Guppedanta Manasu March 13th: ప్రేమరంగుల్లో మునిగితేలుతున్న రిషిధార- కొడుకుని చూసి మురిసిన జగతి, రగిలిపోతున్న దేవయాని
Guppedantha Manasu March 13th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
వసుధార ప్రాజెక్ట్ మీటింగ్ కి కావాలనే తనని పిలవలేదా? లేదంటే కరెక్ట్ గా ఆలోచించిందా? తన విషయంలో ఏదైనా తప్పుగా ఆలోచిస్తున్నానా? లేదు లేదు తనే నన్ను ఎక్కువగా బాధపెట్టిందని రిషి మనసులో అనుకుంటూ గదిలో నుంచి బయటకి వస్తాడు. అప్పుడే వసు కూడా గది నుంచి బయటకి వస్తూ రిషిని ఢీ కొడుతుంది. ఇద్దరూ కాసేపు వాదులాడుకుంటారు.ఒకప్పుడు సీరియస్ సింహంగా ఉన్నా రిషి సర్ తర్వాత ప్రేమగా పలకరించేవాళ్ళు ఇప్పుడేమో ప్రేమ దాచుకుని కోపం చూపిస్తున్నారని వసు బాధపడుతుంది. తెలిసో తెలియక రిషి సర్ కి కోపం తెప్పించాను ఆ కోపం నెనే పోగొట్టాలని అనుకుంటుంది. ఫోన్లో రిషి ఫోటో చూస్తూ సోరి సోరి చెప్తుంది.
Also Read: భ్రమరాంబిక ప్లాన్ సక్సెస్, బలిపశువైన మాళవిక - కిడ్నాప్‌నకు గురైన వేద
అటు రిషి కూడా వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకసారి మెడలో తాళి వేసుకుని తప్పు చేసింది అది సరిదిద్దేలోపు బట్టలు సర్దుకుని ఇంటికి వచ్చేసింది. తను నా దగ్గరకి రావడం ఉండటం నాకు సంతోషమే కానీ వచ్చిన టైమ్ కరెక్ట్ కాదని అనుకుంటాడు. రిషి వసు గదిలోకి వెళ్లబోతుంటే దేవయాని వచ్చి తను కనిపించడం లేదని గదిలో కూడా లేదని చెప్తుంది. చెప్పకుండా వచ్చింది చెప్పకుండా వెళ్లిపోయిందేమోనని దేవయాని అంటుంది. వసుధారని అంతగా పట్టించుకోకని అనేసరికి మీరు అలా ఆలోచించొద్దు ఈ ఇంటికి వచ్చే స్వతంత్రం తనకి ఉందని చెప్పేసరికి దేవయాని షాక్ అవుతుంది. రిషి వసు కోసం మహేంద్ర జగతి కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే రిషికి మెసేజ్ పంపిస్తుంది అర్జెంట్ గా రమ్మని లొకేషన్ పెడుతుంది.
వసు మెసేజ్ చేసిందని చెప్పేసి రిషి వెళ్ళిపోతాడు. అప్పుడే మహేంద్రకి కూడా జగతి మెసేజ్ పంపిస్తుంది. రిషి ఎక్కడికి వెళ్తున్నాడని దేవయాని మహేంద్ర మీద అరుస్తుంది. తెలియదని సమాధానం చెప్పేసి మహేంద్ర కూడా వెళ్ళిపోతాడు. దీంతో దేవయాని కోపంతో రగిలిపోతూ ఫణీంద్ర దగ్గరకి వెళ్ళి ఈ ఇంట్లో ఏం జరుగుతుంది వసుధార కనిపించడం లేదు, రిషి వెళ్ళిపోయాడు ఎక్కడకని అంటే మహేంద్ర కూడా చెప్పలేదని అరుస్తుంది. వాళ్ళ మధ్యలోకి మనం వెళ్ళడం కరెక్ట్ కాదని ఫణీంద్ర కాస్త గడ్డి పెట్టేస్తాడు. వసు పెట్టిన లొకేషన్ కి రిషి వస్తాడు. ఏంటి ఇక్కడ ఉన్నావ్ అని రిషి టెన్షన్ గా అడుగుతుంటే వసు రంగులు పూసి హ్యపీ హోలీ అని చెప్తుంది. కాసేపు తన మీద అరుస్తాడు. అప్పుడే మహేంద్ర, జగతి కూడా వచ్చేసరికి వాళ్ళ మీద రిషి అరుస్తాడు.
Also Read: బయటకు వెళ్లిపొమ్మన్న రిషి, ఇంట్లోనే మీటింగ్ పెట్టేసిన వసు - అయోమయంలో దేవయాని!
ఇంట్లో అడిగితే ఏం తెలియదని అన్నారు మరి ఎలా వచ్చారు అబద్ధం చెప్పారా అని కసురుతాడు. జగతి మెసేజ్ పెట్టింది వచ్చేశానని అంటాడు. రిషి గబగబా అరిచేసి వెళ్లిపోతూ వెనక్కి వచ్చి వసు మొహాన రంగు పూసి ఆటపట్టించడం నీకే వచ్చా అని అంటాడు. మహేంద్రకి రంగులు పూసి విసెష్ చెప్తాడు. తర్వాత జగతి ప్రేమగా తన దగ్గరకి వెళ్ళి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు చెప్తుంది. రిషి కూడా తల్లికి రంగు పూయడంతో అందరూ సంతోషపడతారు. ఒకరిమీద మరొకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలు చేసుకుంటారు. అన్ని పండగలకు అందరూ జంటగా సంతోషంగా గడుపుతున్నారు కానీ నేనే ఒంటరిగా ఉంటున్నా, శైలేంద్ర అక్కడ నేను ఇక్కడ అని ధరణి బాధపడుతుంది.