Gruhalakshmi August 31st Update: నిజం తెలుసుకుని షాకైన సామ్రాట్- నందు, తులసీల సవాల్, అభి-ప్రేమ్ ల మాటల యుద్ధం
తులసి మ్యూజిక్ స్కూల్ భూమి పూజ చెడగొట్టాలని అభి, లాస్య చేతులు కలిపి ప్లాన్ వేస్తారు.
పంతులుగారు చెప్పిన మాట మీకేవరికి తప్పుగా అనిపించలేదా అని అభి అందరినీ అడుగుతాడు. ఏం సంబంధం లేని వీళ్లిద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి భార్య భర్తల సంబంధం అంటూ చాలా గొప్పగా చెప్తున్నారు ఇది తప్పు కాదా సామ్రాట్ గారు అని అభి అడుగుతాడు. లేనిపోనీవి ఊహించుకుని ఆవేశపడుతున్నావ్ తొందరపడి మాట జారకు ఇది సమయం కాదని తులసి హెచ్చరిస్తుంది. నేను ఆడగాల్సిన ప్రశ్నలు నన్ను ఆడగనివ్వు మామ్ నువ్వు మధ్యలో అడ్డు పడకు అని అభి అంటాడు. అనసూయ సర్ది చెప్పడానికి చూస్తే సామ్రాట్ ఆపుతాడు.
అభి: ఎటువంటి అర్హత లేని మా మామ్ ని నమ్మి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు
సామ్రాట్: అర్హత లేదని నువ్వు అనుకుంటున్నావ్ ఉందని నేను అనుకుంటున్నా
అభి: ఇదే డ్రామా అంటే.. ఎంతో అనుభవం ఉన్న నందగోపాల్ గారి ప్రాజెక్ట్ మీ కళ్ళకి ఆనలేదు ఇన్వెస్ట్ చెయ్యాలని అనిపించలేదు. కేవలం మా మామ్ ప్రాజెక్ట్ మాత్రమే గొప్పగా అనిపించింది అంతేనా.. ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు ఏం ఆశించారు?
సామ్రాట్: చూడు అభి మీ అమ్మని నువ్వు ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు, ఏదో సాధించాలన్న పట్టుదల ఆమెలో నీకు కనిపించడం లేదా?
ప్రేమ్: కనపడవ్ ఎందుకంటే వాడు గుడ్డోడు..
అభి: సామ్రాట్ గారు మామ్ కి దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నారు, అందుకే ఇదంతా చేస్తున్నారు అది మీకు అర్థం కావడం లేదు
తులసి కోపంగా అభి అని అరుస్తుంది.
Also Read: మాధవ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య-సూపరంటే సూపర్ అంతే
అభి: నేను నిన్ను అనుమానించడం లేదు మామ్ ఆయన్ని అనుమానిస్తున్నా, ఆయన్నే సమాధానం చెప్పనివ్వు
దీపక్: చెప్పరు మతిలేని నీ ప్రశ్నలకి దేవుడు లాంటి సామ్రాట్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు నిన్ను రెచ్చగొట్టి మీ నాన్న నిన్ను ఇలా మాట్లాడిస్తున్నాడు పండగలాంటి వాతావరణం చెడగొట్టి గొడవ జరిగేలా చేస్తున్నాడు. మీ నాన్న మా అక్కని ఎదగకుండా చేశాడు ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకుని మళ్ళీ అదే పని చేస్తున్నాడు నాశనం అయిపోతారు
నందు: నీకు చాలా ఎక్కువైంది, వాడు కడుపు మంది మాట్లాడితే దానికి నాకు లింకు పెడతావ్ ఏంటి ఏం మాట్లాడినా ఊరుకుంటాను అనుకుంటున్నావా మర్యాద ఇచ్చి మాట్లాడు
దీపక్: మా అక్క మొగుడిగా ఉన్నంత కాలం మర్యాద ఇచ్చాను అది నిలబెట్టుకోలేకపోయావ్ దిగజారి ప్రవర్తించావ్, విడాకుల దాకా తీసుకొచ్చావ్
నందు: విడాకుల దాకా తీసుకొచ్చింది నేను కాదు మీ అక్క
సామ్రాట్: అంటే.. తులసి గారి మాజీ భర్తవి నువ్వా.. ఇది నిజమా తులసి గారు
అభి: ఇప్పుడు సమస్య అది కాదు తులసిగారు మా మామ్ గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారో అది చెప్పండి
మీ అమ్మ నేర్పిన సంస్కారం ఎటు పోయింది రా నీ మైండ్ ఎవరు ఇంతగా పొల్యూట్ చేశారు ఇక్కడి నుంచి వెళ్లిపో అని పరంధామయ్య కోపంగా చెప్తాడు. దీంతో అభి వెళ్ళిపోతాడు. చేతులు జోడించి నా పెద్దరికాన్ని పోగొట్టుకున్నాను అని పరంధామయ్య క్షమించమని అడుగుతాడు.
Also Read: వంటింట్లో ఇల్లాలు - ఇంట్లో ప్రియురాలు -బావుందయ్యా డాక్టర్ బాబు!
ఇంటికి వచ్చిన అందరూ అభిని తిడతారు. ప్రేమ్, అభి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. శ్రుతి ఈ విషయం గురించి మాట్లాడినట్టు ఇంట్లో చెప్తుంది. ‘మనసులో వేరే ఆలోచన పెట్టుకుని మా ఆంటీకి ఇన్వెస్ట్ చేస్తున్నారా అని ఓపెన్ గా అడిగేశాను అనుమానంతో కాదు అందరి అనుమానాలు తీర్చాలని అడిగాను. 'ఆయన మనసులో ఆంటీ మీద గౌరవం తప్ప మరో ఉద్దేశం లేదని చెప్పారు. ఆంటీ ఎదుగుదలకి హెల్ప్ చెయ్యాలని ఆలోచన తప్ప వేరేది లేదని అన్నారు. తులసి ఆంటీ కేవలం తన బిజినెస్ పార్టనర్ మాత్రమే’ అని క్లారిఫై చేశారని శ్రుతి చెప్తుంది.
నందు ఇంటికి వచ్చి కోపంతో రగిలిపోతాడు. ఏ నిజాన్ని అయితే మనం దాచాలని ఆరాటపడ్డాం అది నీ నోటితోనే చెప్పేశావ్ అని లాస్య తిడుతుంది. తులసి చాలా తెలివిగా దీపక్ తో నిన్ను రెచ్చగొట్టేలా చేసి నీ నోటితోనే నిజం బయట పెట్టేలా చేసిందని అంటుంది. తులసి దాన్ని క్యాష్ చేసుకుని మన ఉద్యోగాలు పోయేలా చేస్తుందని అంటుంది. నా కళ్ల ముందు ఇంత అవమానం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని నందు అంటాడు. తులసి ఎదిగినా నేను ఒప్పుకుంటాను కానీ నన్ను తొక్కి తను ఎదగాలనుకుంటే నేను సహించలేనని నందు కోపంగా చెప్తాడు.
తరువాయి భాగంలో..
నందు, లాస్య తులసి ఇంటికి వస్తారు. నాకు సమస్యలు సృష్టించి నన్ను ఎదగకుండా ఏమి చేయలేరని తులసి సవాల్ చేస్తుంది. ఎదగడానికి నువ్వు ఎంత ప్రయత్నించినా నేను నీ కంటే ఎత్తులోనే ఉంటాను అని నందు అంటే కానీ మీరు నాముందు తలవంచే ఉంటారని తులసి అంటుంది. నేను మీ ముందు తల ఎత్తుకునే ఉంటానని చెప్తుంది.