Guppedanta Manasu March 11th: బయటకు వెళ్లిపొమ్మన్న రిషి, ఇంట్లోనే మీటింగ్ పెట్టేసిన వసు - అయోమయంలో దేవయాని!
Guppedantha Manasu March 11th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు మార్చి 11 ఎపిసోడ్
అత్తారింట్లో అడుగుపెట్టిన వసుధార...గెస్ట్ రూమ్ లోకి వెళుతుంది. ఇన్నాళ్లు ఈ గెస్ట్ రూమ్ లోకి గెస్ట్ గా వచ్చాను కానీ ఇప్పుడు ఈ ఇంటి మనిషిగా వచ్చాను అదే రూమ్ అదే మనిషి కానీ ఏ మనసులో ఏదో తెలియని ఆనందం అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి వచ్చి అదేంటో వసుధార అనుకోకుండా ఇవాళే రూమ్ సర్ది పెట్టాను అనడంతో నా కోసమే మేడం అని వసుధార ధరణిని హత్తుకుంటుంది. ఇన్ని రోజులు ఇంటికి గెస్ట్ గా వచ్చావు ఈరోజు ఇంటి మనిషిగా వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పిన ధరణి.. జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది.
ఆ తర్వాత రిషి నిద్రలేచి ఏంటి ఈరోజు ఏంటి ఇంతసేపు నిద్రపోయాను అనుకుంటూ మొబైల్ చూస్తూ ఏంటి ఈ పొగరు ఇంకా ఒక మెసేజ్ కూడా చేయలేదు అని అనుకుంటూ బయటకు వచ్చి చూస్తాడు. వసుధార తులసికోట దగ్గర పూజ చేస్తుంటుంది..కలా నిజమా అనుకుని కాల్ చేస్తాడు.. ఆ తర్వాత కిందకు దిగుతాడు...పూజ గదిలో కనిపిస్తుంది.
రిషి: నువ్వేంటి ఇక్కడ
వసు: వచ్చాను సార్..ఇక్కడే ఉండేందుకు వచ్చాను
రిషి: ఇక్కడ ఉండడం ఏంటి
దేవయాని: సరిగ్గా నేనుకూడా ఇదే అడిగాను రిషి.
రిషి: తను వచ్చిన విషయం మీకు తెలుసా
దేవయాని: వసుధార వచ్చి చాలాసేపు అయింది వాళ్ళ నాన్నే స్వయంగా వచ్చి లగేజ్ ఇచ్చి మరీ దిగబెట్టి పోయారు. వాళ్ల నాన్నవినయం నటిస్తూనే ఎంత పొగరుగా మాట్లాడారో తెలుసా..ఇదేంటనివసుధారని అడిగితే తాళిబొట్టు చూపిస్తోంది...అంతా హక్కు అధికారం అంటోంది.. ఇదంతా నువ్వు ఆ పదిమందిలో నా భార్య అన్నందుకే.. ఆ మాట పట్టుకుని ఇంటికి వచ్చేసింది..దీనికి మీ అమ్మ వంత పాడింది.. జగతి, మహేంద్ర లు కూడా సపోర్ట్ చేస్తున్నారు.. ఇక మీ పెదనాన్న సంగతి సరేసరి... ఏంటి వసుధార అప్పుడు చాలా మాట్లాడావు ఇప్పుడేం మాట్లాడడం లేదు
రిషి: వసుధారా కం టు మై రూమ్ అని చెప్పి వెళ్లిపోవడంతో వెళ్ళొస్తాను మేడం అక్కడికి వెళ్లి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను అనంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది వసుధార. మేడం రిషిసార్ నన్ను మాత్రమే రమ్మన్నారంటూ ఝలక్ ఇచ్చి మరీ వెళుతుంది..
Also Read: అత్తారింట్లో అడుగుపెట్టిన వసు, మల్లెపూలు చూసి మురిసిన రిషి- దేవయానికి పెద్ద షాకే ఇది!
