News
News
X

Gruhalakshmi July 9th Update: బెడిసికొట్టిన లాస్య ప్లాన్, చుక్కలు చూపించిన తులసి- పోటీలో అదరగొట్టిన ప్రేమ్

పాటల పోటీలో ప్రేమ గెలవకుండా చేయాలని లాస్య స్కెచ్ వేస్తుంది. ఎప్పటిలాగానే దానికి భాగ్య కూడా సహకరిస్తుంది. మరి ప్లాన్ సక్సెస్ అయిందే లేదో చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

ఈ లాస్య చెప్పా పెట్టకుండా ఎక్కడికి పోయింది, కొంపతీసి తులసక్కతో మళ్ళీ గొడవ ఎందుకని పారిపోయిందా ఏంటి అని భాగ్య అనుకుంటుంటే అప్పుడే ఈ లాస్య అంతా పిరికిది కాదంటూ ఎంట్రీ ఇస్తుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావ్ లాస్య బావ గారు తెగ కంగారు పడిపోతున్నారని భాగ్య అంటుంది. కంగారు పడాల్సింది మీ బావగారు కాదు తులసి.. తన కొడుకే గెలుస్తాడని అందరూ తెగ ఎగురుతున్నారు కదా వాళ్ళకి బుద్ధి చెప్పాలిగా అందుకే వెళ్లానని చెప్తుంది. ప్రేమ్ పాటల పోటీలో ఓడిపోయేలా చేసేందుకు లాస్య ఒక మందు తీసుకుని వస్తుంది. మరో వైపు పాటల పోటీ మొదలవుతాయి. ఫైనల్ లో గెలిచిన వాళ్ళకి రూ.5 లక్షలు ప్రైజ్ మని ఇవ్వడం జరుగుతుందని ఎనౌన్స్ చేస్తారు. ఫైనల్ రౌండ్ లో విజేతని ప్రేక్షకులే సెలెక్ట్ చేస్తారని యాంకర్ చెప్తుంది. ఇక జ్యూస్ లో లాస్య మందు కలిపి అది ప్రేమ్ కి ఇవ్వమని అక్కడ సర్వ్ చేసే వ్యక్తికి ఇస్తుంది. అది ప్రేమ్ తీసుకోవడంతో లాస్య భాగ్య సంబరపడతారు. 

Also Read: రిషి మనసులో దాగని ప్రేమ, వసు కళ్లుతిరిగి పడిపోయిందనగానే కంగారుపడిపోయిన ఈగో మాస్టర్

అందరూ ఒకరి తర్వాత పాటలు పాడుతుంటారు. ఇక ప్రేమ్ దగ్గుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు అది గమనించిన తులసి ఏమైందని కంగారుపడుతుంది. అది చూసి లాస్య, భాగ్య తెగ ఆనందపడతారు. ప్రేమ్ ని పాడటానికి స్టేజ్ మీదకి పిలుస్తారు. ప్రేమ్ వెళ్ళి సూపర్ గా పాడటం మొదలుపెడతాడు. అదేంటి ఇప్పటి వరకు ఉన్న దగ్గు ఏమైపోయిందని లాస్య అంటుండగా  తనకి విపరీతంగా దగ్గు వస్తుంది. ఏమైందని నందు అడుగుతాడు. ఏమి లేదని చెప్పి బయటకి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టినట్లు ప్రకటిస్తారు. ఇక లాస్య దగ్గలేక అవస్థలు పడుతుంది. ప్రేమ్ కి దగ్గు తెప్పిస్తానని చెప్పి నువ్వు దగ్గుతున్నావెంటీ లాస్య అని భాగ్య అడుగుతుంటే అప్పుడే తులసి ఎంట్రీ ఇస్తుంది. తను తెచ్చుకోలేదు నేనే తెప్పించానని చెప్తూ తులసి ఎంట్రీ ఇస్తూ లాస్యకి వాటర్ బాటిల్ అందిస్తుంది. నేను వెనకటి తులసిని కాదు మారిపోయానని చెప్పాను కానీ మీ బుర్రలకి ఎక్కడం లేదని చీవాట్లు పెడుతుంది. నువ్వు ప్రేమ్ కి జ్యూస్ పంపిస్తున్నపుడే నేను చూశాను, నువ్వేదో తింగరి పని చేస్తున్నవని గ్రహించి జ్యూస్ గ్లాస్ మార్చేశానని చెప్తుంది. నువ్వు ప్రేమ్ కి పంపించిన గ్లాస్ నేను నీకు వచ్చేలా చేశానని చెప్పడం తో లాస్య వాళ్ళు బిత్తరపోతారు. దగ్గలేక లాస్య నానా అవస్థలు పడుతుంది. నా జోలికి వస్తేనే నిన్ను రోడ్డు  మీద పరిగెత్తించాను, నా పిల్లల జోలికి వస్తే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇస్తుంది.

Also Read: హిమ క్యాన్సర్ నాటకాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న శోభ, మరింత పగ పెంచుకున్న శౌర్య

ఇక తులసి అక్కడే ఉన్న తులసి మొక్క ఆకులు ఇచ్చి ఇవి వేసుకో దగ్గు తగ్గుతుందని చెప్పి వెళ్ళిపోతుంది. ఎట్టి పరిస్థితులలోనూ ప్రేమ్ ని గెలవనివ్వను ఓట్లు కొనేస్తానని లాస్య మళ్ళీ తన వంకర బుద్ది చూపిస్తుంది. ప్రేమ్ టెన్షన్ పడుతుంటే తులసి ధైర్యం చెప్తుంది. జరిగేది పాటల పోటీల అనిపించడం లేదు మన ఫ్యామిలీ వార్ లాగా అనిపిస్తుందని అభి అంటే అందుకు తులసినే కారణం అని నందు అంటాడు. ఇక ఫైనల్ రౌండ్ లోకి రక్షిత్ , ప్రేమ్ సెలెక్ట్ అయినట్లు ప్రకటిస్తారు. లాస్య, భాగ్య ఆడియన్స్ లోకి వెళ్ళి రక్షిత్ ని గెలిపించమని అడుగుతారు. అది గమనించిన నందు ఎందుకు ఇదంతా అని అనడంతో లాస్య తిడుతుంది. ఇక ప్రేమ్ 'అమ్మ' గురించి తెలిపే విధంగా అద్భుతంగా పాట పాడటంతో హాల్ అంతా చప్పట్లతో మార్మోగిపోతుంది. 

తరువాయి భాగంలో.. 

ఇద్దరూ ఇద్దరే అయిన గెలుపు మాత్రం ఒక్కరిదే. ఆ ఒక్కరూ ఎవరో మీరే తేల్చాలని యాంకర్ ఆడియన్స్ కి చెప్తుంది. ఇక ఒక్క ఓటు తేడా తో గెలుపొందిన విన్నర్ అని చెప్తుంటే అందరూ టెన్షన్ గా వింటూ ఉంటారు. 

 

Published at : 09 Jul 2022 08:55 AM (IST) Tags: Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Seial

సంబంధిత కథనాలు

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

టాప్ స్టోరీస్

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల