This Week Telugu Release Movies: ఈ వీకెండ్ అదిరిపోయే మూవీస్ - ఓటీటీలో ఒకే రోజు 10 సినిమాలు
ఎప్పటి లాగే ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. ‘ఈగల్’ ఈ వారం ప్రేక్షకుల ముందుక రానుండగా, ఓటీటీలో ఒకే రోజు 10 మూవీస్ విడుదల అవుతున్నాయి.
![This Week Telugu Release Movies: ఈ వీకెండ్ అదిరిపోయే మూవీస్ - ఓటీటీలో ఒకే రోజు 10 సినిమాలు February 2nd Week 2024 Telugu OTT And Theatrical Releases This Week Telugu Release Movies: ఈ వీకెండ్ అదిరిపోయే మూవీస్ - ఓటీటీలో ఒకే రోజు 10 సినిమాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/ff02ba5623951d5c2ee94843f785ac3a1707381518157544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
This Week OTT And Theatrical Releases: శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ అభిమానులకు పండగే పండగ. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ పలు సినిమాలు అందుబాటులోకి వస్తాయి. ఇక ఈ వారం పెద్ద సినిమాలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన చిత్రాలు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. థియేటర్లలోనూ పలు సినిమాలు అలరించబోతున్నాయి. ఇంతకీ ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీల్లో సందడి చేసే సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వీకెండ్ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు
ఇక సంక్రాంతికి విడుదలైన పెద్ద సినిమాల్లో ఇప్పటికే విక్టరీ వెంకటేస్ ‘సైంధవ్’ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మహేష్ బాబు ‘గుంటూరుకారం’, తమిళ హీరో ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, తమిళ నటుడు శివ కార్తికేయన్ ‘అయలాన్’ ఈ వారంలో ప్రేక్షకులను అలరించనున్నాయి. అటు భూమి పెడ్నేకర్ ‘భక్షక్’ క్రైమ్ థ్రిల్లర్, సుస్మితా సేన్ ‘ఆర్య’ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
అమెజాన్ ప్రైమ్
⦿ కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి 09
డిస్నీప్లస్ హాట్ స్టార్
⦿ ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-09
నెట్‌ఫ్లిక్స్
⦿ వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08
⦿ గుంటూరు కారం(తెలుగు మూవీ)- ఫిబ్రవరి 09
⦿ భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09
⦿ లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09
⦿ యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09
⦿ ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09
⦿ ఆల్ఫా మేల్స్ - సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09
⦿ హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10
⦿ బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11
జీ5
⦿ కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09
జియో సినిమా
⦿ హలో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 8
సన్ నెక్ట్స్
⦿ అయలాన్- (తమిళ్, తెలుగు డబ్బింగ్ ఆలస్యం కావచ్చు)- ఫిబ్రవరి 09
ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
1. యాత్ర 2- ఫిబ్రవరి 8న విడుదల
ఏపీ సీఏం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ ఇవాళ (ఫిబ్రవరి 8న) థియేటర్లలోకి అడుగు పెట్టింది. జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కనిపించారు. ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహించాడు. భారతి పాత్రను కేతకీ నారయణన్ పోషించింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది.
2. ఈగల్- ఫిబ్రవరి 9న విడుదల
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ మూవీ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. సంక్రాంతి అనంతరం తెలుగులో రిలీజ్ అవుతోన్న పెద్ద సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
Read Also: అందులో రష్మిక పేరు లేకపోవడం ఏంటి? ఆశ్చర్యం వ్యక్తం చేసిన ‘యానిమల్‘ దర్శకుడు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)