రిషి: అసలేంటి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు పైగా మీ నాన్న ఇక్కడ దిగబెట్టి వెళ్లారు
వసు:నిజాన్ని నేను నిజం చేసే ప్రయత్నంలో ఉన్నాను సార్
రిషి: ఆ నిజానిజాలు ఏంటో నీకు నాకు తెలుసు కదా .వచ్చేముందు ఒక్క మాటైనా చెప్పాలి కదా .అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు
వసు: మీ ఇష్టం సార్
రిషి: నా ఇష్టం ఏంటి నా అనుమతి తీసుకుని ఇంట్లోకి వచ్చావా
రిషి కాఫీ నాకు వద్దు అనడంతో వసుధార అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత రిషి జగతిని నిలదీస్తూ మీరు ఎందుకు ఏం మాట్లాడలేదు మేడం మీకు తప్పుగా అనిపించలేదా అని అడుగుతాడు.
జగతి: ఈ విషయంలో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు
రిషి: అంటే మీరు ఈ విషయాన్ని సమర్థిస్తున్నారా మేడం .
జగతి: నేను పదిమందిలో చెప్పిన మాటను నిజం అని అన్నావు వసుధార అది నిజం చేస్తోంది నాకు ఏం తెలియడం లేదు అయోమయంగా ఉంది అని అంటుంది జగతి.
అప్పుడు వసు జగతి కి ఫోన్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి అంటుంది.. ఇంట్లో మాట్లాడటం ఏంటి అనడంతో రండి మేడమ్ అంటుంది.
Also Read: మార్చి 11 రాశిఫలాలు, ఈ రాశివారు కోపం, దూకుడు రెండూ తగ్గించుకోవాలి
ఆ తరువాత వసు, జగతి,మహేంద్ర, ఫణింద్ర అందరు కలిసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంటారు. అంతలో అక్కడకి వచ్చిన రిషి..నన్ను పిలవలేదు అంటాడు. రిషిని ఎందుకు పిలవలేదని ఫణీంద్ర అడగడంతో...
వసు: ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడకుంటాం.. ప్రతి చిన్న విషయాన్ని ఎండీగారిని పిలవలేము కదా.. డిస్కస్ చేసుకుని ప్రపొజల్ ని పేపర్ పై రాసి ఎండీగారికి పంపించాలి కదా మేడం
జగతి: నన్ను ఇరికిస్తోంది అనుకుంటూ ఊ కొడుతుంది
రిషి: మరి కాలేజీలో మీటింగ్స్ కి ఎందుకు పిలుస్తున్నారు
మహేంద్ర: రిషి అన్నది నిజమే కదా
వసు: కాలేజీ లో జరిగే ప్రతి విషయం ఎండీగారి కనుసన్నల్లో జరగాలి...ఇది ఇల్లు కదా..ప్రతి విషయంలోనూ ఎండీగారిని ఇబ్బంది పెట్టలేం కదా
ఫణీంద్ర: బాగా చెప్పావ్ వసుధారా..రిషికి కాలేజీ విషయాలు ఇంట్లో డిస్కస్ చేయడం ఇష్టం ఉండదు
వసు: సార్ నేను ఏమైనా తప్పుచెప్పానా
రిషి: చేసిన విషయాలు ఒప్పుకోవడం అందరకీ సాధ్యంకాదులే వసుధారా...
మహేంద్ర: వీళ్లిద్దరూ వేరే టాపిక్ లోకి వెళ్లిపోతున్నారని ఆలోచించి...డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు
రిషి: ప్రోటోకాల్ ప్రకారం పేపర్ పై రాసి పంపించండి.. అద్భుతమైన ఐడియాలు చర్చించండి.. అనేసి వెళ్లిపోతాడు
ఫణీంద్ర కూడా వెళ్లిపోతాడు... మహేంద్ర ఇంకేదో మాట్లాడుతుండగా...మీటింగ్ అయిపోయిందనేసి వసుధార కూడా వెళ్లిపోతుంది
ఏంటి జగతి వీళ్లిద్దరూ ఎప్పుడూ ఇంతేనా అని మహేంద్ర అంటే.. ఇద్దరకీ ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ అని రిప్లై ఇస్తుంది. మరెందుకు వాదించుకుంటారని మహేంద్ర అంటే.. ఇద్దరూతెలివైన వాళ్లు, ఆత్మాభిమానం ఉన్నవారు అదే సమస్య అంటుంది జగతి. రిషి-వసుధార మధ్య దూరం ఎప్పుడు తగ్గుతుందన్న మహేంద్రతో... వాళ్ల మధ్య దూరాన్ని వాళ్లే తగ్గించుకుంటారనే భరోసా ఇస్తుంది జగతి...శుభం అంటాడు మహేంద్ర....