News
News
X

Ennenno Janmalabandham March 14th: యష్, వేద విడాకులు- విలన్ గా తన అసలు రంగు బయటపెట్టిన విన్నీ

యష్, వేద మధ్యలోకి విన్నీ రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

యష్ చేసింది తప్పేనని వసంత్ కూడా అంటాడు. అటు హాస్పిటల్ లో వేద కూడా కాల్ చేసి సోరి చెప్పొచ్చు కదా నేనేమీ కాదని అనను కదా అని తిట్టుకుంటుంది. అప్పుడే యష్ తనకి ఫోన్ చేస్తాడు. కాల్ చేయగానే తియ్యాలా, సోరి చెప్పగానే యాక్సప్ట్ చేయాలా నేను తియ్యనని ఆత్మాభిమానం తొక్క ఏవేవో ఉన్నాయని అంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయలేదని యష్ కస్సుబుస్సులాడతాడు. వసంత్ ని తన ఫోన్ నుంచి చేయమని చెప్తాడు. ఈయన గారి ఫోన్ లిఫ్ట్ చేయలేదని వసంత్ తో చేయిస్తున్నారా ఎవరికి తెలియదని నవ్వుకుంటుంది. ఎందుకు తీస్తుంది అగ్రహారం ఆటంబాంబ్ వేద అని అంటాడు. వసంత్ కాసేపు అటు ఇటూ పరుగులు పెట్టి వేదకి ఫోన్ చేసి యష్ కి యాక్సిడెంట్ అయ్యిందని అబద్ధం చెప్తాడు. అది విని వేద షాక్ అవుతుంది. ఏడుస్తూ పరుగులు పెట్టేస్తుంది.

Also Read: జానకి భజన చూసి చిరాకు పడిన అఖిల్- సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న రామ

చాలా సార్లు ఫోన్ చేశారు లిఫ్ట్ చేయకపోయేసరికి అప్సెట్ అయ్యి దేనికైనా గుద్దేశారు ఏమోనని వేద ఏడుస్తూ వసంత్ చెప్పిన అడ్రస్ కి వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళని యాక్సిడెంట్ జరిగిందా అని అడుగుతుంది లేదని చెప్తారు. వసంత్ ఇంకా రాలేదేంటని కాల్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయకుండా యష్ కి కాల్ బాక్ చేస్తాడు. అప్పుడే అక్కడికి కొంతమంది రౌడీలు వస్తారు. వాళ్ళ దగ్గరకే వేద వచ్చి ఇక్కడ యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా అని అడుగుతుంది అయ్యింది తీసుకెళతాం పదా అని వేదని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోతుంటే యష్ కనిపిస్తాడు. వెంటనే వేద  కారులో ఉన్నవాళ్ళని పక్కకి తోసేసి యష్ దగ్గరకి పరుగులు పెడుతుంది. రౌడీలు వచ్చి వేదని పట్టుకునేసరికి వాళ్ళతో ఫైట్ చేస్తాడు.

మీకు ఏం కాలేదు కదా దెబ్బలు ఏమి తగల్లేదు కదా అని వేద కంగారుగా అడుగుతుంది. యాక్సిడెంట్ ఏమి జరగలేదని వసంత్ అబద్ధం చెప్పాడని, ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నిన్ను ఇక్కడికి రప్పించడం కోసమని యష్ చెప్తుంటే వేద కోపంగా తన చెంప పగలగొడుతుంది. మీకు యాక్సిడెంట్ జరిగింది అనగానే ణా ప్రాణం పోయినంత పనైంది. ఇద్దరి మనుషుల మధ్య ఉండాల్సింది మ్యూచుయల్ అండర్ స్టాండింగ్. మన మధ్య ఏముంది ఏమీ లేదు ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏమి లేవని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. వసంత్ కి జరిగింది మొత్తం చెప్పి తనని తిడతాడు. చిన్న ఇష్యూని కాంప్లికేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని వసంత్ సోరి చెప్తాడు. నేనే నీకు థాంక్స్ చెప్పాలి, వేద నన్ను చెంప దెబ్బ కొట్టింది, ఆ కోపంలో ఉక్రోషంలో కేవలం నా మీద ప్రేమే కనిపించింది. వేదలో అమ్మ మనసు కనిపించింది. ప్రతి భార్యకి భర్త మీద లక్ష కాంప్లయింట్స్ ఉంటాయి వాటి వెనుక ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమని ఈరోజు వేదలో చూశాను. ఇలాంటి సలహాలు మళ్ళీ ఇవ్వు వేదతో రెండు మూడు చెంప దెబ్బలు తినాలని ఉందని అంటాడు.

Also Read: రాజ్యలక్ష్మికి షాకిచ్చిన సరోజ- లాస్యని అవమానించిన వాసుదేవ్, తులసి చేయందుకున్న నందు

వేద రాగానే కిడ్నాప్ చేయడానికి కిడ్నాపర్స్ రెడీ గా ఉన్నారు ఎలా అని యష్ డౌట్ పడతాడు. వేద అక్కడికి వస్తుందని నీకు నాకు మాత్రమే తెలుసు కానీఆ విషయం ఇంకొకరికి తెలుసు ఆ మూడో మనిషి ఎవరు అని యష్ అనుకుంటూ ఉండగా విన్నీ వేద ఫోటో ముందు క్రూరంగా నవ్వుతూ ఎంట్రీ ఇస్తాడు.

Published at : 14 Mar 2023 07:41 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial March 14th Episode

సంబంధిత కథనాలు

Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్

Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్

Vishnu Priya Manas New Song : నల్లంచు చీరెదాన, నకిలీసు పెట్టేదానా - విష్ణుప్రియ, మానస్ మళ్లీ దుమ్మురేపారుగా

Vishnu Priya Manas New Song : నల్లంచు చీరెదాన, నకిలీసు పెట్టేదానా - విష్ణుప్రియ, మానస్ మళ్లీ దుమ్మురేపారుగా

Janaki Kalaganaledu March 25th: ప్రేమలోకంలో విహరిస్తున్న రామ, జానకి- జాతకం చెప్పించుకున్న మల్లిక, నవ్వుకున్న మలయాళం

Janaki Kalaganaledu March 25th: ప్రేమలోకంలో విహరిస్తున్న రామ, జానకి- జాతకం చెప్పించుకున్న మల్లిక, నవ్వుకున్న మలయాళం

Guppedanta Manasu March 25th: రూమ్ లో ఇరుక్కుపోయిన రిషిధార, కాలేజీ పరువు తీయాలనుకున్న ధర్మరాజు నుంచి రిషి తెలుసుకున్న నిజాలేంటి!

Guppedanta Manasu March 25th: రూమ్ లో ఇరుక్కుపోయిన రిషిధార, కాలేజీ పరువు తీయాలనుకున్న ధర్మరాజు నుంచి రిషి తెలుసుకున్న నిజాలేంటి!

Gruhalakshmi March 25th: రాజ్యలక్ష్మి పరువు గోవిందా, ధర్నాకి దిగిన దివ్య- బిజినెస్ డీల్ వద్దన్న నందు

Gruhalakshmi March 25th: రాజ్యలక్ష్మి పరువు గోవిందా, ధర్నాకి దిగిన దివ్య- బిజినెస్ డీల్ వద్దన్న నందు

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం