుడే దివ్య విక్రమ్ దగ్గరకి వస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు మర్యాదలు చేసుకుంటూ కాసేపు నవ్విస్తారు. విక్రమ్ కి దివ్య సోరి చెప్తుంటే తను మాత్రం కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. అపార్థం చేసుకున్నందుకు సోరి అంటుంది.
Also Read: యష్, వేద విడాకులు- విలన్ గా తన అసలు రంగు బయటపెట్టిన విన్నీ
ముక్కూ మొహం తెలియని నేను అన్ని మాటలు అంటుంటే ఎలా భరించారని అడుగుతుంది. అది వదిలేసి ఇంకేదైనా మాట్లాడమని దివ్యనే చూస్తూ తన మనసులో మాట చెప్పబోతాడు. అప్పుడే అక్కడ ఒక వ్యక్తి చదువులేని వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడతాడు. అది విని దివ్య కోపంగా అతని దగ్గరకి వెళ్తుంది. సంస్కారం లేకుండా చదువు ఉండి ఏం లాభం, మనిషి గొప్పతనానికి కొలమానం చదువు కాదని అతన్ని చెడామడా తిట్టేస్తుంది. మళ్ళీ విక్రమ్ దివ్యని పొగడటం మొదలుపెట్టేస్తాడు. చదువులేని వాడు మొగుడుగా ఒకేనా కాదా అని ఒకసారి అడిగి వస్తానని దేవుడు దివ్య వెనుకాలే వెళతాడు. కిచెన్ లో తులసి ఒక్కతే ఉందనుకుని నందు మాట్లాడటానికి వస్తాడు. కానీ తీరా కిచెన్ లోకి వచ్చేసరికి రాములమ్మ కూడా కనిపించేసరికి బిత్తరపోయి పరుగులు పెట్టేస్తాడు.
మళ్ళీ కిచెన్ లోకి వచ్చిన నందుని ఏం కావాలని రాములమ్మ అడుగుతుంది. ప్రైవసీ అంటే అదేం కూర అంటుంది. కాదు తులసితో మాట్లాడాలి ఏకాంతంగా అనేసరికి రాములమ్మ కాసేపు నందు మీద సెటైర్లు వేస్తుంది. తను బయటకి వెళ్లనని ఇక్కడే ఉంటానని చెప్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర చెయ్యి పట్టుకున్నందుకు నందు సోరి చెప్తాడు. తులసితో మాట్లాడుతుంటే మధ్యలో రాములమ్మ జోక్యం చేసుకుంటూ ఫుల్ గా ఆడుకుంటుంది. ఏదో ఒక రోజు వాసుదేవ్ ముందు ఆయనే నోరు జారతారని రాములమ్మ అంటుంది. దివ్యని ఆపి దేవుడు మాట్లాడతాడు. చదువులేని వాళ్ళకి కూడ మనసు ఉంటదని అంటున్నారు కదా మరి అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటారా? అని అడుగుతాడు. మిగతా అన్ని విషయాలు ఒకే అయితే చదువు విషయం పట్టించుకొనని దివ్య చెప్పేసరికి విక్రమ్ తెగ సంతోషపడతాడు.
Also Read: జానకి భజన చూసి చిరాకు పడిన అఖిల్- సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న రామ
దివ్య వెళ్లిపోగానే విక్రమ్ సంబరంగా డాన్స్ చేస్తూ ఆనందంగా ఉంటాడు. వాసుదేవ్ వచ్చిన దగ్గర నుంచి తులసిని పొగిడే పనిలోనే ఉంటాడు. ఎలాగో ఫ్రీ గా ఉన్నారు కదా బిజినెస్ డీల్ గురించి మాట్లాడుకుంటే బాగుటుందని లాస్య ఆత్రం తట్టుకోలేక అడిగేస్తుంది. బిజినెస్ కోసమే వచ్చానని తనకి ఎలా తెలుసని వాసుదేవ్ నందుని అడిగేస్తాడు. ఇక్కడే ఉంటుంది కదా మేం మాట్లాడుకుంటుంటే విని ఉంటుందని నందు కవర్ చేస్తాడు. మొగుడు వదిలేశాడని ఇంట్లో ఉంచుకున్నాడు ప్రతి దాంట్లో దూరిపోకు అని వాసుదేవ్ లాస్య దుమ్ముదులుపుతాడు.