Pakka Commercial: 'పక్కా కమర్షియల్' ట్రైలర్ గ్లింప్స్ చూశారా?
ఇప్పటికే 'పక్కా కమర్షియల్' సినిమా నుంచి రెండు పాటలను, టీజర్ ను విడుదల చేశారు. ఇప్పుడేమో ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.
![Pakka Commercial: 'పక్కా కమర్షియల్' ట్రైలర్ గ్లింప్స్ చూశారా? Gopichand Starrer Pakka Commercial Trailer Glimpse Pakka Commercial: 'పక్కా కమర్షియల్' ట్రైలర్ గ్లింప్స్ చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/08/531ec8dec76037f4cf5c46abc2ebb2e3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'సీటీమార్' సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న గోపిచంద్.. ప్రస్తుతం 'పక్కా కమర్షియల్' అనే సినిమాలో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
జూలై1, 2022న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. ఇప్పటికే సినిమా నుంచి రెండు పాటలను, టీజర్ ను వదిలింది. ఇప్పుడేమో ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ట్రైలర్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. దీన్ని గ్లింప్స్ అని కూడా అనలేం. మహా అయితే ఐదు సెకన్ల పాటు హీరో ఎంట్రీ చూపించి.. జూన్ 12న పూర్తి ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని చెప్పారు.
ఈ సినిమాలో గోపీచంద్, రాశి ఇద్దరూ లాయర్లుగా కనిపించనున్నారు. గోపీచంద్ ను చాలా స్టైలిష్ గా ప్రెజంట్ చేస్తున్నారు. మారుతి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు యాక్షన్, కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయట. సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు నటించిన ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తుండగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
Also Read: మా సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉండదు - 'అంటే సుందరానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయ
Also Read: రోలెక్స్ సర్ కి రోలెక్స్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ - రేటెంతో తెలుసా?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)