అన్వేషించండి

Brahmamudi March 10th: సంబరపడుతున్న రుద్రాణి- అపర్ణ పెట్టిన కండిషన్ కి కావ్య తలొంచుతుందా?

రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

అప్పగింతలు పూర్తయిన తర్వాత రాజ్ కావ్యని తీసుకుని వెళ్ళిపోతాడు. లక్ష్మీ, పార్వతి, సరస్వతుల్లాగా ముగ్గురు కూతుర్లు ఉండే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు వెళ్లిపోయారని కనకం బాధపడుతుంది. తన కొడుకు కోడలికి సంతోషంగా స్వాగతం పలుకుదామని అపర్ణ హారతి పళ్ళెం తీసుకుని గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది. రాజ్ పక్కన కావ్యని చూసి షాక్ అవుతుంది. స్వప్న స్థానంలో తను ఎందుకు ఉందని అందరినీ నిలదీస్తుంది. ఇక రోజు ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో లో ఏముందంటే..

దుగ్గిరాల ఇంటి కోడలిగా కావ్య అడుగుపెడుతుంది. ‘అందరూ నువ్వు తప్పు చేయలేదని నీ కుటుంబమే తప్పు చేసిందని ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. అలాంటి తప్పులు చేసే నీ పుట్టింటి వాళ్ళతో ఈరోజు నుంచి నీకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు. ఈ ఇంటి కోడలిగా ఉండాలంటే నీ పుట్టింటితో అన్ని బంధాలు తెంచుకోగలవా’ అని అపర్ణ కావ్యని అడుగుతుంది. ఆ మాటకి కావ్య షాక్ అవుతుంది. తన తల్లిదండ్రులను తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మెట్టినింటి కోసం పుట్టింటిని కావ్య దూరం పెడుతుందా? లేదంటే తన అత్త వారింటి వాళ్ళ మనసు మారుస్తుందా తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

Also Read: తగ్గుదాం డ్యూడ్ తప్పేముంది, మాజీ భార్యకి పెళ్లి చేసేయమని వసంత్ ని ఒప్పించిన యష్

గురువారం నాటి ఎపిసోడ్..

కావ్యని తీసుకుని రాజ్ ఇంటికి బయలుదేరతారు. ఇద్దరూ స్వప్న చేసిన మోసం తలుచుకుని మనసులోనే కుమిలిపోతారు. అక్క చేసిన పని వల్ల రెండు జీవితాలు నాశనమయ్యాయి. ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తన భార్యగా ఉండటం అంటే ఎంత కష్టం, జీవితాంతం అవమానాలు భరిస్తూ ఉండాలి. నిన్ను ఎంతగానో ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటే నువ్వు కోరుకున్నట్టే మహారాణిలా బతికేదానివని స్వప్న గురించి కావ్య తన మనసులోనే బాధపడుతుంది. అటు రాజ్ కూడా స్వప్న చేసిన మోసం తలుచుకుని రగిలిపోతాడు. శత్రువుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, రోజు తను నా భార్యగా ఇంట్లో తిరుగుతుంటే ఎలా భరించాలని అనుకుంటాడు.

అందరూ కలిసి రాజ్ ఇంటికి వెళతారు. ఇంట్లో అపర్ణ తన కొడుకు పెళ్లి కొడుకు వచ్చాడని సంబరంగా హారతి పళ్ళెం పట్టుకుని వస్తుంది. రాజ్ ఎక్కడ అని ఇంట్లో వాళ్ళని అడుగుతుంది కానీ ఎవరూ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోతారు. కాసేపటికి రాజ్ తన పక్కన కావ్య వచ్చి నిలబడేసరికి ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది ఏం జరిగిందని అందరినీ నిలదీస్తుంది. రాజ్ స్వప్న పెళ్లి ఇష్టం లేదని చెప్పి లెటర్ రాసి వెళ్ళిపోయిన విషయం కావ్య ముసుగు వేసుకుని వచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్న విషయం మొత్తం చెప్తాడు. వీళ్ళు అబద్ధాలు ఆడారు, మనల్ని మోసం చేశారు, మోసగాళ్ల కుటుంబం అని కావ్య వాళ్ళని రాజ్ తిడతాడు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి ఇష్టం లేని అమ్మాయినిచ్చి ఎందుకు పెళ్లి చేశారని భర్త శుభాష్ ని అపర్ణ ప్రశ్నిస్తుంది. మండపంలో జరిగిన విషయం మొత్తం వాళ్ళు చెప్తారు. అదంతా రుద్రాణి చూస్తూ మనసులోనే ఆనందపడుతుంది. దీనికి కొనసాగింపే ఈ ప్రోమో.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

టాప్ హెడ్ లైన్స్

Maa Inti Bangaram OTT : ఓటీటీలోకి మా ఇంటి బంగారం - సమంత యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మా ఇంటి బంగారం - సమంత యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Embed widget