News
News
X

Gruhalakshmi March 13th: రాజ్యలక్ష్మికి షాకిచ్చిన సరోజ- లాస్యని అవమానించిన వాసుదేవ్, తులసి చేయందుకున్న నందు

విక్రమ్, దివ్య ఎంట్రీతో సీరియల్ సరికొత్త మలుపు తీసుకుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

విక్రమ్, సరోజాకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఇక నందు ఇంటికి వాసుదేవ్ ఫ్యామిలీ వస్తుంది. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా లాస్య వచ్చి వాసుదేవ్ ని పలకరిస్తుంది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావ్ ఈ ఇంట్లో నీకేం పని వాసుదేవ్ అడుగుతాడు. లాస్య భర్త తనకి డివోర్స్ ఇచ్చాడు డిప్రెషన్ లో ఏం చేయాలో తెలియక బాధపడుతుంటే తులసి ఇంటికి పిలిపించుకుని ఆశ్రయం ఇచ్చిందని నందు చెప్తాడు. ఏదైనా మంచి కారణం చెప్పొచ్చు కదా ఇక్కడ కూడా తులసిని హైలెట్ చేయాలా అని లాస్య మనసులో తిట్టుకుంటుంది. ఇక్కడ ఉండి ఏం చేస్తుందని వాసుదేవ్ అనేసరికి కేఫ్ విషయంలో సహాయం చేస్తుందని చెప్తాడు. తర్వాత లాస్య వచ్చి తులసికి థాంక్స్ చెప్తుంది. నేను ఆడగ్గానే నందుకి భార్యగా ఒప్పుకున్నందుకని లాస్య అంటే ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని తులసి ధీటుగా సమాధానం చెప్తుంది.

Also Read: రాహుల్ కి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ - అపర్ణ కండిషన్ కి ఒప్పుకున్న కావ్య

పెళ్లి చూపుల్లో విక్రమ్, సరోజా పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు. వాళ్ళ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు ముహూర్తాల గురించి మాట్లాడుకుందామని రాజ్యలక్ష్మి అంటుంది. కానీ విక్రమ్ తాతయ్య మాత్రం ఒప్పుకోడు. అమ్మాయి తల్లిదండ్రులు ముహూర్తం కూడా మీ ఇష్టమేనని అంటారు. అప్పుడే సరోజ, విక్రమ్ వస్తారు. ముహూర్తాలు పెట్టుకోవడానికి విక్రమ్ ఎటువంటి అభ్యంతరం లేదని అంటాడు. కానీ సరోజా మాత్రం తనకి అభ్యంతరం ఉందని చెప్తుంది. తనకి కావలసింది ఇలాంటి అబ్బాయి కాదని చదువుకున్న వాడని సరోజ అంటుంది. ఈ సంబంధం అవసరం లేదని తెగేసి చెప్పేసి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి . సరైన సమయంలో సరైన సలహా ఇచ్చి జీవితాన్ని నిలబెట్టారు బలవంతంగా మీతో తాళి కట్టించుకుంటే జీవితాంతం ఏడుస్తూ ఉండేదాన్ని మీరిచ్చిన ధైర్యానికి రుణపడి ఉంటానని వెళ్ళిపోతుంది.

ఏం జరిగిందని రాజ్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేశావని సంజయ్ అంటాడు. చదువు లేదు కాబట్టి వద్దని మొహం మీదే చెప్పేసింది అయినా పెళ్లి చేసుకుంటానంటే బలవంతంగా తాళి కట్టించుకుంటాను అన్నది అలా అన్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాను. నేను నో చెప్పలేదు కదా కావాలంటే ఆ అమ్మాయినే ఇంట్లో వాళ్ళకి నో చెప్పమని చెప్పాను ఇందులో తప్పేముందని విక్రమ్ బాధపడతాడు. చదువులేని వాడికి నాకు సంబంధాలు రావు, ముందు తమ్ముడికి పెళ్లి చేయమని చెప్పేసి వెళ్ళిపోతాడు. విక్రమ్ గురించి నిజం తెలుసుకున్న దివ్య తనకి ఫోన్ చేస్తుంది. దివ్య ఫోన్ చేయడం చూసి భయపడిపోతాడు. లిఫ్ట్ చేయకపోయేసరికి మళ్ళీ చేసి మొన్న కలుసుకున్న ప్లేస్ కి రమ్మని పిలుస్తుంది. విక్రమ్ దేవుడిని వెంట పెట్టుకుని వెళతాడు.

Also Read: ప్రేమరంగుల్లో మునిగితేలుతున్న రిషిధార- కొడుకుని చూసి మురిసిన జగతి, రగిలిపోతున్న దేవయాని

వాసుదేవ్ వాళ్ళు భోజనానికి కూర్చుంటారు. లాస్య వచ్చి నందు పక్కన కూర్చునేసరికి అదేంటి తను వచ్చి నీ పక్కన కూర్చుందని అడుగుతాడు. నీ మొగుడికి విడాకులు ఇచ్చావ్ కదా అని ఎవరి మొగుడు పక్కన కూర్చుంటావ్ ఏంటని మొహం మీదే అడిగేస్తాడు. లాస్య వడ్డిస్తుంది నువ్వు వచ్చి కూర్చోమని నందు తులసి చెయ్యి పట్టుకుంటాడు. అది లాస్య కోపంగా చూస్తుంది. తులసి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది.

Published at : 13 Mar 2023 11:17 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial March 13th Update

సంబంధిత కథనాలు

Guppedanta Manasu March 22nd: శ్రీవారికి ప్రేమగా వండి వడ్డించిన వసుధార, తాళి గురించి కొనసాగుతున్న రచ్చ

Guppedanta Manasu March 22nd: శ్రీవారికి ప్రేమగా వండి వడ్డించిన వసుధార, తాళి గురించి కొనసాగుతున్న రచ్చ

Gruhalakshmi March 22nd: రాజ్యలక్ష్మి మెడలు వంచుతున్న దివ్య- లాస్యకి నందు విడాకులు..!

Gruhalakshmi March 22nd: రాజ్యలక్ష్మి మెడలు వంచుతున్న దివ్య- లాస్యకి నందు విడాకులు..!

Brahmamudi March 22nd: చూడముచ్చటైన జంట- కనకాన్ని గుర్తుపట్టిన కావ్య, రిసెప్షన్ కి వచ్చిన స్వప్న

Brahmamudi March 22nd: చూడముచ్చటైన జంట- కనకాన్ని గుర్తుపట్టిన కావ్య, రిసెప్షన్ కి వచ్చిన స్వప్న

Ennenno Janmalabandham March 22nd: వేదని కాపాడి తీసుకొచ్చిన ఖుషి- బరువు తూగని యష్, విన్నీ కోరికే ఫలిస్తుందా?

Ennenno Janmalabandham March 22nd: వేదని కాపాడి తీసుకొచ్చిన ఖుషి- బరువు తూగని యష్, విన్నీ కోరికే ఫలిస్తుందా?

Janaki Kalaganaledu March 21st: రామని దారుణంగా అవమానించిన అఖిల్- భార్యగా బాధ్యతలు నిర్వర్తించమని జానకికి సలహా ఇచ్చిన జ్ఞానంబ

Janaki Kalaganaledu March 21st: రామని దారుణంగా అవమానించిన అఖిల్- భార్యగా బాధ్యతలు నిర్వర్తించమని జానకికి సలహా ఇచ్చిన జ్ఞానంబ

టాప్ స్టోరీస్

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?

Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?