By: ABP Desam | Updated at : 13 Mar 2023 08:06 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
వేద తన భర్త యశోధర్ కోసం బ్రేస్ లెట్స్ కొనడానికి చూస్తూ ఉంటుంది. అప్పుడే విన్నీ వస్తాడు. యష్ చేతికి బ్రేస్ సరిపోతుందో లేదో అని అనుకుంటుంటే విన్నీ తన చేతికి పెట్టి చూడమని అనేసరికి పెడుతుంది. అప్పుడే యష్ వచ్చి ఏం జరుగుతుందని అంటాడు. విన్నీ కోసం బ్రేస్ కొంటున్నానని చెప్పేసరికి యష్ మొహం మాడిపోతుంది. తన కోసం అని ఎందుకు చెప్పావని విన్నీ అడుగుతాడు. కావాలని అలా చెప్పాను సర్ ప్రైజ్ కదా ఆయన ముందే చూసేశారు అందుకే అలా చేశానని అంటుంది. ఉడికించడం అవసరమా అని విన్నీ అంటాడు. గదిలోకి వెళ్ళిన యష్ కోపంతో రగిలిపోతాడు. నువ్వు మీ ఆయన్ని బాగా లవ్ చేస్తున్నావ్ కానీ మీ ఇద్దరి మధ్య అసలు లవ్ ఉందా? తనకి చాలా ఇగో, యాటిట్యూట్. ఖుషి కోసం అనవసరంగా యశోధర్ దగ్గర ఇరుక్కుపోయావ్ ఏమోనని విన్నీ అంటాడు. నిజమే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది.
వేద: మా ఇద్దరి మధ్య ఉన్నది ఒప్పందం విచిత్రమైన పరిస్థితి కానీ అలవాటైపోయింది, ఇద్దరం అడ్జస్ట్ అయిపోయాం. ఆయన నా గురించి బాగా ఆలోచిస్తారు మంచి కేర్ తీసుకుంటారు. అంతకంటే మా ఇద్దరి మధ్య ఇంకేముంటుంది
విన్నీ: మొగుడు పెళ్ళాల మధ్య సీక్రెట్స్ మాకు ఎందుకు చెప్తావ్ వెళ్ళి మీ హజ్బెండ్ ని సర్ ప్రైజ్ చెయ్యి
Also Read: సంబరపడుతున్న రుద్రాణి- అపర్ణ పెట్టిన కండిషన్ కి కావ్య తలొంచుతుందా?
పంతుల్ని పిలిపించి శాస్త్రం అని అబద్ధాలు చెప్పించారు అవన్నీ మాళవిక నమ్మేసింది. ఇంట్లో నుంచి వెళ్తానని అన్నది కానీ వెళ్ళిందా తీసుకెళ్లాడానికి ఎవరో వస్తారని అన్నది వచ్చారా పైన తిష్ట వేసుకుని కూర్చుందని ఖైలాష్ గాడు నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. అప్పుడే వసంత్ వస్తాడు. మాళవికని తనతో తీసుకువెళ్లడానికి వచ్చానని కోపంగా అంటాడు.
వేద సంతోషంగా బ్రేస్ తీసుకొచ్చి యష్ కి ఇస్తుంది. అది మీ బెస్ట్ ఫ్రెండ్ కి కదా అని కోపంగా అంటాడు. మీకు సర్ ప్రైజ్ ఇద్దామంటే సడెన్ గా వచ్చేశారు అందుకే అబద్దం చెప్పానని వేద అంటుంది. కానీ యష్ మాత్రం నమ్మడు.
యష్: వాడికోసం తీసుకుని నేను ఫీల్ అవుతానని నాకోసం అని అబద్దం చెప్తున్నావా?
వేద: కాదు మీకోసమే తీసుకున్నా సైజ్ కోసం విన్నీ చేతికి పెట్టాను ఇది నిజంగా మీకోసమే అని పెట్టబోతుంటే విసిరికొడతాడు
యష్: అబద్ధాలు చెప్పకు
వేద: నిజంగా మీకోసమే తీసుకున్నా
యష్: ఎవరికోసమో సెలెక్ట్ చేసింది నాకు వద్దు అనేసి కోపంగా వెళ్ళిపోతాడు.
Also Read: తగ్గుదాం డ్యూడ్ తప్పేముంది, మాజీ భార్యకి పెళ్లి చేసేయమని వసంత్ ని ఒప్పించిన యష్
వసంత్ ని చూసి మాళవిక సంతోషపడుతుంది. పాతవి ఏవైనా ఉంటే మర్చిపో మీది రక్తసంబంధం, మీ అక్కని నీ చేతుల్లో పెడుతున్నా టెంపరరీగా పెళ్లి జరిపిస్తాను మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తుంది తీసుకెళ్లమని భ్రమరాంబిక అంటుంది. మాళవిక వెళ్లిపోతున్నందుకు ఫీల్ అవుతున్నట్టు అభి నటిస్తాడు. తను వెళ్లిపోగానే ఇద్దరు సంతోషంగా నవ్వుకుంటారు. విన్నీ వేదకి ఫోన్ చేసి గిఫ్ట్ ఇచ్చావా ఏమన్నాడని అడుగుతాడు. వేద పాపం చాలా ఏడుస్తుంది. తర్వాత యష్ కారులో వెళ్లబోతుంటే విన్నీ రోడ్డుకి అడ్డంగా నిలబడతాడు. కోపంగా ఏంటని వస్తాడు. వేద బ్రేస్ ఇస్తే వద్దని అన్నావంట కదా అని విన్నీ అడుగుతాడు. నీకు ఇవ్వాలని అనుకున్నది నాకు ఎలా ఇస్తుంది అలా ఎలా అనుకున్నావ్ అది నీకోసమే కావాలంటే ఫ్రూవ్ చేస్తానని విన్నీ నగల వ్యాపారికి ఫోన్ చేస్తాడు. అది యశోధర్ గారికోసమే కదా తీసుకుందని చెప్తాడు. అది విని యష్ షాక్ అవుతాడు. వేద బ్రేస్ చూసుకుంటూ ఏడుస్తుంది.
Surveen Chawla: ‘రానా నాయుడు’ బ్యూటీ సుర్వీన్ చావ్లా నటించిన తెలుగు సినిమా మీకు గుర్తుందా?
RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం
Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?
Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!
Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!
Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్ థింగ్ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల
UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్!
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా